Home Blog Page 302

Zero Shadow Day Hyderabad: ఈరోజు హైదరాబాద్ లో ఖగోళ వింత.. చూడడానికి సిద్ధం కండి..

Zero Shadow Day Hyderabad: మండుటెండలో మన వెంట ఎప్పుడూ నీడ ఉంటుంది. కానీ ఎండలో ఉన్నా కూడా నీడ కనిపంచకపోవడం ఎప్పుడైనా గమనించారా..? ఒక్కసారిగా నీడ కనిపించకుండా పోతే ఎలా ఉంటుంది? ఇదే అరుదైన ఖగోళ వింత మే 9న Hyderabadలో కనిపించనుంది. మధ్యాహ్నం సుమారు 12.12 గంటల సమయంలో కొన్ని క్షణాల పాటు వస్తువుల నీడలు కనిపించకుండా పోతాయి. దీనిని శాస్త్రవేత్తలు ‘ జీరో షాడో డే’గా పిలుస్తారు. అసలు ఇలా ఎందుకు ఏర్పడుతుంది? గతంలో ఏ నగరంలో ఇలా జరిగింది..?

భూమి పరిభ్రమణం, సూర్యుడి కిరణాలు భూమిపై పడే కోణం కారణంగా ఈ అరుదైన ఘటన ఏర్పడుతుంది. సాధారణంగా సూర్యకిరణాలు ఒక కోణంలో పడటంతో మనకు నీడ కనిపిస్తుంది. కానీ సంవత్సరంలో కొన్ని ప్రత్యేక రోజుల్లో సూర్యుడు భూమిపై ఉన్న కొన్ని ప్రాంతాలకు నేరుగా తలపైకి వస్తాడు. ఆ సమయంలో సూర్యకిరణాలు సుమారు 90 డిగ్రీల కోణంలో నిటారుగా పడటంతో నీడ వస్తువుల కిందకు చేరిపోతుంది. దీంతో నీడ కనిపించకుండా పోయినట్టుగా అనిపిస్తుంది.

కర్కాటక రేఖ, మకర రేఖ మధ్య ఉన్న ప్రాంతాల్లోనే ఈ దృశ్యం కనిపిస్తుంది. భారతదేశంలోని అనేక నగరాల్లో ప్రతి ఏడాది ఒక్కసారి లేదా రెండుసార్లు ఈ జీరో షాడో డే కనిపిస్తుంది. ఈసారి Hyderabadలో ఈ వింత చోటుచేసుకోనుంది. అయితే గతంలో ఏప్రిల్ 24న బెంగుళూరు లో కూడా ప్రజలు ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించారు. ఇలాంటి సమయంలో నిలువుగా ఉన్న వస్తువులు ఉదాహరణకు స్తంభాలు, బాటిళ్లు, చెట్లు లేదా మనుషులు వాటి నీడలను స్పష్టంగా చూపించవు. కాసేపటి పాటు నీడలు పూర్తిగా మాయమైనట్టుగా కనిపిస్తాయి. విద్యార్థులు, ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారికి ఇది ఒక ప్రత్యేక అనుభవంగా భావిస్తారు.

జీరో షాడో డే అనేది ఎలాంటి అద్భుతం లేదా ప్రమాదకర ఘటన కాదు. ఇది పూర్తిగా ఖగోళ శాస్త్రానికి సంబంధించిన సహజ ప్రక్రియ మాత్రమే. భారతదేశంలో ఉన్న ఖగోళ పరిశోధనా సంస్థలు, సైన్స్ సెంటర్లు ప్రజలకు ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటాయి. శాస్త్రవేత్తల ప్రకారం.. ఈ ఘటన ద్వారా భూమి అక్ష వంగుదల, సూర్యుడి స్థాన మార్పులు, ఋతు మార్పుల గురించి సులభంగా అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ రోజును ఖగోళ శాస్త్ర ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

Tati Munjalu Summer Benefits: వేసవిలో తాటి ముంజలు ఇచ్చే 5 బెనిఫిట్స్ ఇవే.. వెంటనే తెలుసుకోండి..

0

Tati Munjalu Summer Benefits: వేసవి కాలం రాగానే చాలా మంది చల్లదనం కోసం పరితపిస్తుంటారు. ఇలాంటి సమయంలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు అవసరమైన పదార్థాలను తింటూ ఉంటారు. ఇలాంటి సమయంలో మార్కెట్లో తాటి ముంజలు (Ice Apple) విరివిగా కనిపిస్తాయి. తాటి ముంజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సహజసిద్ధంగా చల్లదనాన్ని ఇచ్చే ఈ పండును చాలామంది ‘నేచురల్ సమ్మర్ కూలెంట్’ అని కూడా పిలుస్తారు. నీటి శాతం ఎక్కువగా ఉండే తాటి ముంజలు శరీరానికి తక్షణ శక్తిని అందించడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయి. ముఖ్యంగా ఎండాకాలంలో వీటిని తినడం వల్ల శరీరానికి ఉండే 5 ప్రయోజనాలు ఏవో తెలుసుకుందాం..

ఎండ వేడి నుంచి రిలీఫ్:
తాటి ముంజల్లో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి సహజమైన చల్లదనం లభిస్తుంది. తీవ్రమైన ఎండలో బయట తిరిగిన తర్వాత తాటి ముంజలు తింటే శరీరానికి వెంటనే రిలీఫ్ లభిస్తుంది. హీట్ స్ట్రోక్, అలసట వంటి సమస్యలు తగ్గడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి.

డీహైడ్రేషన్ నుంచి విముక్తి:
వేసవిలో చెమట ఎక్కువగా పడటంతో శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. తాటి ముంజల్లో ఉండే ఎలక్ట్రోలైట్స్, మినరల్స్ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడతాయి. తరచూ తాటి ముంజలు తీసుకుంటే నీరసం, దాహం, బలహీనత వంటి సమస్యలు తగ్గుతాయి.

మలబద్ధకం సమస్య నివారణ:
తాటి ముంజల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. వేసవిలో ఎక్కువగా బయట ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తుంటాయి. అలాంటి సమయంలో తాటి ముంజలు తింటే కడుపు తేలికగా ఉండి జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.

బీపీ కంట్రోల్:
తాటి ముంజల్లో పొటాషియం వంటి ఖనిజాలు ఉండటంతో రక్తపోటు నియంత్రణలో సహాయపడతాయి. శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేసి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇవి ఉపయోగపడతాయి. వేసవిలో అధిక వేడి కారణంగా బీపీ మార్పులు ఎదుర్కొనే వారికి తాటి ముంజలు మంచి సహజ ఆహారంగా చెప్పొచ్చు.

ఏసిడిటీ సమస్య నివారణకు:
వేసవిలో మసాలా ఆహారం, వేడి కారణంగా చాలామందికి ఏసిడిటీ, గ్యాస్ సమస్యలు వస్తుంటాయి. తాటి ముంజలు శరీరానికి చల్లదనం ఇవ్వడంతో పాటు కడుపులో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. కడుపును శాంతపరచే గుణాలు వీటిలో ఉండటంతో ఏసిడిటీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

Lakshman Rekha: ‘లక్ష్మణ రేఖ’కు అర్థం ఏంటీ.. ఈ పదాన్ని ఎందుకు వాడుతారు..

Lakshman Rekha: ‘లక్ష్మణ రేఖ’ అనే పదం భారతీయ సంస్కృతిలో ఒక ప్రతీకగా మారిపోయింది. ఎవరైనా తమ హద్దులు దాటితే, నియమాలను ఉల్లంఘిస్తే ‘లక్ష్మణ రేఖ దాటారు’.. అని అంటారు. రాజకీయాలు, కుటుంబ వ్యవహారాలు, సామాజిక చర్చలు ఇలా అనేక సందర్భాల్లో ఈ పదం వినిపిస్తుంది. అయితే ఈ ప్రసిద్ధ ఘట్టం నిజంగా అసలు రామాయణంలో ఉందా? అన్న ప్రశ్నపై చాలా కాలంగా చర్చ కొనసాగుతోంది. ఈ పదం గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

‘లక్ష్మణ రేఖ’Ramcharitmanas వంటి భక్తి కాలపు రచనలు, జానపద కథనాలు, ప్రాంతీయ రామాయణాల్లో ఈ ప్రముఖంగా ప్రాచుర్యం పొందింది. కాలక్రమేణా ఇది ప్రజల ఊహాలోకంలో బలంగా స్థిరపడిపోయింది. తర్వాత నాటకాలు, హరికథలు, టీవీ సీరియల్స్, సినిమాలు ఈ భావనను మరింత ప్రజాదరణ పొందేలా చేశాయి. ‘లక్ష్మణ రేఖ’కు ప్రతీకాత్మక అర్థం కూడా ఉంది. అది కేవలం నేలపై గీసిన గీత కాదు.. భద్రత, ధర్మం, పరిమితి, నియంత్రణకు సూచికగా భావిస్తారు. ఆ గీత దాటితే ప్రమాదం వస్తుందనే భావనతో ఈ పదం సామెతలా మారిపోయింది. అందుకే కుటుంబాల్లోనూ, రాజకీయాల్లోనూ ‘లక్ష్మణ రేఖ దాటొద్దు’ అనే హెచ్చరిక తరచూ వినిపిస్తుంది.

కొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారం.. ఈ ఘట్టం తర్వాతి కాలంలో మహిళల భద్రత, కుటుంబ పరిమితులు, సామాజిక నియమాలపై సందేశం ఇవ్వడానికి జోడించబడిందని చెబుతారు. ముఖ్యంగా భక్తి యుగంలో రామకథను ప్రజలకు మరింత నైతిక బోధ కలిగించేలా చెప్పేందుకు ఈ అంశాన్ని చేర్చినట్టు భావిస్తారు. భారతదేశంలో మాత్రమే కాకండా ఇతర దక్షిణాసియా దేశాల రామాయణ రూపాల్లో కూడా లక్ష్మణ రేఖ కథనం కొన్ని చోట్ల కనిపిస్తుంది. అయితే ప్రతి రూపంలో దాని వివరణ వేర్వేరుగా ఉంటుంది. ఎక్కడో అది అగ్ని వలయంలా ఉంటే, మరెక్కడో దైవ శక్తితో కూడిన రక్షణ గీతగా వర్ణిస్తారు.

అయితే వాల్మీకి రామాయణం (Valmiki Ramayana) ప్రకారం చూస్తే.. సీతను రక్షించేందుకు లక్ష్మణుడు నేలపై గీత గీసినట్టు ఎక్కడా స్పష్టమైన ప్రస్తావన కనిపించదు అని కొందరు అంటున్నారు. అరణ్యకాండలో రాముడు మాయమృగం వెంట వెళ్లిన తర్వాత, రాముడి అరుపులు వినిపించడంతో సీత ఆందోళన చెందుతుంది. లక్ష్మణుడు మాత్రం అది మాయ అని చెబుతూ వెళ్లడానికి నిరాకరిస్తాడు. కానీ సీత తీవ్రంగా ఒత్తిడి చేయడంతో లక్ష్మణుడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అనంతరం రావణుడు సన్యాసి వేషంలో వచ్చి సీతను అపహరిస్తాడు. కానీ కొన్ని సినిమాల్లో మాత్రం లక్ష్మణుడు సీత భద్రత కోసం గీత గీసినట్లు చూపించారు. అయితే ఈ అంశం అసలు వాల్మీకి రచనలో లేదు. ఏదీ ఏమైనా ‘లక్ష్మణ రేఖ’ప్రజల మనసుల్లో అది రామాయణంలో విడదీయరాని ఘట్టంగా స్థానం సంపాదించుకుంది.

TANA Scholarship Webinar: అమెరికా ఉన్నత విద్యపై తానా వెబినార్‌.. విద్యార్థులకు విలువైన మార్గదర్శనం

TANA Scholarship Webinar: అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని ఆశపడుతున్న తెలుగు విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచే విధంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్-అట్లాంటిక్ విభాగం నిర్వహించిన “తానా స్కాలర్‌షిప్ వెబినార్” విజయవంతంగా ముగిసింది. కొత్తగా కాలేజీల్లో చేరబోయే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కాలేజీ అడ్మిషన్లు, స్కాలర్‌షిప్ అవకాశాలు, విద్యా ప్రణాళికలపై సమగ్ర అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా నిలిచింది.

TANA Scholarship Webinar
TANA Scholarship Webinar

ఈ వెబినార్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో హాజరై ఆసక్తిగా పాల్గొన్నారు. అమెరికాలో ఉన్నత విద్యకు సంబంధించిన అవకాశాలు, కాలేజీ దరఖాస్తుల ప్రక్రియ, స్కాలర్‌షిప్‌లు పొందేందుకు అనుసరించాల్సిన మార్గాలు వంటి అంశాలపై నిపుణులు విలువైన సూచనలు అందించారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులు తమ ప్రొఫైల్‌ను ఎలా బలోపేతం చేసుకోవాలి, విద్యా లక్ష్యాలను ఎలా సాధించాలి అనే అంశాలపై కూడా ప్రత్యేక చర్చలు నిర్వహించారు.

TANA Scholarship Webinar
TANA Scholarship Webinar

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తానా అధ్యక్షులు డా. నరేన్ కొడాలి, బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి, మిడ్-అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి, బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు, ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ వెంకటరావు అడుసుమల్లి అందించిన సహకారం కీలకమైంది. కార్యక్రమం నిర్వహణలో వారి కృషిని పాల్గొన్న వారు అభినందించారు.

TANA Scholarship Webinar
TANA Scholarship Webinar

అమెరికాలో కాలేజీ అడ్మిషన్ల కోసం ఉపయోగపడే ప్రత్యేక స్కాలర్‌షిప్ గైడ్‌ను హాజరైన విద్యార్థులకు తానా నాయకులు అందజేశారు. ఈ గైడ్ ద్వారా విద్యార్థులు తమ భవిష్యత్ విద్యా ప్రణాళికలను మరింత సమర్థవంతంగా రూపొందించుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి మాట్లాడుతూ.. “విద్యే భవిష్యత్ విజయాలకు బలమైన పునాది. ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులను ప్రోత్సహించడం, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడం, తదుపరి తరానికి సరైన దిశానిర్దేశం చేయడం తానా లక్ష్యం” అని పేర్కొన్నారు.

విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ, వారి విద్యా లక్ష్యాల వైపు ప్రేరేపించిన కాలేజీ కౌన్సెలర్, అకడమిక్ కోచ్ జో కేతార్ సేవలను తానా నాయకులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ వెబినార్ విద్యార్థులకు ఉన్నత విద్యపై స్పష్టమైన అవగాహన కల్పించడమే కాకుండా, వారి భవిష్యత్ ప్రయాణానికి మార్గదర్శకంగా నిలిచిందని పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు.

Today 9 May 2026 Horoscope: ఈ రాశి వ్యాపారులకు ఈరోజు లక్కీ డే.. ఎందుకంటే..

Today 9 May 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశులపై శని దేవుడి ప్రభావం వల్ల వ్యాపారులు ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు పొందుతారు. ఖర్చుల విషయంలో ఉద్యోగులు జాగ్రత్తలు పాటించాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): మేష రాశి వారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. గతంలో ఆగిపోయిన పనులను పూర్తి చేసుకుంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో చెడ్డ వహించాలి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి వ్యాపారం ఎప్పుడూ లాభాలు పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి పెద్దలను సంప్రదిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి ఇదే మంచి రోజు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు సమాజంలో గౌరవం పొందుతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం పెరుగుతుంది. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యంగా మెరుగ్గా ఉంటారు. ఇంట్లో జరిగే శుభకార్యం కోసం బిజీగా ఉంటారు. శని దేవుడి అనుగ్రహంతో పెండింగ్లో ఉన్న పనులను ఈరోజు పూర్తి చేసుకుంటారు. వ్యాపారులకు శుభవార్తలు అందుతాయి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు కొత్త పనులను ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యుల మద్దతుతో వ్యాపారులు ఎక్కువ లాభాలు పొందుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. విదేశాలకు వెళ్లాలని అనుకునేవారు శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడంతో సంతృప్తిగా గడుపుతారు. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల అండదండలతో వ్యాపారులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దీంతో కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. మరికొందరు అదనపు ఆదాయం పొందేందుకు మార్గం ఏర్పడుతుంది. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఇంటికి సంబంధించిన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు పలిస్తాయి. ఉద్యోగులు పదోన్నతిని పొందుతారు. గతంలో ఉన్న వివాదాల నుంచి బయటపడతారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు ఈరోజు కలిసి వస్తుంది.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త పనులను ప్రారంభిస్తారు. స్నేహితుల సహాయంతో అప్పులను తీరుస్తారు. ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చులు ఉంటాయి. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా వస్తువులు కొనుగోలు చేయాలి. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఇలాంటి వారితో ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా చేయాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి .

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యుల మద్దతుతో అధిక లాభాలు పొందుతారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉండడంతో ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగులు అదనపు ఆదాయం విషయంలో శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనులను పెండింగ్లో ఉంచకుండా పూర్తి చేస్తారు. అయితే ఇంట్లోని రహస్యాలు బయట వరకు వెళ్ళనీయకుండా ఉండాలి. కొత్త వ్యక్తులను నమ్మొద్దు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు శుభ ఫలితాలు పొందుతారు. ఇంట్లో జరిగే శుభకార్యం కోసం బిజీగా మారుతారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు దూర ప్రయాణాలు చేస్తారు. సొంత వాహనాలపై వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పనులను వెంటనే పూర్తి చేసుకోవాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వ్యాపారులు కొత్తగా లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు ముఖ్యమైన పనులు పూర్తికావడంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. పూర్వపు బకాయిలను తీరుస్తారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

Ravi Babu Comments On Star Heroes: స్టార్ హీరోలు చేస్తున్న పనిలో ఎలాంటి అర్థం లేదు.. అది కేవలం వాళ్ళ మూర్ఖత్వం : రవి బాబు

Ravi Babu Comments On Star Heroes: కెరీర్ ప్రారంభం నుండి పాత్ బ్రేకింగ్ సినిమాలు తీస్తూ , తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న డైరెక్టర్ రవిబాబు. ‘అల్లరి’ అనే చిత్రం తో మొదలైన ఈయన సినీ ప్రస్థానం హారర్ , క్రైమ్ థ్రిల్లర్ జానర్స్ తో పాటు లవ్ స్టోరీస్ తో కూడా ప్రేక్షకులను అలరించాడు. అయితే ఈమధ్య కాలం లో రవి బాబు నుండి సినిమాలు రావడం బాగా తగ్గిపోయాయి. ఆయన సినిమాలను థియేటర్స్ లో చూడాలని కోరుకునే ఆడియన్స్ కి ఇది కాస్త నిరాశే. అయితే చాలా కాలం తర్వాత ఆయన దర్శకత్వం వహించడమే కాకుండా, హీరో గా కూడా నటిస్తూ చేసిన చిత్రం ‘రేజర్’. నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలైన ఈ సినిమాకు థియేటర్స్ నుండి మిశ్రమ స్పందన లభించింది. అయితే విడుదలకు ముందు ఈ సినిమా ప్రొమోషన్స్ లో చాలా చురుగ్గా పాల్గొన్నాడు రవిబాబు.

అందులో భాగంగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో నేటి తరం పాన్ ఇండియన్ స్టార్స్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘ఒక సినిమా కోసం రెండు మూడేళ్ళ సమయం తీసుకోవడం అనేది మూర్కత్వనికి పరాకాష్ట. హాలీవుడ్ లో తెరకెక్కే అంతర్జాతీయ సినిమాల షూటింగ్స్ కి కూడా ఇంత సమయం తీసుకోరు. మన దగ్గర మేకర్స్ కి సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే , ఇలాంటివి జరుగుతున్నాయి. సినిమా మొదలు అవ్వకముందే ప్రీ ప్రొడక్షన్ పనులు పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి, సరైన అవగాహనా లేకుండా చేస్తే ఇలాగే ప్రతీ సినిమా ఏళ్ళ తరబడి సెట్స్ మీదనే ఉంటుంది. ఇండస్ట్రీ కి ఆదాయం లేకుండా పోతుంది , థియేటర్స్ మూత పడుతాయి’ అంటూ చెప్పుకొచ్చాడు రవిబాబు .

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘హాలీవుడ్ లో ట్రాన్స్ ఫార్మర్స్ లాంటి భారీ చిత్రాన్ని కూడా పర్ఫెక్ట్ ప్రణాళిక తో చేస్తారు. అక్కడ ఒక్కో షిఫ్ట్ లో 80 నుండి 100 షాట్స్ ని తెరకెక్కిస్తుంటారు. అది వాళ్ళ ప్లానింగ్ విధానం , పనులు ఆ కారణం చేత చాలా వేగంగా అవుతాయి. కానీ మన దగ్గర ఆ స్థాయి ప్రణాళికలు లేవు , అందుకే మన ఇండస్ట్రీ ఇప్పుడు దయనీయంగా తయారైంది’ అంటూ రవిబాబు చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారింది.

Peddi Movie Release: ‘పెద్ది’ దెబ్బకు పక్కకు జరిగిన 10 సినిమాలు.. ఇది మామూలు మాస్ కాదు..

Peddi Movie Release: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం ఎట్టకేలకు జూన్ 3 న ప్రీమియర్ షోస్ తో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అంటే సినిమా విడుదలకు కేవలం 26 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో మేకర్స్ ఇప్పుడు ఈ చిత్రానికి సంబందించిన ప్రమోషనల్ కార్యక్రమాలను గ్రాండ్ గా షెడ్యూల్ చేశారు. రెండు రోజులకు ఎదో ఒక ప్రమోషనల్ యాక్టివిటీ చేస్తూనే ఉండాలని ఫిక్స్ అయిపోయారు. అందులో భాగంగా నేడు విడుదల చేసిన మేకింగ్ వీడియో కి ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి పెద్ది సెట్స్ లోకి అడుగుపెట్టి, కాసేపు మూవీ టీం తో సరదాగా గడిపిన క్షణాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదంతా పక్కన పెడితే ‘పెద్ది’ ప్రభావం చిన్న సినిమాలపై చాలా బలంగానే పడిందని అంటున్నారు విశ్లేషకులు.

జూన్ 3 న సూపర్ స్టార్ మహేష్ నిర్మాతగా వ్యవవరించిన ‘రావు బహదూర్’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామంటూ ఇది వరకే అధికారికంగా ప్రకటించారు. సత్యదేవ్ ఈ చిత్రం లో హీరో, కానీ ఇప్పుడు ఈ సినిమాని ‘పెద్ది’ కారణంగా జులై 3 కి వాయిదా వేశారు. వెంకటేష్ మహా దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాకు మార్కెట్ లో మంచి క్రేజ్ ఉంది. ఇక ‘పెద్ది’ దెబ్బకు వాయిదా పడిన మరో చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో , నందిని రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాని మే 14 న విడుదల చేద్దామని ముందుగా అనుకున్నారు . అందుకు తగ్గట్టుగా ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేసుకున్నారు. కానీ షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉండడం తో జూన్ 4 కి వాయిదా వెయ్యాలని అనుకున్నారు. కానీ ‘పెద్ది’ జూన్ 4 న విడుదల అవ్వబోతుండడం తో , ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని జూన్ 19 కి వాయిదా వేశారు.

ఇలా చాలా సినిమాలే ఉన్నాయి. కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా విడుదల తేదీని వాయిదా వేసుకున్నాయి. అవన్నీ కలిపితే దాదాపుగా 10 సినిమాలు పెద్ది చిత్రాన్ని చూసి వెనక్కి వెళ్లాయని అంటున్నారు విశ్లేషకులు. సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత టాలీవుడ్ కి ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా దక్కలేదు. విడుదలైన చిన్న సినిమాలకు ప్రేక్షకులు థియేటర్స్ కి కదలడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే టాలీవుడ్ లో కరువు ఏర్పడింది. ఈ కరువు సమయం లో విడుదల అవ్వబోయే ‘పెద్ది’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయితే మాత్రం , ఒక నెల రోజుల పాటు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Nagarjuna 100th Movie Leaked Scene: లీకైన నాగార్జున 100వ సినిమా సన్నివేశం..ఈ రేంజ్ లో ఉందేంటి..

Nagarjuna 100th Movie Leaked Scene: అక్కినేని అభిమానులు ఇప్పుడు నాగార్జున వందవ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా ఆయన కెరీర్ లోనే ల్యాండ్ మార్క్ గా నిలుస్తుందని అంటున్నారు. సీనియర్ హీరోలందరూ వరుసగా సూపర్ హిట్స్ కొడుతూ నేటి తరం ఆడియన్స్ ని కూడా అలరిస్తుంటే , నాగార్జున క్యారెక్టర్ రోల్స్ , విలన్ రోల్స్ కి షిఫ్ట్ అవ్వడం అక్కినేని ఫ్యాన్స్ కి మింగుడు పడని విషయం అనేది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రజినీకాంత్ ‘కూలీ’ చిత్రం లో నాగార్జున పోషించిన విలన్ పాత్ర అభిమానులను తీవ్రమైన నిరాశకు గురయ్యేలా చేసింది. ఇలాంటి సమయం లో నాగార్జున నుండి హీరో గా భారీ కం బ్యాక్ ని కోరుకుంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. ఆ కం బ్యాక్ కచ్చితంగా 100 వ సినిమాతో జరుగుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు.

ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి ఎలాంటి కంటెంట్ బయటకు రాలేదు. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల కాలేదు. కానీ ఈ సినిమాలోని ఒక సన్నివేశానికి సంబంధించిన మేకింగ్ షాట్ సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. హీరోయిన్ టబు ని జనాలు కొట్టేందుకు ముందుకు రాగా, నాగార్జున ఆమెని కారు నుండి జాగ్రత్తగా బయటకు దింపి లోపలకు తీసుకెళ్తున్న షాట్ ని చూస్తుంటే , ఇదొక ఇంటెన్స్ యాక్షన్ చిత్రంగా అనిపిస్తోంది. నాగార్జున లుక్ ‘కూలీ’ చిత్రం లో ఎలా ఉందో, ఇందులో కూడా అలాగే ఉంది. ఈ షాట్ ని చూసిన తర్వాత అభిమానుల్లో ఈ చిత్రం పై మరింత నమ్మకం ఏర్పడింది. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు కార్తీక్ దర్శకత్వం వహించాడు. ఒక బడా సూపర్ స్టార్ ఈ చిత్రం లో క్యామియో రోల్ చేసే అవకాశం ఉందని , అది మెగాస్టార్ చిరంజీవి అవ్వొచ్చని చాలా రోజుల నుండి ఒక రూమర్ నడుస్తోంది , మరి ఈ రూమర్ లో ఎంత మాత్రం నిజముందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by @edaina_sare

Venu Swamy TVK Party: TVK పార్టీ పై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు.. ఆవేశంతో ఊగిపోతున్న విజయ్ ఫ్యాన్స్..

Venu Swamy TVK Party: సినీ , రాజకీయ సెలబ్రిటీల జాతకాలు చెప్తానంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడే వేణు స్వామి , ఎలాంటి తీవ్రమైన నెగెటివిటీ ని ఎదురుకుంటున్నాడో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా ఆయన పేరు అషు రెడ్డి మ్యాటర్ లో కూడా బలంగానే వినిపిస్తూ ఉంది. అయితే నాగ చైతన్య , శోభిత దంపతులు 2027 వ సంవత్సరం లో విడిపోతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి, తీవ్రమైన వ్యతిరేకత ఎదురుకోవడం వల్ల, వేణు స్వామి ఈ జాతకులకు ఫుల్ స్టాప్ పెట్టాడు. అయితే ఇప్పుడు ఆయన చిన్నగా మరోసారి తన స్వరాన్ని వినిపించేందుకు ముందుకు వస్తున్నాడు. రెండు రోజుల క్రితమే , భవిష్యత్తులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పార్టీ పెడతాడని , ముఖ్యమంత్రి అవుతాడని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న విజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు .

ఆయన మాట్లాడుతూ విజయ్ సీఎం గా ఎక్కువ కాలం కొనసాగాడని , ఆయన పదవి ఊడిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు . దీనిపై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. విజయ్ ఫ్యాన్స్ వేణు స్వామి పై తీవ్రమైన విమర్శలు చేస్తూ మండిపడుతున్నారు. గతం లో ఇలాగే చాలా చెప్పావు , వై ఎస్ జగన్ 2024 లో గెలుస్తాడని అన్నావు , కానీ కనీయం అతనికి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు, ప్రభాస్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతాయని అన్నావు , పాన్ ఇండియా ని షేక్ చేసే బ్లాక్ బస్టర్స్ రీసెంట్ గానే ఆయనకు పడ్డాయి , ఇలా ఒక్కటా రెండా ఎన్నో చెప్పావు అంటూ విజయ్ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. అయితే వేణు స్వామి జాతకం చెప్పలేదని , కేవలం ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను చూసే ఆయన ఈ కామెంట్స్ చేస్తున్నాడని , ఎందుకంటే విజయ్ కూటమిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాడని , ఆ ప్రభుత్వం ఎప్పటికైనా కూలిపోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్న దానినే వేణు స్వామి జాతకం గా చెప్పాడని అంటున్నారు విశ్లేషకులు.

TVK VCK alliance : TVK కు VCK మద్దతు ఇచ్చింది.. త్రిష నోట్లో మట్టి కొట్టింది..

TVK VCK alliance : తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. రేపు చెన్నైలో టీవీకే అధినేత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి టి వి కే తో పాటు, ఆ పార్టీకి మద్దతిస్తున్న కమ్యూనిస్టులు, వీసీ కే పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరు కాబోతున్నారు. శనివారం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం పూర్తి అయిన తర్వాత.. మంగళవారం లేదా బుధవారం మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రెండు మంత్రి పదవులు కేటాయించారు. కమ్యూనిస్టులకు మంత్రి పదవులు కేటాయించినప్పటికీ వారు ఒప్పుకోలేదు. వి సి కె పార్టీకి కూడా ఒక మంత్రి పదవి దక్కబోతున్నట్టు తెలుస్తోంది.

శుక్రవారం అనేక నాటకీయ పరిణామాల తర్వాత టీవీ కే కు కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వీసీ కే పార్టీ నేతలు మద్దతు పలికారు. వారి మద్దతుకు సంబంధించిన లేఖలను టీవీకే అధినేత విజయ్.. గవర్నర్ వద్దకు తీసుకెళ్లి చూపించారు. ఆ మద్దతు లేఖలను పరిశీలించిన గవర్నర్.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. రేపు ఉదయం చెన్నైలో విజయ్ ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారులు విజయ్ కి సీఎం కాన్వాయ్ ఏర్పాటు చేశారు. విజయ్ ఇంటి వద్ద భద్రతను పెంచారు.

వీసీకే పార్టీ మద్దతు ఇచ్చినప్పటికీ.. టీవీకే అధినేత విజయ్ కి విధించిన ఓ షరతు తమిళనాడు రాజకీయాలలో కలకలం రేపుతోంది. ఇటీవల ఎన్నికల్లో విజయ్ తిరుచి ఈస్ట్, పెరంబురు నియోజకవర్గాలలో పోటీ చేశారు. తిరుచి ఈస్ట్ స్థానంలో గెలిచినప్పటికీ రాజీనామా చేశారు. పెరంబుర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఆస్థానంలో త్రిషను పోటీలో పెట్టి.. ఎమ్మెల్యేగా గెలిపించి.. కేబినెట్ లోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. దీనికి తోడు గతంలో త్రిష ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు రాజకీయంగా ఎదగాలని ఉందని.. తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేయాలని ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో త్రిషకు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది.

మద్దతు ఇస్తూనే వీసీకే నేతలు టీవీకే అధినేత విజయ్ కి ఒక కండిషన్ పెట్టారు. తిరుచి ఈస్ట్ లో విజయ్ రాజీనామా చేసిన నేపథ్యంలో.. అక్కడ తన పార్టీ అధినేత తిరుమావలవన్ పోటీ చేస్తారని పేర్కొంది. ప్రస్తుతం ఆయన చిదంబరం పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అయితే దీనికి టీవీకే అంగీకరించిందా.. లేదా అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. ఇక సిపిఎం, సిపిఐ టీ వీ కేకు మద్దతు ఇచ్చాయి. మంత్రి పదవులు తీసుకోమని.. ప్రభుత్వానికి బయటినుంచి సపోర్ట్ చేస్తామని ప్రకటించాయి.

Vijay Tamil Nadu CM : హ్యాండిచ్చిన పార్టీలు.. ‘దళపతి’ విజయ్ కు అందని సీఎం కుర్చీ

Vijay Tamil Nadu CM : తమిళనాడులో మరోసారి రాజకీయ హైడ్రామా నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న TVK అధినేత విజయ్ కు అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలింది. తొలుత TVKకు మద్దతు ప్రకటించిన IUML తాజాగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. మరోవైపు మద్దతు ఇస్తామని ప్రకటించిన VCK పార్టీ నుంచి గవర్నర్‌కు ఇప్పటివరకు అధికారిక లేఖ అందలేదు.

దీంతో అసెంబ్లీలో TVK బలం ప్రస్తుతం 116 స్థానాలకు పరిమితమైంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 కావడంతో ఇంకా రెండు సీట్ల మద్దతు అవసరంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా లేదా అన్నదానిపై మళ్లీ ఉత్కంఠ నెలకొంది.

అందుకే గవర్నర్ ఇప్పటివరకు అధికారికంగా ప్రభుత్వ ఏర్పాటుకు TVKను ఆహ్వానించలేదు. తమిళ రాజకీయాల్లో ఈ పరిణామాలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

అంతకుముందు.. తమిళనాడు లో గత రెండు మూడు రోజుల నుండి ఏర్పడిన రాజకీయ హై డ్రామా కి తెరపడింది. రేపటి నుండి తమిళనాడు లో విజయ్ సర్కార్ కొలువుతీరనుంది. ఎన్నికల్లో 107 స్థానాల్లో గెలుపొందిన విజయ్ కి , మ్యాజిక్ ఫిగర్ 118 కి చేరుకోవడం చాలా కష్టమైంది. డీఎంకే పార్టీ తో దశాబ్దాల నుండి ప్రయాణిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ , విజయ్ మద్దతు కోరిన పక్కరోజే తమకు వచ్చిన 5 ఎమ్మెల్యే స్థానాలను చేరుస్తు విజయ్ టీవీకే పార్టీ కి బలం చేకూర్చారు. దీంతో మిగిలిన 6 స్థానాలు సమకూర్చడం కోసం విజయ్ పాపం నానా తంటాలు పడాల్సి వచ్చింది. గవర్నర్ వద్దకు తమ దగ్గరున్న 112 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిని కోరాడు విజయ్. అందుకోసం ఆయన రెండు సార్లు గవర్నర్ ని కలిసాడు.

అసెంబ్లీ లో తమ మెజారిటీ ని నిరూపించుకుంటామని రిక్వెస్ట్ చేశారు. కానీ గవర్నర్ అందుకు ఒప్పుకోలేదు . మ్యాజిక్ ఫిగర్ 118 ఎమ్మెల్యేల సంతకాలు చూపిస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకి అనుమతిస్తామని తెగేసి చెప్పడం తో , రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు టీవీకే పార్టీ మద్దతుదారులు. అయితే ఎట్టకేలకు నేడు విజయ్ బలాన్ని సమకూర్చుకొని గవర్నర్ వద్దకు వెళ్ళాడు. మొదట్లో కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతు ఇవ్వడానికి ఒప్పుకోలేదు కానీ, నేడు వాళ్ళు విజయ్ కి మద్దతు ఇస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. దీంతో విజయ్ కూటమి బలాలు ఒకసారి చూస్తే టీవీకే పార్టీ కి 107 స్థానాలు , కాంగ్రెస్ పార్టీ కి 5 స్థానాలు, సీపీఐ 2 స్థానాలు , సీపీఎం 2 స్థానాలు , వీసీకే 2 స్థానాలు , IUML 2 స్థానాలు కాగా , ఓవరాల్ టీవీకే కూటమి బలం మ్యాజిక్ ఫిగర్ ని దాటి 120 కి చేరింది.

దీంతో గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకి అనుమతి ఇచ్చారు. రేపు వేలాది మంది అభిమానుల సమక్ష్యం లో ‘చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్’ అనే నేను తమిళనాడు ముఖ్యమంత్రిగా అంటూ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎన్నో కష్టాలు అనుభవించి , సీఎం సీటు మీద కూర్చోబోతున్న విజయ్ , రేపు చేయబోయే ప్రమాణస్వీకారోత్సవాన్ని అభిమానులు జీవితాంతం మర్చిపోలేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రభుత్వం లో కేవలం కాంగ్రెస్ పార్టీ , వీసీకే పార్టీలు మాత్రమే భాగం కాబోతున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు రెండు కూడా కేవలం మద్దతు ప్రకటించాయి కానీ , ప్రభుత్వం లో భాగం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీ కి రెండు మంత్రి పదవులు ఇవ్వడానికి విజయ్ అంగీకరించాడు, అదే విధంగా త్వరలో ఖాళీ కానున్న తిరుచ్చి స్థానాన్ని వీసీకే పార్టీకి ఇవ్వడానికి విజయ్ అంగీకరించాడు.

Chiranjeevi Koratala Shiva Issue: చిరంజీవి – కొరటాల శివ మధ్య ఏం జరిగింది… వీళ్ళిద్దరిలో తప్పెవరిది…

Chiranjeevi Koratala Shiva Issue: మెగాస్టార్ చిరంజీవి గత 50 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో జాగ్రత్తలైతే తీసుకుంటున్నాడు. ఇక ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసి పెట్టాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఇక మీదట ఆయన నుంచి రాబోయే సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ లను సాధిస్తాయి అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన భారీ సక్స్ లను సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలు భారీ సక్సెస్ లను సాధిస్తాయా? తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో మెగాస్టార్ చిరంజీవి చేసిన సినిమాలు కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని డిజాస్టర్ గా మారాయి. ముఖ్యంగా కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ఆచార్య సినిమా మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. దీంతో చిరంజీవికి భారీ బ్యాడ్ నేమ్ వచ్చింది.

ఈ సినిమా సమయంలో కొరటాల శివకి చిరంజీవికి మధ్య విభేదాలు తలెత్తయని చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటున్నారు. ఇక దేవర సినిమా ప్రమోషన్స్ టైమ్ లో కొరటాల శివ ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. ఇతరుల పనుల్లో చేయి పెట్టకపోతే అందరికి మంచిది అంటు కొన్ని కామెంట్లు చేశాడు. కొరటాల చిరంజీవిని ఉద్దేశించే ఇలాంటి మాటలు మాట్లాడాడు అంటూ కొంతమంది కొన్ని రకాల కామెంట్స్ చేశారు.

ఇక ఏది ఏమైనా కూడా ఆచార్య సినిమా కథలో చిరంజీవి బాగా ఇన్వాల్వ్ అయ్యాడని అందువల్లే ఆ సినిమాను అనుకున్న రీతిలో తీయలేదని కొరటాల శివ తన సన్నిహితుల దగ్గర చెప్పారట… నిజానికి రామ్ చరణ్ క్యారెక్టర్ ఈ మూవీ లో చాలా చిన్నగా ఉండేది. కానీ ఆ క్యారెక్టర్ రామ్ చరణ్ చేస్తున్నాడని చెప్పిన తర్వాత ఆ క్యారెక్టర్ ను పెంచడం, కొన్ని విషయాల్లో కొరటాల కాంప్రమైజ్ అవ్వడం వల్ల సినిమా అనుకున్న రేంజ్ లో రాలేదని అందుకే ఫ్లాప్ అయిందని మరి కొంతమంది కూడా చెబుతున్నారు…

Pawan Kalyan CM Seat Pressure: సీఎం సీటు కోసం రోజురోజుకు పవన్ కళ్యాణ్ పై పెరుగుతున్న ఒత్తిడి.. ఇలా అయితే కష్టమే..

Pawan Kalyan CM Seat Pressure: తమిళనాడు రాజకీయాలు మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయా?, ఆయన ఎట్టి పరిస్థితిలోనూ వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవిని అలకరించాలనే వాదన జనసేన పార్టీ క్యాడర్ నుండి రోజురోజుకి ఒత్తిడి పెరుగుతుందా అంటే అవుననే చెప్పాలి. తమిళనాడు లో మొదటి ఎన్నికల్లోనే విజయం సాధించి , ప్రభుత్వాన్ని స్థాపించబోతున్న విజయ్ తో, పవన్ కళ్యాణ్ ని పోల్చి చూస్తూ, ప్రతీ రోజు కొంతమంది రాజకీయ విశ్లేషకులు వీడియోలు చేయడం గడిచిన నాలుగు రోజుల నుండి సోషల్ మీడియా లో చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ కూడా 2024 ఎన్నికల్లో విజయ్ లాగా ఒంటరిగా పోటీ చేసి ఉండుంటే కచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేవాడని, అనవసరంగా ఛాన్స్ మిస్ చేసుకున్నదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. జనసేన ని స్థాపించి 14 ఏళ్ళు కావొస్తుంది, కానీ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలోనే ఉన్నాడు.

కానీ విజయ్ మాత్రం పార్టీ ని స్థాపించిన రెండేళ్లకే ముఖ్యమంత్రి అయిపోయాడు. దీనినే జనసేన పార్టీ క్యాడర్ , అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో ముందుకు పోవాలి అనే వ్యూహం కచ్చితంగా సరైనదే , కానీ 2029 లో ఆయన కూటమిగానే ఎన్నికలకు వెళ్లినప్పటికీ , ఎట్టి పరిసిటీలోనే రెండున్నర ఏళ్ళ పాటు సీఎం సీట్ షేర్ నిబంధన తోనే ముందుకు పోవాలని , కనీసం 70 స్థానాల్లో పోటీ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి ఆ స్థాయిలో సీట్లు తీసుకుంటారో లేదో తెలియదు కానీ , సీఎం సీటు షేరింగ్ మాత్రం ఈసారికి ఉండాల్సిందే అని , లేదంటే కచ్చితంగా ఈసారి గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరి చంద్రబాబు నాయుడు అందుకు ఒప్పుకుంటాడో లేదో చూడాలి. పవన్ కళ్యాణ్ కి సీఎం సీటు పై ఎలాంటి మక్కువ లేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబే 15 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పిన వ్యక్తి ఆయన. కానీ అభిమానుల నుండి జనసేన పార్టీ కార్యకర్తల నుండి పవన్ కళ్యాణ్ ముఖ్య మంత్రి అవ్వాలి అనే డిమాండ్ విజయ్ కారణంగా రోజురోజుకి పెరిగిపోతూ ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ ని ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూటమి తరుపున ప్రకటించకపోతే 2024 లో ఎలా అయితే జనసేన నుండి టీడీపీ కి కోస్తాంధ్ర జిల్లాల్లో ఓటు బదిలీ అయ్యిందో , అలా జరిగే అవకాశాలు సూన్యం అనే చెప్పాలి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జారబోతుంది అనేది.

Dhanush Kara Movie Collections: ధనుష్ ‘కర’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. డిజాస్టర్ దిశగా అడుగులు..

Dhanush Kara Movie Collections: తమిళ హీరో ధనుష్(Dhanush K Raja) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కర'(Kara Movie) ప్రపంచవ్యాప్తంగా రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై , బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. ఆన్లైన్ లో టాక్ చాలా పాజిటివ్ గానే వచ్చింది కానీ, పబ్లిక్ లో మాత్రం ఈ చిత్రానికి పెద్దగా టాక్ లేదు. సినిమా చాలా సోదిలాగా ఉందని చాలా మంది కామెంట్ చేశారు. వరుస సూపర్ హిట్స్ లో ఉన్నటువంటి ధనుష్ కి ఈ చిత్రం కాస్త స్పీడ్ బ్రేకులు వేసిందనే చెప్పాలి. వారం రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత గ్రాస్ వచ్చిందో ఒకసారి చూద్దాం. ఈ చిత్రం పై ఐపీఎల్ ప్రభావం తో పాటు, తమిళనాడు ఎన్నికల ప్రభావం కూడా చాలా బలంగా పడిందని అంటున్నారు.

ముందుగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నైజం ప్రాంతం నుండి 3 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, ఆంధ్ర ప్రదేశ్ నుండి 2 కోట్ల 85 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 5 కోట్ల 85 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 2 కోట్ల 83 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఇంకా 1 కోటి 67 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే తమిళనాడు నుండి 24 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా , కర్ణాటక రాష్ట్రము నుండి 3 కోట్ల 15 లక్షలు , కేరళ రాష్ట్రము నుండి 58 లక్షలు , రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఓవరాల్ గా ఓవర్సీస్ నుండి ఈ చిత్రానికి 10 కోట్ల 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా అన్ని భాషలకు కలిపి 44 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ సూపర్ హిట్ స్టేటస్ ని అందుకోవాలంటే , ఈ చిత్రం మరో 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం అసాధ్యం , కాబట్టి కమర్షియల్ గా ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా భావించవచ్చు.

Dhurandhar 2 The Revenge 50 days collections: ‘ధురంధర్ 2: ది రివెంజ్’ 50 రోజుల వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల్లో ఇంత గ్రాస్ కలలో కూడా ఊహించలేదు..

Dhurandhar 2 The Revenge 50 days collections: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఎప్పటికీ మర్చిపోలేని కొన్ని సినిమాలు ఉంటాయి. అలాంటి సినిమాల్లో ‘ధురంధర్'(Dhurandhar 2 : The Revenge) సిరీస్ కచ్చితంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి భాగం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై , ఫుల్ రన్ 1370 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. మొదటి భాగానికి ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో , రెండవ భాగం పై అంచనాలు తారా స్థాయికి చేరింది . ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉండడం తో , సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. 50 రోజుల హిస్టారికల్ థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చిందో ఒకసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం ప్రభంజనం సృష్టించింది.

ముఖ్యంగా సౌత్ స్టేట్స్ లో ఈ చిత్రానికి 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ప్రీమియర్ షోస్ తో కలిపి కర్ణాటక ప్రాంతం లో ఈ చిత్రానికి 141 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు కేజీఎఫ్ సిరీస్ , కాంతారా సిరీస్ కి తప్ప , మరో సినిమాకు కర్ణాటక లో ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వలేదు. అదే విధంగా తెలంగాణ ప్రాంతం లో ఈ చిత్రానికి తెలుగు + హిందీ భాషలకు కలిపి 72 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇది కూడా ఒక హిస్టారికల్ రికార్డు అనొచ్చు. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో అయితే 28 కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. తమిళనాడు లో దాదాపుగా 39 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వగా, కేరళ ప్రాంతం లో 19 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి.

ఓవరాల్ గా ఈ చిత్రానికి సౌత్ రాష్ట్రాల నుండి 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. భాషల వారీగా సౌత్ రాష్ట్రాల నుండి వచ్చిన వసూళ్లను ఒకసారి గమనిస్తే హిందీ వెర్షన్ నుండి 223 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వగా, తెలుగు వెర్షన్ నుండి 48 కోట్ల రూపాయిలు, తమిళ వెర్షన్ నుండి 23 కోట్ల రూపాయిలు , కన్నడ వెర్షన్ నుండి 4 కోట్ల 50 లక్షలు, మలయాళం వెర్షన్ నుండి 1 కోటి 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఓవరాల్ గా ఇండియా వైడ్ గా 1390 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , ఓవర్సీస్ నుండి 440 కోట్ల రూపాయిలు, ప్రపంచవ్యాప్తంగా 1830 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటికీ థియేటర్స్ లో ఈ చిత్రం విజయవంతంగా రన్ అవుతున్నప్పటికీ, ఈ నెల 15 నుండి డిస్నీ + హాట్ స్టార్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

Mahesh and Sandra couple: ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ షోలో చరిత్ర సృష్టించిన జోడీ.. ఇది కదా విజయం అంటే..

Mahesh and Sandra couple: ఏ మనిషిని కూడా తక్కువ అంచనా వేయకూడదు , అలా తక్కువ అంచనా వేసిన ప్రతీసారి, ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఆ మనిషి హిస్టరీ క్రియేట్ చేసి అందరికంటే ముందుకు దూసుకెళ్లిన సందర్భాలు గతం లో మనం చాలానే చూశాము. అది రాజకీయాల్లో అయినా సరే, సినిమాల్లో అయినా సరే. అయితే రీసెంట్ గానే స్టార్ మా ఛానల్ లో మొదలైన ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ షోలో అందరికంటే వీక్ జంట అనిపించుకుంది మహేష్ – సాండ్రా జంట. మొదటి మూడు వారాలు వీళ్లకు ఒక్క పరిస్థితి కూడా అనుకూలించలేదు, ఏ జంట కూడా వీళ్ళతో కలిసి గేమ్స్ ఆడేందుకు ముందుకు రాలేదు , ఎందుకంటే వీళ్ళు బాగా ఆడడం లేదని, వీళ్ళతో కలిసి ఆడితే మనకు కూడా మైనస్ అవుతుందనే ఉద్దేశ్యం ఉండడం వల్లే.

అలా ఒక్క పరిస్థితి కూడా అనుకూలించకపోవడం తో , ఈ జంట మూడవ వారం లో ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. అయితే అదృష్టం కలిసొచ్చి మరోసారి వీళ్లకు అవకాశం కల్పిస్తూ , వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని కల్పించారు మేకర్స్. అలా వైల్డ్ కార్డు ద్వారా లోపలకు అడుగుపెట్టిన ఈ జంట మొదట్లో పర్వాలేదు అని అనిపించే రేంజ్ లో ఆడారు , డేంజర్ జోన్ లో రాకుండా జాగ్రత్త పడ్డారు. గత వారం లో అయితే ఈ జంట ని మ్యాన్షన్ లో ఉన్న ప్రతీ జంట అవమానించింది. ముఖ్యంగా సిద్దు – సోనియా జంట ఏ రేంజ్ లో అవమానించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మీకు బాగా వీక్ గా అనిపించే జంట లో ఒకరిని కూర్చోబెట్టి కారణాలు చెప్పండి అని ప్రేమ గురు ఇచ్చిన టాస్క్ లో , ఈ సిద్దు సోనియా జంట మహేష్ – సాండ్రా లను తీవ్రంగా అవమానించారు.

మాకు మీరిద్దరూ వీక్ గానే అనిపిస్తున్నారు , ఇక్కడ రెండు కుర్చీలు పెడితే బెటర్ ఇద్దరినీ కూర్చోబెడుతాము అంటూ చెప్పుకొచ్చారు. అంత చులక భావం తో చూశారు. కానీ కట్ చేస్తే, ఈ వారం నిర్వహించిన టికెట్ టు ఫినాలే టాస్కుల్లో ఈ జంట ప్రభంజనం సృష్టించింది. ప్రతీ టాస్క్ ని అద్భుతంగా ఆడి , అత్యధిక పాయింట్స్ తో టికెట్ టు ఫినాలే సంపాదించి, గ్రాండ్ ఫినాలే కి మొదటి ఫైనలిస్ట్స్ గా నిలిచారు. ఇది సాధారమైన విషయం కాదు , ఏ జంట ని అయితే హౌస్ లో అందరూ వీక్ అని భావించారో , ఏ జంట ని అయితే అందరూ వీళ్ళు వేస్ట్ అని అవహేళన చేస్తూ వెక్కిరించారో , నేడు ఆ జంటని మొదటగా ఫినాలే లోకి అడుగుపెట్టారు. ఇది కదా విజయం అంటే , అందుకే పెద్దలు ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు , అది చాలా పెద్ద తప్పు అని అంటుంటారు.