Homeజాతీయ వార్తలుKC Venugopal Kerala Congress: మీడియా చూస్తున్నప్పుడు జాగ్రత్త పడాలి కదా.. కేరళ కాంగ్రెస్ లో...

KC Venugopal Kerala Congress: మీడియా చూస్తున్నప్పుడు జాగ్రత్త పడాలి కదా.. కేరళ కాంగ్రెస్ లో కలకలం

KC Venugopal Kerala Congress: ఏదైనా ఒక రహస్యమైన పని చేస్తున్నప్పుడు సాధ్యమైనంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. రెండో కన్ను పడకుండా చూసుకోవాలి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పూరే. సీక్రెట్ పనులు చేయడం ఆ పార్టీకి చేతకాదు. ఒకవేళ చేసిన సరే వెంటనే బయటపడుతుంది. అప్పుడు దాచుకున్న పరువు పోతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి అలవాటే. కాకపోతే తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోకపోవడమే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అతిపెద్ద తప్పు. ఇటీవల నాలుగు రాష్ట్రాలకు, […]

KC Venugopal Kerala Congress: ఏదైనా ఒక రహస్యమైన పని చేస్తున్నప్పుడు సాధ్యమైనంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. రెండో కన్ను పడకుండా చూసుకోవాలి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పూరే. సీక్రెట్ పనులు చేయడం ఆ పార్టీకి చేతకాదు. ఒకవేళ చేసిన సరే వెంటనే బయటపడుతుంది. అప్పుడు దాచుకున్న పరువు పోతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి అలవాటే. కాకపోతే తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోకపోవడమే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అతిపెద్ద తప్పు.

ఇటీవల నాలుగు రాష్ట్రాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు జరిగాయి. ఫలితాలు కూడా వచ్చాయి. అందులో కేరళ రాష్ట్రం కూడా ఒకటి. కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది.. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 63 మంది ఎమ్మెల్యేలలో 47 మంది తమకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరో నిర్ణయించుకున్నారు.. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎంపిక కంటే ముందు.. ఎవరు సీఎం అయితే బాగుంటుందో ఎమ్మెల్యేలతో ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు.. ఆ ప్రక్రియను ఒక నివేదిక రూపంలో రూపొందించి అధిష్టానానికి వెల్లడిస్తారు. కేరళలో 63 మంది ఎమ్మెల్యేలలో 47 మంది కేసీ వేణుగోపాల్ కి జై కొట్టినట్టు సమాచారం.. ఆ మద్దతు పత్రాలతో కాంగ్రెస్ ప్రతినిధి ముకుల్ వాస్నిక్ ఢిల్లీ వెళ్లారు.

ఆయన ఢిల్లీ వెళ్తుండగా చేతిలోని పత్రాలలో కేసీ వేణుగోపాల్ పేరు స్పష్టంగా కనిపించింది. దీనిపై అధికారికంగా ప్రకటన త్వరలోనే రాబోతుంది. అయితే పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ఆయన.. కేరళ ముఖ్యమంత్రి అయితే.. ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది.. వాస్తవానికి ముకుల్ తన దగ్గర ఉన్న పత్రాలను జాగ్రత్తగా తీసుకెళ్లి ఉంటే బాగుండేది. అలా కాకుండా వేణుగోపాల్ పేరు కనిపించే విధంగా పట్టుకెళ్లడంతో కేరళకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరో ముందుగానే తెలిసిపోయింది. ఇటువంటి సీక్రెట్ విషయాలలో రహస్యాన్ని పాటించకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ మరోసారి అభాసుపాలైందని పొలిటికల్ వర్గాలలో చర్చ సాగుతోంది.

కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీకి అత్యంత దగ్గరైన వ్యక్తి. ఒకప్పుడు అహ్మద్ పటేల్ రాహుల్ గాంధీకి.. సోనియా గాంధీకి అత్యంత దగ్గరగా ఉండేవారు. ఇప్పుడు ఆ పాత్రను కేసి వేణుగోపాల్ పోషిస్తున్నారు. కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వేణుగోపాల్ తీవ్రంగా కృషి చేశారు. తద్వారా దక్షిణ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన పట్టు ఉందని.. ప్రజల్లో ఆ నమ్మకం ఉందని మరోసారి నిరూపించారు కేసి వేణుగోపాల్. తెలంగాణ ముఖ్యమంత్రి కి కేసి వేణుగోపాల్ అత్యంత దగ్గరి స్నేహితుడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper