Homeఎంటర్టైన్మెంట్Ashu Reddy engagement photos: వివాదాల మధ్య గ్రాండ్ గా జరిగిన అషు రెడ్డి నిశ్చితార్థం.....

Ashu Reddy engagement photos: వివాదాల మధ్య గ్రాండ్ గా జరిగిన అషు రెడ్డి నిశ్చితార్థం.. వైరల్ అవుతున్న ఫోటోలు..

Ashu Reddy engagement photos: గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్న సెలబ్రిటీల పేర్లలో ఒకటి అషు రెడ్డి. ధర్మేంద్ర అనే వ్యక్తితో ఒకప్పుడు ప్రేమాయణం నడిపిన అషు రెడ్డి , అతని వద్ద బోలెడంత డబ్బులు ఖర్చు చేయించిందని , పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఏకంగా 9 కోట్ల రూపాయిలు తన నుండి దోచుకుందని ధర్మేంద్ర ఆధారాలతో సహా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం […]

Ashu Reddy engagement photos: గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్న సెలబ్రిటీల పేర్లలో ఒకటి అషు రెడ్డి. ధర్మేంద్ర అనే వ్యక్తితో ఒకప్పుడు ప్రేమాయణం నడిపిన అషు రెడ్డి , అతని వద్ద బోలెడంత డబ్బులు ఖర్చు చేయించిందని , పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఏకంగా 9 కోట్ల రూపాయిలు తన నుండి దోచుకుందని ధర్మేంద్ర ఆధారాలతో సహా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం సంచలనం గా మారింది. దీనిపై అషు రెడ్డి కూడా స్పందిస్తూ , తన వెర్షన్ ని వినకుండానే పోలీసులు కేసు నమోదు చేసారని, దయచేసి ఆ కేసు ని కొట్టి వేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ హై కోర్టు లో పిటీషన్ వేసింది. అయితే నేడు హై కోర్టు ఈ విషయం లో కీలక తీర్పు ఇచ్చింది.

ఆమె తల్లి యశోద రెడ్డి పై దర్యాప్తు నిలిపివేయాలని అషు రెడ్డి వేసిన పిటీషన్ ని హై కోర్టు కొట్టివేస్తూ, స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అంతే కాకుండా కఠిన చర్యల నుండి మినహాయింపు ఇవ్వాలనే అషు రెడ్డి కోరికని కూడా తోసిపుచ్చింది హై కోర్టు. ప్రూఫ్స్ అన్నీ పర్ఫెక్ట్ గా ఉండడం తో అశ్విని రెడ్డి అలియాస్ అషు రెడ్డి పై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించింది హై కోర్టు. ఇంత జరుగుతుంటే మరోపక్క అషు రెడ్డి ఎలాంటి టెన్షన్ , భయం లేకుండా నేడు నిశ్చితార్థం చేసుకుంది. ఈమేరకు ఆమె సోషల్ మీడియా లో అప్లోడ్ చేసిన ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి. పెళ్లి కొడుకు ముఖాన్ని చూపించలేదు కానీ, వీళ్లిద్దరు చేతులు కలిపిన ఫోటోలను మాత్రమే అప్లోడ్ చేసింది. కనీసం పెళ్లి తర్వాత అయినా ఆమె పూర్తి ఫోటోలను అప్లోడ్ చేస్తుందో లేదో చూడాలి.

ఇదంతా పక్కన పెడితే ధర్మేంద్ర ఇప్పుడు అషు రెడ్డి పై ఇంతటి పోరాటం ఎందుకు చేస్తున్నాడో నేడు అర్థం అవుతోంది. ఆమె మరొకరితో పెళ్ళికి సిద్ధం అవ్వడంతో , తనను నమ్మించి ఎలా మోసిందో చూడండి అంటూ ఆయన సమాజానికి చెప్పే ప్రయత్నం చేసాడు. అయితే అషు రెడ్డి అతనితో విడిపోవడానికి గల కారణం ఏమిటో తెలుసుకోకుండా, ఒకరి వైపే నిలబడి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. రెండు వెర్షన్స్ ని విన్న తర్వాతే మాట్లాడాలి. ఒకవేళ తప్పు ధర్మేంద్ర వైపు ఉంటే ?, డబ్బులు బాగానే ఇచ్చాడు, కానీ అతని ప్రవర్తన నచ్చకో , లేదా వేరే ఏదైనా కారణం చేత అషు రెడ్డి వదిలేసి ఉండొచ్చు కదా అని కొంతమంది నెటిజెన్స్ అంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper