Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీDRDO TARA glide bomb test: మన డిఫెన్స్ లో ధ్రువ'తార'.. సాధారణ బాంబులు కూడా...

DRDO TARA glide bomb test: మన డిఫెన్స్ లో ధ్రువ’తార’.. సాధారణ బాంబులు కూడా మిస్సైల్స్ గా మారిపోతాయి..

DRDO TARA glide bomb test: ఆధునిక కాలంలో యుద్ధాలు మారిపోతున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాలు విపరీతంగా అభివృద్ధి చెందాయి కాబట్టి.. యుద్ధ అవసరాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇలాంటప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి విపరీతమైన ప్రాధాన్యం ఏర్పడుతోంది. కొత్త కొత్త ఆయుధాలు.. అంతకుమించిన యుద్ధ విమానాలు ఇప్పుడు కావాల్సి వస్తోంది. అమెరికా, ఇరాన్ యుద్ధం కూడా ప్రపంచానికి అలాంటి పాఠాలే నేర్పింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అతిపెద్ద జనాభా ఉన్న మన దేశం ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో […]

DRDO TARA glide bomb test: ఆధునిక కాలంలో యుద్ధాలు మారిపోతున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాలు విపరీతంగా అభివృద్ధి చెందాయి కాబట్టి.. యుద్ధ అవసరాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇలాంటప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి విపరీతమైన ప్రాధాన్యం ఏర్పడుతోంది. కొత్త కొత్త ఆయుధాలు.. అంతకుమించిన యుద్ధ విమానాలు ఇప్పుడు కావాల్సి వస్తోంది. అమెరికా, ఇరాన్ యుద్ధం కూడా ప్రపంచానికి అలాంటి పాఠాలే నేర్పింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అతిపెద్ద జనాభా ఉన్న మన దేశం ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో యుద్ధరంగాన్ని మార్చేసింది.

ఒకప్పుడు కొత్త కొత్త ఆయుధాలను.. ఆధునిక సాంకేతిక వ్యవస్థలను మన దేశం ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసేది. దీనివల్ల మన విదేశీ మారకద్రవ్యం వాటికి ఖర్చయ్యేది. కొంతకాలంగా మన దేశంలోనే రక్షణ రంగ పరిశోధక వ్యవస్థలు కొత్త కొత్త టెక్నాలజీని రూపొందిస్తున్నాయి. అత్యాధునిక ఆయుధాలను తయారు చేస్తున్నాయి. అవి ప్రపంచానికే సరికొత్త డిఫెన్స్ పాఠాలు నేర్పుతున్నాయి.. అటువంటి ఆయుధాన్నే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, డిఆర్డిఓ కలిసి తయారు చేశాయి.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్, డి ఆర్ డి ఓ సంయుక్తంగా తయారుచేసిన ఆ ఆయుధం పేరు తార.. సాంకేతికంగా దీనిని tactical advanced range agumentation అని పిలుస్తున్నారు. హైదరాబాదులో ఆర్సిఐ, డిఆర్డిఓ వీరిని కలిసి డెవలప్ చేశాయి. ఈ వ్యవస్థలో అనేక గొప్పదనాలు ఉన్నాయి. ఆర్ సి ఐ, డిఆర్డిఓ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. సాధారణ బాంబులను విమానం నుంచి జార విడిచినప్పుడు ఇవి లక్ష్యాన్ని అందుకోలేవు. వీటిని TARA కు అనుసంధానం చేస్తే.. దానికి ఉండే రెక్కలు, జీపీఎస్ వ్యవస్థ బాంబులకు సరికొత్త సామర్థ్యాన్ని అందిస్తాయి. వాటికి మిస్సైల్స్ తరహా శక్తిని అందిస్తాయి. ద్వారా అవి ఎక్కువ వేగంతో పనిచేస్తాయి.

అమెరికా, ఇరాన్ యుద్ధ సమయంలో లక్ష్యాన్ని చేరుకోలేని బాంబులు అనేకం ఉన్నాయి. ఇందులో అమెరికా జార విడిచిన బాంబులు అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తు కాలంలో ఏమైనా యుద్ధాలు చోటు చేసుకున్నప్పుడు.. ఖచ్చితమైన లక్ష్యంతో పనిచేసే బాంబులను తయారు చేసేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, డి ఆర్ డి ఓ కొంతకాలంగా కీలక ప్రయోగాలు చేస్తున్నాయి. ఆ ప్రయోగాలు విజయవంతం కావడంతో ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ఫోర్స్.. డిఆర్డిఓ బయటపెట్టాయి. తార ద్వారా దేశీయ గ్లైడ్ వెపన్ సిస్టం మరింత డెవలప్ అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper