Homeలైఫ్ స్టైల్Hanta virus symptoms: వణికిస్తున్న ‘హంటా’..లక్షణాల ఇవే.. WHO హెచ్చరిక

Hanta virus symptoms: వణికిస్తున్న ‘హంటా’..లక్షణాల ఇవే.. WHO హెచ్చరిక

Hanta virus symptoms: అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న ఒక డచ్ నౌకలో హంటా వైరస్ (Hantavirus) వెలుగుచూడటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఈ వైరస్ ఎలుకల ద్వారా సోకుతుంది. కానీ ఈ నౌకలో వ్యాపిస్తున్నది అత్యంత ప్రమాదకరమైన ‘అండెస్ స్ట్రెయిన్’ కావడంతో వైద్య నిపుణులు తీవ్ర అప్రమత్తత ప్రకటించారు. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితె.. హంటా వైరస్ ప్రధానంగా ఇన్ఫెక్ట్ అయిన ఎలుకల మలమూత్రాలు, లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది. అవి ఎండిపోయి గాలిలో […]

Hanta virus symptoms: అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న ఒక డచ్ నౌకలో హంటా వైరస్ (Hantavirus) వెలుగుచూడటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఈ వైరస్ ఎలుకల ద్వారా సోకుతుంది. కానీ ఈ నౌకలో వ్యాపిస్తున్నది అత్యంత ప్రమాదకరమైన ‘అండెస్ స్ట్రెయిన్’ కావడంతో వైద్య నిపుణులు తీవ్ర అప్రమత్తత ప్రకటించారు. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

హంటా వైరస్ ప్రధానంగా ఇన్ఫెక్ట్ అయిన ఎలుకల మలమూత్రాలు, లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది. అవి ఎండిపోయి గాలిలో కలిసినప్పుడు, ఆ గాలిని పీల్చడం వల్ల మనుషులకు ఈ వైరస్ సోకుతుంది. అయితే ఈ డచ్ నౌకలో కలకలం రేపుతున్న ‘అండెస్’ రకం వైరస్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఒక మనిషి నుంచి మరొక మనిషికి నేరుగా వ్యాపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నౌక వంటి పరిమిత ప్రదేశంలో ప్రయాణికులు దగ్గరగా ఉండటం వల్ల ఇది వేగంగా విస్తరించే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.

లక్షణాలు:
ఈ వైరస్ సోకిన వారిలో ప్రాథమికంగా అలసట, తీవ్రమైన జ్వరం, కండరాల నొప్పులు కనిపిస్తాయి. వ్యాధి ముదిరే కొద్దీ బాధితుల్లో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులలో నీరు చేరడం (Pulmonary Edema) వల్ల రోగి పరిస్థితి విషమిస్తుంది. వైద్య గణాంకాల ప్రకారం, ఈ వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు మరణించే అవకాశం ఉంది. అంటే దీని మరణాల రేటు సుమారు 35 నుంచి 40 శాతం వరకు ఉంటుంది.

WHO హెచ్చరిక :
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ ఈ పరిస్థితిపై స్పందిస్తూ.. అంతర్జాతీయ ప్రయాణాలు, నౌకల ద్వారా ఈ కేసులు ఇతర దేశాలకు పాకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బాధితులను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించాలని, నౌకలోని ఇతర ప్రయాణికులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రస్తుతం అనేక దేశాలు తమ ఓడరేవుల వద్ద నిఘాను పెంచాయి. ప్రభావిత ప్రాంతాల నుండి వచ్చే వారిని స్క్రీనింగ్ చేస్తున్నాయి.

నివారణ మార్గాలేమిటి?
ప్రస్తుతానికి ఈ వైరస్‌కు నిర్దిష్టమైన వ్యాక్సిన్ అందుబాటులో లేదు. కాబట్టి నివారణే ఏకైక మార్గం. ఎలుకలు తిరిగే ప్రదేశాలకు దూరంగా ఉండటం. పరిశుభ్రతను పాటించడం, మాస్కులు ధరించడం. వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాయి. నౌకలో ఉన్న ప్రయాణికులకు మెరుగైన చికిత్స అందించేందుకు నెదర్లాండ్స్ , ఇతర యూరోపియన్ దేశాల వైద్య బృందాలు రంగంలోకి దిగాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper