Village Cooking Channel: ఇప్పటి జమానా మొత్తం సోషల్ మీడియా చుట్టూ తిరుగుతోంది. జస్ట్ కంటెంట్ క్రియేషన్ ద్వారానే చాలామంది కోట్లు సంపాదిస్తున్నారు. పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు వస్తున్న నేపథ్యంలో చాలామంది సెలబ్రిటీలుగా చలామణి అవుతున్నారు.
యూట్యూబ్లో మన దేశం నుంచి చాలామంది అత్యధిక ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు. యూట్యూబ్ ద్వారా వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. అయితే ఎటువంటి నేపథ్యం లేకపోయినప్పటికీ.. పెద్దగా చదువుకోకపోయినప్పటికీ తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒక పెద్ద మనిషి సెలబ్రిటీ అయిపోయాడు. ఏకంగా యూట్యూబ్లో 30 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లను కలిగి ఉండి.. నెలకు లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు.
యూట్యూబ్ చూసేవాళ్ళకు విలేజ్ కుకింగ్ ఛానల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళనాడుకు చెందిన పెరియ తంబి అనే వ్యక్తి గతంలో వంటలు చేసేవాడు. తాను చేస్తున్న వంటలను ఒకసారి సరదాగా వేరే వ్యక్తి రికార్డ్ చేశాడు. దానిని కాస్త యూట్యూబ్లో పోస్ట్ చేశాడు. ఊహించని విధంగా వీక్షణలు సొంతం చేసుకోవడంతో.. ఆ తర్వాత వంటలు చేయడం.. వాటిని యూట్యూబ్లో పోస్ట్ చేయడం ప్రారంభించాడు. తన ఊరి వాళ్లతో కలిసి విలేజ్ కుకింగ్ ఛానల్ అని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఇక అతడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. విభిన్నమైన వంటలు వండుతూ.. వాటిని పేదలకు పెడుతూ పెరియ తంబి యూట్యూబ్లో సరికొత్త సంచలనం సృష్టిస్తున్నారు. దుబాయ్.. ఇతర విదేశాలకు వెళ్లి తమ వంటల రుచిని కూడా చూపించారు.
కేవలం పెరియ తంబి బృందం వంటలు మాత్రమే చేయదు. వండిన వంటలను పేదలకు.. అనాధలకు పంచి పెడుతూ ఉంటుంది. గతంలో వీరి చానల్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వంట చేశారు. వెజిటేబుల్ బిర్యాని వండి అందరికీ సర్వ్ చేశారు. రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి వీరి కుకింగ్ ఛానల్ లో కనిపించారు అంటే.. పెరియ తంబి స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. విలేజ్ కుకింగ్ ఛానల్ ద్వారా పెరిగే తంబి బృందం ప్రతి నెలకు 11 నుంచి 15 లక్షల వరకు ఆదాయాన్ని సంపాదిస్తుంది. 30 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లను కలిగి ఉన్నారంటే.. వీరి వంటల స్థాయి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.