Homeజాతీయ వార్తలుJharkhand Student Protest: పేపర్ లీకేజీ.. రోడ్లమీదకి వేలాది మంది విద్యార్థులు.. ప్రభుత్వం కూలిపోవడం ఖాయం

Jharkhand Student Protest: పేపర్ లీకేజీ.. రోడ్లమీదకి వేలాది మంది విద్యార్థులు.. ప్రభుత్వం కూలిపోవడం ఖాయం

Jharkhand Student Protest: వేలాదిమంది విద్యార్థులు. చేతిలో ఫ్ల కార్డులు.. అందరివి ఒకటే నినాదాలు.. మాకు న్యాయం జరగాలి.. అక్రమాలకు పాల్పడిన అధికారులు జైలుకు వెళ్లాలి.. విద్యార్థుల గోస పట్టని ప్రభుత్వం దిగిపోవాలి.. మొన్ననే కదా జంతర్ మంతర్ వద్ద నీట్ విద్యార్థులు ఆందోళన చేసింది. పోలీసులతో గొడవపడి.. తాము అనుకున్నది సాధించింది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళన దేశవ్యాప్తంగా ఉన్న యువత అగ్రహానికి ప్రతీకగా నిలిచింది. విద్యార్థులు తలుచుకుంటే ఏం జరుగుతుందో […]

Jharkhand Student Protest: వేలాదిమంది విద్యార్థులు. చేతిలో ఫ్ల కార్డులు.. అందరివి ఒకటే నినాదాలు.. మాకు న్యాయం జరగాలి.. అక్రమాలకు పాల్పడిన అధికారులు జైలుకు వెళ్లాలి.. విద్యార్థుల గోస పట్టని ప్రభుత్వం దిగిపోవాలి..

మొన్ననే కదా జంతర్ మంతర్ వద్ద నీట్ విద్యార్థులు ఆందోళన చేసింది. పోలీసులతో గొడవపడి.. తాము అనుకున్నది సాధించింది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళన దేశవ్యాప్తంగా ఉన్న యువత అగ్రహానికి ప్రతీకగా నిలిచింది. విద్యార్థులు తలుచుకుంటే ఏం జరుగుతుందో యావత్ దేశానికి తెలియ వచ్చింది. ఈ నేపథ్యంలో అదే తరహాలో ఉద్యమాలు దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉంటాయి.

ఇటీవల చాలా రాష్ట్రాలలో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయి. ఈ ఘటనల వెనుక ఉన్న వ్యక్తులను శిక్షించాలని.. విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. చాలామంది విద్యార్థులు రోడ్లమీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి నిరాహార దీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం మీద తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

తాజాగా ఝార్ఖండ్ రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు రోడ్లమీదకి వచ్చారు. అక్కడి ప్రభుత్వం దిగిపోవాలని డిమాండ్లు చేస్తున్నారు. దీనికి కాక్రోచ్ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుంది.. జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో క్లీన్ జెపిఎస్సి పేరుతో వేలాది మంది విద్యార్థులు నిరవధికంగా నిరాహార దీక్ష చేస్తున్నారు. విద్యార్థి సంఘం నాయకుడు దేవేంద్రనాథ్ మహా ఆధ్వర్యంలో ఈ ఆందోళన మొదలైంది.. దీనంతటికీ ప్రధాన కారణం జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. జార్ఖండ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల్లో భారీగా అక్రమాలు.. ప్రశ్నా పత్రాలు లీకేజీ జరిగాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. రాజధాని రాంచీలో విద్యార్థులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు.. ఏప్రిల్ 19న ఈ పరీక్ష నిర్వహించారు. ఫలితాలను జూలైలో విడుదల చేశారు. నిర్ణీత మార్కులను ప్రకటించకపోవడంతో స్టూడెంట్స్ లో ఆగ్రహం మొదలైంది. దీనికి తోడు ఓఎంఆర్ షీట్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మెయిన్స్ పరీక్షను.. పరీక్షలను వాయిదా వేసింది. దీంతో పోస్టుల భర్తీ ప్రక్రియ ఆగిపోయింది. ఈ వివాదం ముదిరిపోవడంతో జెపి ఎస్ఎస్సి చైర్మన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ వ్యవహారం మీద విచారణకు ఆదేశించారు. 11 మందిని అరెస్ట్ చేయించారు. అయితే ప్రభుత్వ చర్యల మీద విద్యార్థులు సానుకూలంగా లేరు.. వారంతా సీబీఐ దర్యాప్తును కోరుతున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో న్యాయం చేయలేకపోతే ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని.. ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper