Village Cooking Channel: సోషల్ మీడియా.. ఇప్పుడు ట్రెండింగ్ అంతా దీనిదే. అందుకే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు మంచి చెడు, ప్రమోషన్, అడ్వర్టయిజ్‌మెంట్ ఇలా అన్నింటికీ సోషల్ మీడియానే నమ్ముకుంటున్నారు. కొందరు సోషల్ మీడియా కారణంగా ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోతున్నారు. మహా కుంభమేళాలో గుజాతీ యువతి సోషల్ మీడియా కారణంగా సెబ్రిటీ అయిపోయింది. అందుకే చాలా మంది సోషల్ మీడియా ద్వారానే సమాచారం పంచుకుంటున్నారు. టిప్స్ నేర్పుతున్నారు. శిక్షణ ఇస్తున్నారు. తమిళనాడుకు చెందిన నల భీమలు కూడా సోషల్ మీడియా కారణంగా విశేష ప్రజాదరణ పొందారు.
గ్రామీణ వంటలు చేస్తూ..
తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాలోని చిన్నవీరమంగళం గ్రామానికి చెందిన సుబ్రమణియన్, అయ్యనార్, పెరియతంబి, మురుగేశన్, ముత్తుమాణిక్యం, తమిళ్సెల్వన్ తదితరులు 2018లో ’విలేజ్ కుకింగ్ ఛానల్’ ప్రారంభించారు. వారు పెద్ద మొత్తంలో గ్రామీణ వంటలు చేసి వీడియోలు యూట్యూబ్‌లో పోస్ట్ చేసి క్రమక్రమంగా ఆకర్షణ పెంచుకున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల సమయానికి రాహుల్ గాంధీ వారిని కలిసి వంట వీడియోల్లో సహకరించడం ఈ ఛానల్‌కు కొత్త బూస్ట్ ఇచ్చింది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో కోటి సబ్‌స్క్రైబర్లకు చేరుకుంది. ప్రస్తుతం 3 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ ఆహార ఛానళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది.
సంప్రదాయ వంటకాలు..
విలేజ్ కుకింగ్ ఛానల్ అందించే ఆహారాలు సంప్రదాయ విధానాలు, ప్రకృతి సిద్ధమైన పద్ధతులు, పెద్ద ప్యాన్‌లలో వడ్డిస్తుంటారు. సందర్శకులు ఈ ఛానల్ ద్వారా సాధారణ గ్రామీణ జీవనశైలి గమనించవచ్చు. వీడియో ఫిల్మింగ్ తరువాత ఆవసరమైన ఆహారాన్ని పేదలకు, అనాథలకు, వృద్ధాశ్రమాలకు విరాళంగా అందిస్తారు.
ఈ ఛానల్ విజయం తెలుగు, తమిళ రాష్ట్రాల్లోని గ్రామీణ విధానాలపై ప్రజల్లో ఆసక్తిని పెంచింది. సంప్రదాయ వంటకాల ప్రాముఖ్యతతో పాటు సాంఘిక సేవలా చేర్చడం ’విలేజ్ కుకింగ్ ఛానల్’కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.