Village Cooking Channel: ప్రపంచం మొత్తం ఇప్పుడు డిజిటల్ మీడియా చుట్టూ తిరుగుతోంది.. ఇందులో ఉన్న అవకాశాలు ఇప్పుడు మామూలుగా లేవు. కంటెంట్ ఉన్న వాడికి ఇక్కడ ఆకాశమే హద్దు. ఒకసారి క్లిక్ అయితే చాలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న సెలబ్రిటీలలో చాలావరకు ఈ డిజిటల్ మీడియా ద్వారా వచ్చినవారే. అక్కడిదాకా ఎందుకు ప్రముఖ చానల్స్ నిర్వహిస్తున్న రియాల్టీ షో లలో పాల్గొనే వారిని ఎంపిక చేయడానికి డిజిటల్ మీడియానే ప్రామాణికంగా తీసుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. డిజిటల్ మీడియాలో ఒక్కసారి క్లిక్ అయితే చాలు సంపాదనే సంపాదన. అలా డిజిటల్ మీడియాలో క్లిక్ అయిన ఓ తాత, మనవళ్లు ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారు.
Also Read: చివరికి డిజిటల్ లోనూ శ్రమదోపిడేనా? అందుకే ఉద్యోగులు వెళ్ళిపోతున్నారా? ఆ మేనేజ్మెంట్ ఇక మారదా?
ఎల్లారే వాంగే.. ఆల్వేస్ వెల్కమ్ స్ యూ.. అనే తమిళం, ఇంగ్లీష్ కలగలిపిన స్లాంగ్ తో మాట్లాడుతూ.. తమకు మాత్రమే సాధ్యమైన వంటలతో ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్నారు ఈ తాత మనవళ్లు. వాళ్లది తమిళనాడులోని ఓ మారుమూల గ్రామం . ఆ తాత పేరు పెరియ తంబి.. ఇతడు పెళ్లిళ్లకు.. ఇతర వేడుకలకు వంటలు చేస్తాడు. వంటలు చేయడంలో ఇతడికి సుదీర్ఘమైన అనుభవం ఉంది. అయితే ఇతడు వంటలు చేస్తున్న విధానాన్ని అతని మన వాళ్ళు ఫోన్లో రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టాలని అనుకున్నారు. అలా ప్రారంభమైందే విలేజ్ కుకింగ్ ఛానల్. అతడు తయారు చేస్తున్న వంటలను రికార్డు చేసి యూట్యూబ్లో పెట్టారు. మొదట్లో అంతగా ఆదరణ దక్కలేదు. అలా వీడియోలను పెడుతూ పెడుతూ వీక్షణలను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న విలేజ్ కుకింగ్ ఛానల్ కు యూట్యూబ్లో 2.87 సబ్ స్క్రైబర్లు ఉన్నారు. వీరు ఒక వీడియో అప్లోడ్ చేస్తే తక్కువలో తక్కువ కోట్లల్లో వ్యూస్ వస్తాయి. గత ఏడాది వీరు యూట్యూబ్ ద్వారా ఏకంగా 10 కోట్ల వరకు సంపాదించారు. సంప్రదాయ వంటల్లోనే భిన్నమైన ప్రయోగాలు చేయడం వీరికి అలవాటు. అందువల్లే వీరు ఛానల్ సూపర్ సక్సెస్ అయింది.
అప్పట్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విలేజ్ కుకింగ్ ఛానల్ నిర్వహించే వారి వద్దకు రావడం విశేషం. వారు తయారుచేసిన వంటకాలు తినడం గమనార్హం. అప్పట్లో ఎన్నికల్లో ప్రచారం కోసమే రాహుల్ గాంధీ వచ్చినప్పటికీ.. విలేజ్ కుకింగ్ ఛానల్ నిర్వాహకులు దానిని ఒక పిఆర్ స్టంట్ లాగా కాకుండా.. రొటీన్ ప్రోగ్రాం లాగా రూపొందించడం విశేషం. ఇక కరోనా సమయంలో వీరు తమిళనాడు ప్రభుత్వానికి తమ వంతుగా నగదు విరాళాన్ని ఇవ్వడం విశేషం. మీరు తయారు చేసే వంటలు అత్యంత సహజ సిద్ధంగా ఉంటాయి. పైగా పచ్చని ప్రకృతి మధ్య మీరు వంటలు తయారు చేస్తుంటారు. యూట్యూబ్ ద్వారా దండిగా ఆదాయం వస్తున్న నేపథ్యంలో వీరు చేసే వంటలు కూడా చాలా బల్క్ గా ఉంటాయి. వీరు తయారు చేసిన వంటలను స్థానికంగా ఉన్న వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాలలో పంచుతుంటారు..
యూట్యూబ్ అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది ఛానల్స్ ఏర్పాటు చేస్తున్నారు. కాకపోతే క్రియేటివిటీ కంటెంట్ రూపొందించలేక మధ్యలోనే వదిలేస్తున్నారు. కానీ విలేజ్ ఛానల్ నిర్వాహకులు అలా కాదు. యూట్యూబ్లో చరిత్ర సృష్టించడానికే కంకణం కట్టుకున్నారు. అదే దిశగా అడుగులు వేస్తూ సంచలనాల సృష్టిస్తున్నారు. ఎక్కడో తమిళనాడులోని మారుమూల గ్రామానికి చెందినవారు ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. అంతేకాదు తమ రూపొందించే కుకింగ్ వీడియోలను హాలీవుడ్ లో సినిమాలు తీయడానికి ఉపయోగించే రెడ్ కెమెరా వాడుతారు. అందువల్లే ఆ వీడియోలు అత్యంత క్లారిటీగా ఉంటాయి. చివరికి పెరియ తంబి, అతని మనవళ్ళు నిర్వహిస్తున్న ఛానల్ ప్రస్తావన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ వేడుకలో తీసుకొచ్చారంటే.. వారు ఏ స్థాయిలో క్లిక్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు విలేజ్ కుకింగ్ ఛానల్ కు యూట్యూబ్ నిర్వాహకులు డైమండ్ బటన్ అందించడం విశేషం.
View this post on Instagram