Nellore News : సాధారణంగా తండ్రి తీరే కొడుకు ఉంటారని అనుకుంటారు. ఎందుకంటే తండ్రి చేసే పనులే కొడుకుకు అలవాటుగా మారుతూ ఉంటాయి. కానీ ఓ ప్రదేశంలో తండ్రికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు ఓ ఆరేళ్ల కొడుకు. తన తండ్రి చేసిన పనిని పోలీసులకు చెప్పి నిజాయితీని నిరూపించుకున్నాడు. ఒకరకంగా ఇతను చేసిన పనిని అందరూ మెచ్చుకుంటుండగా.. మరికొందరు తండ్రికి వ్యతిరేకంగా ఉన్నాడేంటి? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ తండ్రి చేసిన పని ఏంటి? ఆరేళ్ల కొడుకు చెప్పిన సాక్ష్యం ఏంటి?
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా.. అనంత సాగరంలో ఇటీవల పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా వాహనాల తనిఖీ చేపట్టారు. అయితే ఈ గ్రామంలోని ఓ వాడకు చెందిన సురేష్ తన వాహనాన్ని పోలీసులకు దొరకకుండా దాచి పెట్టాడు. ఈ విషయాన్ని తన ఆరేళ్ల కొడుకు మహేంద్ర చూశాడు. దీంతో తమ ఇంటికి పోలీసులు రాగానే.. సురేష్ కు వ్యతిరేకంగా తన తండ్రి దాచిపెట్టిన వాహనాన్ని చూపిస్తానని పోలీసులను తీసుకెళ్లాడు. ఆ తర్వాత వారు ఆ వాహనం చూసి షాక్ అయ్యారు.
తండ్రి చేసిన పనికి కొడుకు ఇలా నిజాయితీగా సాక్ష్యం చెప్పడంపై అందరూ ఆశ్చర్యపోయారు. పిల్లల ముందు ఏవైనా పనులు చేస్తే వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా ఆ బాలుడు ఎంతో ధైర్యంగా పోలీసులను తీసుకెళ్తున్న వీడియోను చూసి చాలామంది రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇంత చిన్న పిల్లోడిలో ఎంతో నిజాయితీ ఉంది అని.. పెద్దవారు వీరిని చూసి నేర్చుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.
అంతేకాకుండా పోలీసులను తీసుకెళ్తూ బాలుడు’మీరు వస్తున్నారని మా నాన్న బండిని దాచి పెట్టాడు’ అని చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. చిన్న పిల్లలకు అబద్ధాలు చెప్పడం తెలియదని.. అందుకే ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టారని కొందరు ఈ వీడియోని చూసిన తర్వాత కామెంట్ లో పెడుతున్నారు.
ఇప్పటికైనా వాహనాలకు సరైన పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని.. అలాగే సరైన వాహనాలను మాత్రమే డ్రైవ్ చేయాలని కొందరు సూచిస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో వైరల్ గా మారింది.
#Nellore : పోలీసుల కార్డెన్ సెర్చ్‌లో ఆసక్తికర ఘటన!
పోలీసుల తనిఖీలు జరుగుతుండటంతో ఓ వ్యక్తి తన బైక్‌ను వేరే వీధిలో దాచాడు
విషయం తెలిసిన అతడి ఆరేళ్ల బాలుడు పోలీసుల వద్దకు వెళ్లి.. తన తండ్రి బైక్ దాచిన విషయాన్ని చెప్పిన చిన్నారి#Ananthasagaram #CardonSearch #viralvídeo pic.twitter.com/nzhEhY4cnJ
— ANN Telugu (@ANN_Telugu) August 21, 2026