HomeNewsVaranasi Movie: వారణాసి మూవీకి అంత సీన్ లేదంటున్న స్టార్ డైరెక్టర్స్...

Varanasi Movie: వారణాసి మూవీకి అంత సీన్ లేదంటున్న స్టార్ డైరెక్టర్స్…

Varanasi Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. రాజమౌళి ఎప్పుడైతే బాహుబలి సినిమా చేశాడో అప్పటినుంచి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రూపురేఖలు మారిపోయాయి. ప్రతి ఒక్కరు భారీ బడ్జెట్ తో సినిమాలను చేసి ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ లను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి ఉన్న దర్శకులతో మాత్రమే స్టార్ హీరోలు సినిమాలు చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే […]

Varanasi Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. రాజమౌళి ఎప్పుడైతే బాహుబలి సినిమా చేశాడో అప్పటినుంచి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రూపురేఖలు మారిపోయాయి. ప్రతి ఒక్కరు భారీ బడ్జెట్ తో సినిమాలను చేసి ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ లను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి ఉన్న దర్శకులతో మాత్రమే స్టార్ హీరోలు సినిమాలు చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో ఒక భారీ సినిమా చేస్తున్నాడు. వారణాసి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 7 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో రాజమౌళి మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది…

ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సక్సెస్ ఫుల్ సినిమాలు చేసిన రాని గుర్తింపు రాజమౌళి కి బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాతో వచ్చింది. ఇప్పటివరకు ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరించింది… అయితే ఇప్పుడు వారణాసి సినిమా విషయంలో సైతం బాలీవుడ్ డైరెక్టర్లు కొంతమందిని డిసప్పాయింట్ చేసే మాటలైతే మాట్లాడుతున్నారు. వారణాసి సినిమా మీద 1500 కోట్లు బడ్జెట్ ను పెడుతున్నారు.

కానీ ఆ సినిమాకి అంత బడ్జెట్ అవసరమా? మహేష్ బాబుకి ఇండియాలోనే పెద్దగా మార్కెట్ లేదు. పాన్ వరల్డ్ లో ఆయన ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా కొంచెం తేడా కొట్టిన కూడా రాజమౌళి చాలావరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

అసలు ఈ సినిమా మీద ఎక్కడా కూడా బజ్ క్రియేట్ అవ్వడం లేదంటూ బాలీవుడ్ లో ఉన్న కొంతమంది దర్శకులు దీని మీద విమర్శలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది… రాజమౌళి మాత్రం ఈ విషయాలను పట్టించుకోకుండా తన సినిమాతోనే వాళ్ళందరికి సమాధానం చెప్పాలనే ప్రయత్నంలో ఉన్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper