Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ కి చాలా మంచి ఇమేజ్ ఉంది. పాన్ ఇండియాలో సైతం తను సినిమాలు చేసి మెప్పిస్తున్నాడు. గ్లోబల్ స్టార్ గా అవతరించిన రామ్ చరణ్ ఇప్పుడు రాబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్లో చేస్తున్న ‘పెద్ది’ సినిమా మీదనే ఆయన భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులైతే షరా వేగంగా జరుగుతున్నాయి. ఇక ఇలాంటి నేపథ్యంలోనే రామ్ చరణ్ బుచ్చిబాబు మీద కొంత వరకు ఫైర్ అవుతున్నాడు అంటూ కొన్ని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కారణం ఏంటంటే రామ్ చరణ్ మొదట ఏప్రిల్ 30వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ట్రై చేశాడు.
కానీ అది వర్కౌట్ కాలేదు దాంతో జూన్ 24, 25వ తేదీల్లో ఈ సినిమా రాబోతుందంటూ ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్ ఒక లీక్ ఇచ్చారు. ఈ విషయం మీద రామ్ చరణ్ బుచ్చిబాబు మీద కోపానికి వచ్చాడట. మరీ అంత లేట్ అయితే సినిమా మీద ఉన్న బజ్ పోతుంది. వీలైతే మే చివరి వారంలో గాని జూన్ మొదటి వారంలో గాని రిలీజ్ చేద్దాం అని చెప్పారట.
దాంతో బుచ్చిబాబు అలా వర్క్ తొందరగా కాదేమో అనే ఒక చిన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పటికి రామ్ చరణ్ బుచ్చిబాబు మీద తీవ్రంగా ఫైర్ అయ్యారట. అందుకే మనం రిలీజ్ డేట్ ఇచ్చినప్పుడే ఆలోచించుకొని చెప్పాలి. రెండు మూడు సార్లు పోస్ట్ పోన్ చేయడం వల్ల ప్రేక్షకులకు సినిమా మీద ఇంట్రెస్ట్ పోతుంది. జూన్ 4వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేద్దామని అటు బుచ్చిబాబుకి, ఇటు ప్రొడ్యూసర్స్ కి రామ్ చరణ్ చెప్పారట.
మొత్తానికైతే రామ్ చరణ్ చెప్పిన డేట్ ని లాక్ చేశారు. ఇక జూన్ 4వ తేదీన ఈ సినిమా అంగరంగ వైభవంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమాని మెగా అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు సైతం చూసి ఎలా రెస్పాండ్ అవుతారు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…