Prabhas:ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫౌజీ గ్లింప్స్ అభిమానులకు పూనకాలు తెప్పించింది. ఇది కదా మాకు కావాల్సింది అంటూ అభిమానులు అనుకునేలా చేసింది. గ్లింప్స్ చూస్తే ఇది కేవలం ఒక వార్ యాక్షన్ సినిమా మాత్రమే కాదని సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో మూడు అంశాలను డి కోడ్ చేస్తే సంచలన విషయాలు బయటపడ్డాయి.
ప్రభాస్ సాధారణ సైనికుడు కాదు
గ్లింప్స్ లో ప్రభాస్ ను బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడే శక్తివంతమైన సైనికుడిగా పరిచయం చేశారు. అతడిని బ్రిటిష్ అధికారులకు ముప్పుగా మారిన వ్యక్తిగా చూపించారు. దీని వెనక బలమైన కథ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రభాస్ కేవలం ఆదేశాలను పాటించే సైనికుడు మాత్రమే కాదు, దేశ స్వాతంత్రం కోసం తనదైన మార్గంలో పోరాడే తిరుగుబాటు దారుడు.. గ్లింప్స్ రెండో కోణం ఇదే సంకేతాలుస్తోంది.
నేతాజీ, హిట్లర్ ఎపిసోడ్
గ్లింప్స్ ప్రారంభంలో 1942 మే 29 బెర్లిన్ లో జరిగినట్టుగా చూపించే చారిత్రాత్మక నేపథ్యం, సుభాష్ చంద్రబోస్, హిట్లర్ సమావేశానికి సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. దీని ద్వారా దర్శకుడు హను రాఘవపూడి స్వాతంత్ర్య పోరాటాన్ని కేవలం భారతదేశంలోని సంఘటనలకే పరిమితం చేయలేదు. రెండవ ప్రపంచ యుద్ధం నాటి అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులతో అనుసంధాని ప్రయత్నం చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది చారిత్రాత్మకంగా జరిగిన సంఘటనలను సినిమాలలో ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తారా? ప్రభాస్ పాత్రను నేతాజీ ప్రణాళికలో భాగంగా చూపిస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.
ఆ నెంబర్ వెనుక మిస్టరీ ఏంటి
గ్లింప్స్ లో అత్యంత ఆసక్తికరమైన అంశాలలో ఒకటి ప్రభాస్ పాత్రను 1932 నుంచి వెతుకుతున్న వ్యక్తిగా పరిచయం చేయడం.. అలాగే ఫైల్ నెంబర్ 025 అనే అంశం కూడా కథలో కీలకంగా కనిపిస్తోంది. అయితే ఇందులో ఒక రెండు అంశాలను స్పష్టంగా గమనించవచ్చు. బ్రిటిష్ ప్రభుత్వానికి చిక్కకుండా రహస్యంగా పోరాడుతున్న వ్యక్తి లాగా ప్రభాస్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక రెండవది.. అధికారిక చరిత్రలో పెద్దగా ప్రస్తావనకు రాని స్వాతంత్ర్య సమరయోధుడి కథను కల్పిత అంశాలతో అనుసంధానం చేసి ఉండవచ్చు.
ప్రభాస్ డైలాగులలో చాలా లోతుంది
గ్లింప్స్ చివర్లో వినిపించే హిందీ డైలాగులు బ్రిటిష్ పాలకుడి రక్తం చిందించడంతోపాటు స్వాతంత్ర్యాన్ని కూడా లాక్కుంటానని తిరుగుబాటు ధోరణి కనిపిస్తోంది. అయితే ఇది కేవలం మాస్ డైలాగ్ మాత్రమే కాదు. ప్రభాస్ పాత్రకు స్వాతంత్ర్యం అనేది ఎవరో ఇచ్చే వరం కాదు.. పోరాడి సాధించాల్సిన హక్కు అనే భావనను ఆయన మాటలు ప్రతిబింబిస్తున్నాయి.
హను రాఘవపూడి చాలా దాచారు
దర్శకుడు ఈ కథకు చారిత్రక నేపథ్యాన్ని జోడించారు. రెండవ ప్రపంచ యుద్ధం.. నేతాజీ ప్రస్తావన తీసుకొచ్చారు. బ్రిటిష్ పరిపాలనను ఎదిరించే సైనికుడి పోరాటాన్ని ఇందులో చూపించారు. ఒంటరిగా పోరాడే యోధుడిగా ప్రభాస్ ను చూపించారు.. A Battalion who Fights Alone అనే ట్యాగ్ లైన్ కూడా ఈ ఒంటరి పోరాటం అనే భావనను బలపరుస్తోంది.
బాహుబలికి మించిన ఫాంటసీ
ఇప్పటివరకు ప్రభాస్ నటించిన చిత్రాలలో బాహుబలి సినిమాలో బీభత్సమైన ఫాంటసీ ఉంటుంది. ఇప్పుడు ఈ సిని అంతకుమించిన చారిత్రక నేపథ్యంతో ఫాంటసీ కనిపిస్తోంది. యాక్షన్ రామ్ అని కూడా దీనికి యాడ్ చేశారు. ఇందులో ప్రభాస్ బలం కేవలం ఫిజికల్ గా మాత్రమే కాదు.. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించే తిరుగుబాటు నాయకుడిగా అతడు కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొత్తంగా నేతాజీ చారిత్రక నేపథ్యానికి, 1932 నుంచి వెతుకుతున్న తిరుగుబాటు సైనికుడు అనే మిస్టరీకి మధ్య దర్శకుడు ఎలాంటి సంబంధం సృష్టించారు అనేది ఇక్కడ అసలు ప్రశ్న. ఇక ఈ రెండు అంశాల మధ్య బలమైన కథ, కథనం ఉంటే ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది.