అమెరికా జనాభాలో సగం మందికి పూర్తిస్థాయి కొవిడ్ వ్యాక్సిన్ అందిందని శ్వేతసౌధం ప్రకటించింది. కరోనా డెల్టా రకం అగ్రదేశాన్ని మరోసారి కలవరపెడుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ను ఇటీవల వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే తాజా మైలురాయిని చేరుకున్నారు. ఈ విషయాన్ని శ్వేతసౌధంలో వ్యాక్సినేషన్ సమాచార విభాగానికి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న సైరస్ షాపర్ ప్రకటించారు.
అమెరికాలో ఇప్పటి వరకు 165 మిలియన్ల మందకి రెండు డోసుల మోడెర్నా లేదా ఫైజర్ టీకా అందింది. ఇక మొత్తం జనాభాలో 58.4 శాతం అంటే 193 మిలియన్ల మందికి కనీసం ఒక డోసు టీకా అందింది. తాజాగా మరోసారి అమెరికాలో రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. డెల్టా వేరియంట్ విజృంభిస్తుండడంతో న్యూయార్క్ లాస్ ఏంజిల్స్ సహా కొన్ని కీలక ప్రాంతాల్లో మరోసారి ఆంక్షలు విధించారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: A complete vaccine for 50 percent of people in america
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com