HomeజాతీయంRahul Gandhi: రాహుల్ గాంధీని సొంత నేతలే లైట్ తీసుకున్నారు..

Rahul Gandhi: రాహుల్ గాంధీని సొంత నేతలే లైట్ తీసుకున్నారు..

Rahul Gandhi:ప్రఖ్యాత ఏఎన్ఐ ఒక ట్వీట్ చేసింది. రాహుల్ గాంధీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు పిలుపునిచ్చి.. ఢిల్లీలో చేపట్టిన కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు హాజరు కాలేదు. దీంతో ఒళ్ళు మండి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆ నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కనీసం ఎటువంటి షోకాజ్ లెటర్ కూడా రాయకుండా.. మొహమాటం లేకుండా పార్టీ నుంచి దూరం పెట్టింది. ఇది వెలుగులోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసలు వ్యవహారాలు […]

Rahul Gandhi:ప్రఖ్యాత ఏఎన్ఐ ఒక ట్వీట్ చేసింది. రాహుల్ గాంధీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు పిలుపునిచ్చి.. ఢిల్లీలో చేపట్టిన కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు హాజరు కాలేదు. దీంతో ఒళ్ళు మండి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆ నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కనీసం ఎటువంటి షోకాజ్ లెటర్ కూడా రాయకుండా.. మొహమాటం లేకుండా పార్టీ నుంచి దూరం పెట్టింది.

ఇది వెలుగులోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసలు వ్యవహారాలు బయటపడుతున్నాయి. మొన్నటికి మొన్న డీకే శివకుమార్ రాహుల్ గాంధీకి బాడీగార్డ్ లాగా వ్యవహరించారు. చివరికి ఢిల్లీలో జరుగుతున్న నిరసనలో డీకే శివకుమార్ ను రాహుల్ గాంధీ వ్యక్తిగత భద్రత సిబ్బంది పక్కకు నెట్టేశారు. నిన్నటికి నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనియా గాంధీకి బౌన్సర్ అవతారం ఎత్తారు. ఢిల్లీ నడిగడ్డ మీద తెలంగాణ పరువు తీశారని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి ఇంతవరకు కౌంటర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. ఇచ్చే అవకాశం కూడా లేదు.

ఇవన్నీ ఇలా జరుగుతుండగానే కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమందిని సస్పెండ్ చేసినట్టు స్వయంగా ఆ పార్టీ అధిష్టానమే చెప్పుకుంది. ఒకవేళ రాహుల్ గాంధీ చేస్తున్న కార్యక్రమంలో పూర్తిస్థాయిలో వాస్తవాలు ఉంటే.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అక్రమాలకు పాల్పడి ఉంటే కచ్చితంగా దేశం మొత్తం రాహుల్ గాంధీ వైపు నిలబడి ఉండేది. ఈవీఎం చోరీ అంటారు.. ఓటు చోరీ అంటారు.. తెలంగాణ.. కర్ణాటక .. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో గెలిచారు కదా అంటే చప్పుడు చేయరు. చివరికి బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ గెలిచే దమ్మును కోల్పోయింది. అధికారంలో ఉన్న కర్ణాటకలో నాలుగు ఎమ్మెల్సీలను నష్టపోయింది. చివరికి దేశవ్యాప్తంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకోలేదు.

ఈవీఎం చోరీలు.. ఓటు చోరీలు.. ఇలా రకరకాల ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. కాని దానికి ఆధారాలు ఇవ్వడంలో విఫలమవుతోంది. మొన్నటికి మొన్న దేశ రాష్ట్రపతి ఇదే విషయం మీద రాహుల్ గాంధీని ప్రశ్నిస్తే.. ఆయన సమాధానం చెప్పలేదు. ఇంతవరకు ఆధారాలు కూడా సమర్పించలేదు. ఇటువంటి వ్యక్తి చేసే ధర్నాలకు.. నిరసనలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా స్పందిస్తారు.. వాళ్లకు కూడా పొలిటికల్ అంచనాలు.. లక్ష్యాలు ఉంటాయి కదా.. ఆస్తమానం రాహుల్ గాంధీ కుటుంబం సేవ చేయడానికి వాళ్ళు ఏమీ ఆఫీస్ బేరర్లు కాదు కదా.. సరిగ్గా ఈ విషయం జాతీయ మీడియా సంస్థల ద్వారా వెలుగులోకి రావడంతో బిజెపి కౌంటర్ మొదలుపెట్టింది. పాపం కాంగ్రెస్ .. పాపం రాహుల్ గాంధీ..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper