Metro Rail Ticket- WhatsApp: మెట్రో సేవలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. వారి కోసమే నూతన విధానాలు ప్రవేశపెడుతున్నారు. హైదరాబాద్ నగరం కాస్త మెట్రో నగరంగా మారిపోయింది. ఇన్నాళ్లు సిటీ బస్సుల్లో కిక్కిరిసి వెళ్లిన జనం ఇక మెట్రో సేవలను వినియోగించుకుంటున్నారు. తాము చేరాల్సిన గమ్యస్థానాలను సురక్షితంగా చేరుకుంటున్నారు. పైగా బోలెడు సమయం ఆదా. దీంతో కార్యాలయాల్లో విధులు నిర్వహించే వారు సరైన సమయానికి ఉద్యోగాలకు వెళుతూ ఆలస్యం అనే పదమే తెలియకుండా చేస్తున్నారు. దీంతో రైల్వే శాఖ ప్రయాణికుల కోసం ఇంకా కొత్త పద్ధతులు ప్రవేశపెడుతోంది.

ఇక నుంచి వాట్సాప్ ద్వారా రైల్వే టికెట్ ను బుక్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది. దీనికి గాను ప్రయాణికులు 8341146468 అనే వాట్సాప్ నెంబర్ కు వాట్సాప్ లో హాయి అనే సందేశం పంపిస్తే ఒక లింక్ మెసేజ్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేయానే వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో టికెట్ బుక్ చేసుకోవచ్చు. వచ్చిన క్యూఆర్ కోడ్ ను మెట్రో స్టేషన్ ఎంట్రీ గేటు వద్ద చూపిస్తే సరిపోతుంది. ఇంత సౌలభ్యంగా టికెట్ ను బుక్ చేసుకునే సౌకర్యం కల్పించడంతో ఇక వినియోగదారులకు మరింత సమయం ఆదా కానుంది.
ఇన్నాళ్లు స్టేషన్ లో క్యూ లో నిలబడి టికెట్ తీసుకోవడం చేస్తుండేవారు. ఇకపై క్యూ లైన్లో ఉండాల్సిన పనిలేదు. చక్కగా ఇంటి వద్ద నుంచే టికెట్ బుక్ చేసుకుని డైరెక్టుగా మెట్రో ఎక్కొచ్చు. దీంతో సమయం ఆదా అయి ఆఫీసులకు త్వరగా చేరుకోవచ్చని చెబుతున్నారు. హైదరాబాద్ మెట్రో అధికారులు ప్రయాణికుల కోసం ఎన్నో ఆకర్షణీయమైన పథకాలు ప్రవేశపెడుతున్నారు. దీంతో రైల్వే శాఖ అందిస్తున్న ఆఫర్లతో ప్రయాణికులకు ఎంతో మేలు కలుగుతోంది. ప్రయాణికుల సేవలోనే తమకు తృప్తి ఉందని వారు నిరూపిస్తున్నారు.

రానురాను హైదరాబాద్ మెట్రో ఇంకా విస్తరించనుంది. ఇప్పటికే నగరం నలుమూలలకు వెళ్తున్న మెట్రో ఇంకా కొత్త మార్గాలను సైతం వేస్తోంది. దీంతో నగరం మొత్తం మెట్రోగా మారిపోనుంది. కొత్త మార్గాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలనేదే వారి లక్ష్యం. ప్రజలకు మరిన్ని నాణ్యమైన సేవలందించి గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే కొత్త పథకాలకు పురుడు పోస్తోంది. ప్రయాణికుల బాధలను పట్టించుకుంటోంది. వారి సమయాన్ని ఆదా చేసే మార్గంలో కొత్త మార్గాలను అన్వేషిస్తోంది.