Pawan Kalyan- Rajamouli: తెలుగు పరిశ్రమలో స్టార్ డైరెక్టరెవరంటే ఠక్కున రాజమౌళి అని సమాధానం చెబుతారు. అలాంటి దర్శకుడితో సినిమా అంటే ఎవరైనా గంతేస్తారు. ఒకటి కాదు రెండు కాదు తీసినవి పన్నెండు సినిమాలు. అన్ని బ్లాక్ బస్టర్ హిట్లే. ఓటమే ఆయన్ను చూస్తే పారిపోతుంది. ఆ పదానికే స్పెల్లింగ్ కూడా తెలియని సత్తా ఆయన సొంతం. సినిమా నిర్మాణం మొదలెట్టాడంటే ఆగడు. పూర్తి చేసేదాకా వదలడు. ఎన్ని అవాంతరాలు వచ్చినా పట్టించుకోడు. పట్టువదలని విక్రమార్కుడు. కొన్ని సినిమాలే అయినా అన్నింటిని హిట్లుగా నిలిపి ఫెయిల్ అనే పదమే తనకు తెలియదని నిరూపించుకున్నాడు. చిన్న హీరోలను సైతం అగ్రహీరోలుగా మలిచిన ఆయన ప్రతిభకు హాట్యాఫ్. అంతటి మహత్తర శక్తిశాలి రాజమౌళి. చూడటానికి సాధారణమై వ్యక్తిలాగే కనబడతాడు. ఆయన వ్యక్తి కాదు మహోన్నత శక్తి.

ఆయన దర్శకత్వం వహిస్తున్నాడంటే ఒకటే ఉత్కంఠ. సినిమా బ్రహ్మాండమైన హిట్టే అనే టాక్ వస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అంతటి దర్శకధీరుడి దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం వచ్చినా వదులుకోవడం అంటే వారికే నష్టం. ఆ జాబితాలో మన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేరతారు. అప్పట్లో సంచలన విజయం సాధించిన సినిమా సై. ఇందులో హీరోగా చేయమని పవన్ ను రాజమౌళి అడిగారట. కానీ సినిమా కథ మొత్తం విన్నాక ఇది వినూత్నంగా ఉందని వద్దనుకున్నారట. దీంతో ఆ అదృష్టం నితిన్ తలుపు తట్టింది. అప్పటికే జయం, దిల్ సినిమాలతో మంచి ఊపు మీదున్న నితిన్ కు సై మంచి క్రేజి్ ను తెచ్చింది. దీంతో ఆయన ఎక్కడికో వెళ్లిపోయారు.
అమరశిల్పి జక్కన్న చెక్కిన శిల్పం అంటే దానికి తిరుగుండదు. పరాజయం అనే మాటే ఉండదు. సినిమా మొదలు పెట్టాడంటే వెనుదిరిగి చూడడు. మళ్లీ రాజీ అనే ప్రసక్తే లేదు. ముందుకెళ్లడమే కానీ వెనకకు రాడు. అంతటి దర్శకుడి ఆఫర్ ను కాదన్నందుకు పవన్ ఇప్పటికి కూడా బాధపడుతూనే ఉంటాడు. తనకు మంచి విజయాన్నిచ్చే సినిమాను వద్దనుకున్నానని చాలా సార్లు బాధపడిన సందర్భాలు సైతం ఉన్నాయి. భవిష్యత్ లో వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుందో లేదో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.

సినీ పరిశ్రమలో ఇద్దరు దిగ్గజాలే. ఒకరు కథానాయకుడు, మరొకరు దర్శకుడు. వారి కలయికలో ఓ సినిమా వస్తే చూడాలని అందరు ఎదురు చూస్తున్నారు. ఇదివరకే అవకాశం వచ్చినా ఏదో అది కాస్త కుదరలేదు. కానీ ప్రస్తుతం వారి కాంబినేషన్ లో ఓ మంచి బ్లాక్ బస్టర్ వస్తే ఇక తిరుగే ఉండదని చెబుతున్నారు. ఇప్పటికే మహేశ్ బాబుతో రాజమౌళి సినిమా ప్లాన్ చేస్తున్నారు. త్వరలో వీరిద్దరు కలిసి ఓ మూవీ చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు. మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దాని తరువాత రాజమౌళితో నే ఉంటుందనే టాక్ ఇప్పటికే ఉంది. దీంతో వారిద్దరు కలిసి పనిచేస్తే చూడాలని చాలా మంది అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.