Homeఆంధ్రప్రదేశ్‌APPSC Group 1 Scam: మరో తీగ తగిలింది.. జగన్ కు ఈడీ సెగ గట్టిగానే..

APPSC Group 1 Scam: మరో తీగ తగిలింది.. జగన్ కు ఈడీ సెగ గట్టిగానే..

APPSC Group 1 Scam: ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ మూల్యాంకనం లో అక్రమాలు జరిగాయని అభియోగాలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో గట్టిగానే నగదు చేతులు మారిందని కీలకమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలోకి enforcement directorate ఎంట్రీ ఇచ్చింది.. లావాదేవీలు.. నిధుల మళ్లింపు వంటి అంశాలపై దర్యాప్తు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో మరిన్ని వివరాలు విలువలోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఏపీపీఎస్సీ […]

APPSC Group 1 Scam: ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ మూల్యాంకనం లో అక్రమాలు జరిగాయని అభియోగాలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో గట్టిగానే నగదు చేతులు మారిందని కీలకమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలోకి enforcement directorate ఎంట్రీ ఇచ్చింది.. లావాదేవీలు.. నిధుల మళ్లింపు వంటి అంశాలపై దర్యాప్తు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో మరిన్ని వివరాలు విలువలోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ పై గతంలో ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంలో నిరుద్యోగ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని విమర్శలు ఉన్నాయి. పరీక్షల నిర్వహణ.. మూల్యాంకాన విధానం.. సంబంధిత అధికారుల పాత్ర వంటి అంశాలపై వివాదం కొనసాగింది. ఈ కేసులో అప్పటి ఏపీపీఎస్సీ అదనపు కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు పాత్ర పై కూడా ఆరోపణులు వచ్చినట్టు సమాచారం.

ఈడి దర్యాప్తులో ఆర్థిక లావాదేవీలు.. ఇతర మార్గాల్లోకి నిధులు మళ్లించినట్టు ఆధారాలు లభిస్తే మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు జరిగే అవకాశం. గ్రూప్ వన్ మూల్యాంకన వ్యవహారంలోను ఆర్థిక లావాదేవీలు.. నిధుల మళ్లింపు వంటి అంశాలపై దర్యాప్తు జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈడి కేసు నమోదు చేసిన తర్వాత.. దర్యాప్తులో సేకరించిన ఆధారాలు.. ఇతర వ్యక్తుల పాత్ర.. వంటి విషయాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి.. ఈడి దర్యాప్తు.. మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించిన ఆర్థిక అంశాలపై ప్రధానంగా సాగుతోంది. మూల నేరానికి సంబంధించిన విచారణ.. అభియోగాలు.. శిక్షలు.. సంబంధిత చట్టాల పరిధిలో ఉంటాయి.

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల వ్యవహారం నిరుద్యోగ అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉండడంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన నిర్ణయాలు.. పరీక్షల నిర్వహణలో పారదర్శకత.. అధికారుల బాధ్యత వంటి అంశాలపై రకరకాల చర్చలు సాగుతున్నాయి.

ఒకవైపు ఈడి అనేక వ్యవహారాలలో తవ్వకాలు చేపడుతుంది. దీంతో జగన్ వర్గానికి ఉచ్చు బిగిసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఈ దర్యాప్తు వేగంగా సాగితే.. జగన్.. వైసీపీలో ఉన్న నాయకుల రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో అనే ప్రశ్న వ్యక్తమవుతోంది. వ్యవస్థలను నాడు అడ్డం పెట్టుకొని సాగించిన వ్యవహారాలకు.. ఇప్పుడు లెక్కలు తేలుతున్నాయని టిడిపి నేతలు అంటున్నారు. ఇటీవల డీఎస్సీలో అక్రమాలు జరగకపోయినా వైసీపీ నానా యాగీ చేసింది. ఈ వ్యవహారంలో ఫిన్ డ్రాప్ సైలెన్స్ సుత్రాన్ని పాటిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper