Anant Ambani: మా పేస్ క్రీమ్ రాసుకుంటే నలుపుదనం పోతుంది. తెలుపుదనం వస్తుంది. నిగనిగలాడిపోతారు. నిత్య యవ్వనంగా కనిపిస్తారు.
మా ఆయిల్ రాసుకుంటే బట్ట తలపై జుట్టు మొలుస్తుంది. చివరికి రాసుకున్న ఆయిల్ చేతికి కూడా వెంట్రుకలు వస్తాయి. ప్రసిద్ధ వనమూలికల నుంచి ఆయిల్ తయారు చేశాం. ఇది ఎంతమందికి శిరోజాలను.. జుట్టును తిరిగి తీసుకొచ్చింది.
ఇలానే ఉంటాయి కదా మార్కెట్లో ప్రకటనలు. వాస్తవానికి ఒక మనిషి సౌందర్యానికి సంబంధించి జరుగుతున్న వ్యాపారం విలువ లక్షల కోట్లల్లో ఉంటుంది. మనదేశమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా పెద్దపెద్ద కంపెనీలు కేవలం సౌందర్య ఉత్పత్తుల తయారీ ద్వారా లక్షల కోట్లు సంపాదిస్తున్నాయి. అపరిమితమైన బ్రాండ్ వేల్యూ ను పెంపొందించుకుంటున్నాయి. దీనివల్ల జరిగే ప్రయోజనం ఎంత.. అనే విషయాన్ని పక్కన పెడితే. కంపెనీలు మాత్రం బ్రహ్మాండంగా బాగుపడుతున్నాయి.
ఒకప్పటి కాలంలో కొన్ని కంపెనీలు మాత్రమే సౌందర్య ఉత్పత్తులు తయారు చేసేవి. కానీ ఇప్పుడు చాలా కంపెనీలు అడుగుపెట్టాయి. రకరకాల రూపాలలో ఉత్పత్తులను తీసుకొస్తున్నాయి. సినిమా తారలను.. స్పోర్ట్స్ పర్సనాలిటీలను ప్రచారానికి నియమించుకుంటున్నాయి. దీనికోసం కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నాయి. తద్వారా మార్కెట్ లో గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. దీనివల్ల జనాలకు కలిగే లాభం గురించి పక్కన పెడితే కంపెనీలకు వచ్చే ప్రాఫిట్ మామూలుగా ఉండదు.
ఒకవేళ కంపెనీలు తయారు చేసే ఉత్పత్తులు నిజంగా పనిచేస్తే అనంత అంబానీ బట్టతల మీద జుట్టు మొలుస్తుంది కదా. అతడి భారీ శరీరం నాజూకుగా మారిపోతుంది కదా. అనంత్ అంబానీ భార్య బుగ్గల మీద ఉన్న మొటిమలు కనిపించవు కదా. అంతటి అనంత్ అంబానికి డబ్బులేక కాదు. అతడు విస్తారమైన లక్షల కోట్ల వ్యాపారానికి వారసుల్లో ఒకడు. అతడి భార్య రాధిక కూడా అంతే. తన తండ్రికి వేలకోట్ల వ్యాపారం ఉంది. అత్తవారింట్లో కూడా ఉత్తరాలు కూర్చుని తిన్నా తరగని సంపద ఉంది. ఆయనప్పటికీ ఆ మొటిమల మొహంతోనే కనిపిస్తోంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఇటువంటి వీడియోలు.. ఫోటోలను మనం చూసే భాగ్యం కలుగుతుంది. లేకపోతే గుండు మీద జుట్టు వస్తుంది అంటే నమ్ముతాం. మొటిమలు పోతాయి అంటే డబ్బులు ఎంతైనా ఖర్చుపెట్టి కొనుగోలు చేస్తాం. మోసపోయినా సరే కొనుగోలు చేస్తూనే ఉంటాం . ఎందుకంటే మనకు అందం మీద ఉన్న యావ.. భౌతిక పరమైన సొగసు మీద ఉన్న ఇష్టం మామూలుది కాదు.