Bigg Boss 10 Telugu: ఆడియన్స్ లో అశేష ఆదరణ ఉన్నటువంటి రోహిత్ లాంటి తోపు కంటెస్టెంట్ ని అర్థం పర్థం లేకుండా , హౌస్ మేట్స్ ఓట్లతో నిర్దాక్షిణంగా ఎలిమినేట్ చేయడం, ఎప్పుడో మూడవ వారమే ఎలిమినేట్ అవ్వాల్సిన వర్షిణి ని సేవ్ చేస్తూ రావడం. ఇదీ ఈ సీజన్ పరిస్థితి. ఈ సీజన్ లో జరిగినన్ని దారుణమైన అన్యాయాలు ఏ సీజన్ లో కూడా జరగలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పూర్తిగా జనాలకు ఇష్టం లేని నిర్ణయాలు తీసుకుంటూ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సీజన్ ని సర్వ నాశనం చేసేసారు. దీపావళి సందర్భంగా ఈ వారం నో ఎలిమినేషన్ ప్రకటించాడు బిగ్ బాస్. దీంతో ఎలిమినేట్ అవ్వాల్సిన వర్షిణి సేవ్ అయ్యింది. చూస్తుంటే ఈమెని బలవంతంగా టాప్ 5 లోకి నెట్టేదాకా బిగ్ బాస్ టీం నిద్రపోయేలా లేదు. స్వయంగా ఆమె నేను వెళ్ళిపోతాను బాబోయ్ అని బ్రతిమిలాడినా బిగ్ బాస్ టీం పంపించేలా లేరు, ఇదెక్కడి దిక్కుమాలిన సీజన్ రా బాబు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
మరోవైపు సోషల్ మీడియా లో నెటిజెన్స్ రోహిత్ రీ ఎంట్రీ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతీ రోజు ఈ టాపిక్ ట్రెండ్ అవుతూనే ఉంది. వాస్తవానికి రోహిత్ ని ఈ దీపావళి ఎపిసోడ్ లోనే తీసుకొని రావాలని అనుకున్నారట. కానీ ఈ ప్లాన్ సోషల్ మీడియా లో లీక్ అవ్వడం తో బిగ్ బాస్ క్యాన్సిల్ చేసిందని , కానీ వచ్చే వారం కచ్చితంగా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. బిగ్ బాస్ హిస్టరీ లో ఒక టాప్ ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయడం అనేది చరిత్రలో ఎక్కడ జరగలేదు. సాధారణంగా ఈ షో ఓనర్స్ ఎండమోల్ షైన్ వారు ఇలాంటివి అనుమతించరు, కానీ గత సీజన్ పెద్ద హిట్ అవ్వడం , ఈ సీజన్ తెలుగు బిగ్ బాస్ టీం కి నిర్ణయాలు స్వయంగా తీసుకునే స్వేచ్ఛ ఇచ్చారు. దీంతో వాళ్లకు ఇష్టమొచ్చింది చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ కారణం చేత టీఆపీ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయని అంటున్నారు విశ్లేషకులు.