Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh Politics: ఎన్టీఆర్ ప్రజలు పంతం పట్టారు.. పాపం జగన్ మేనత్త

Andhra Pradesh Politics: ఎన్టీఆర్ ప్రజలు పంతం పట్టారు.. పాపం జగన్ మేనత్త

Andhra Pradesh Politics: జనాలు తలుచుకుంటే ఎంతటి గొప్ప వ్యక్తులైనా నేలమట్టం కావాల్సిందే. ఎంతటి నియంతలైనా సరే అన్ని సర్దేసుకొని పోవాల్సిందే. చరిత్ర చెప్పింది ఇదే. వర్తమానం చెబుతోంది కూడా ఇదే. ముఖ్యంగా ఏపీ ప్రజలు విజ్ఞులు. ఏదైనా కొంత కాలం సహిస్తారు. మార్పు కోసం ఎదురుచూస్తారు. కానీ తమదైన రోజు .. మార్పు కావాలి అనుకున్న రోజు కచ్చితంగా మార్చి చూపిస్తారు. 2024 ఎన్నికల్లో ఏపీలో ప్రజలు ఇటువంటి మార్పును చూపించారు. అప్పటిదాకా సంక్షేమంలో కొత్త […]

Andhra Pradesh Politics: జనాలు తలుచుకుంటే ఎంతటి గొప్ప వ్యక్తులైనా నేలమట్టం కావాల్సిందే. ఎంతటి నియంతలైనా సరే అన్ని సర్దేసుకొని పోవాల్సిందే. చరిత్ర చెప్పింది ఇదే. వర్తమానం చెబుతోంది కూడా ఇదే. ముఖ్యంగా ఏపీ ప్రజలు విజ్ఞులు. ఏదైనా కొంత కాలం సహిస్తారు. మార్పు కోసం ఎదురుచూస్తారు. కానీ తమదైన రోజు .. మార్పు కావాలి అనుకున్న రోజు కచ్చితంగా మార్చి చూపిస్తారు.

2024 ఎన్నికల్లో ఏపీలో ప్రజలు ఇటువంటి మార్పును చూపించారు. అప్పటిదాకా సంక్షేమంలో కొత్త సిద్ధాంతాలను చూపించాం.. కొత్త విధానాలను అమలు చేశామని చెప్పుకున్న జగన్ కు 11 సీట్లు ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే దిమ్మ తిరిగే విధంగా తీర్పు ఇచ్చారు. ఆకాశంలో కాదు.. ముందు నేలకు చూడు అంటూ సిసలైన తీర్పు ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో కూడా జగన్ పార్టీ మీద ఏపీ ప్రజలకు ఇంకా కోపం పోలేదు. మరోసారి కూడా దారుణమైన ఫలితాలను ఇచ్చారు. తద్వారా ఏపీ రాజకీయాలలో వైసీపీకి అవకాశం లేదు అన్నట్టుగా సంకేతాలు ఇచ్చారు.

జగన్ మీద మాత్రమే కాదు.. జగన్ మేనత్త మీద కూడా ఏపీ ప్రజలు రివెంజ్ తీర్చుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం పరిధిలోని గణపవరం జగన్ మేనత్త విమలమ్మ స్వగ్రామం. ఈ ఊరిలో జరిగిన స్థానిక ఎన్నికల్లో వైసిపికి దిమ్మ తిరిగిపోయింది. విమలమ్మ సొంత ఊరిలోనే వైసిపి దారుణమైన పరాజయం పాలైంది.

గణపవరం ఎంపిటిసి స్థానంలో టిడిపి అభ్యర్థి రామకృష్ణ అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఆయన తన సమీప వైసీపీ అభ్యర్థి సంది పాము రమేష్ పై 285 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ స్థానంలో వైసిపి గెలవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసింది. కానీ స్థానిక ప్రజలు మాత్రం టిడిపి అభ్యర్థికి జై కొట్టారు. దీంతో విమలమ్మ సొంత ఊరిలో జగన్ పార్టీకి కూసాలు విరిగిపోయాయి.

రోడ్డు దశాబ్దాలుగా ఈ గ్రామంలో ఒకే పార్టీ ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది. గత 20లుగా ఈ గ్రామంలో మొదట కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాత వైసిపి తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఎంపీటీసీలుగా గెలుస్తూ వచ్చారు.. ఇన్నాళ్లుగా తమకు కంచుకోట లాగా భావించిన ఈ గ్రామంలో ఊహించని ఓటమి ఎదురు కావడంతో వైసిపి నాయకులు తట్టుకోలేకపోతున్నారు. రెండు దశాబ్దాల తర్వాత గణపవరం ప్రాంతంలో టిడిపి జెండా ఎగరడంతో కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఊరంతా మిఠాయిలు పంచుకుంటూ.. దీపావళి పండుగను.. అదేవిధంగా పసుపు జెండా పండుగను గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. జగన్ సొంత నియోజకవర్గం లో టిడిపి జెండా ఎగిరింది. వాస్తవానికి రాయలసీమలో వైసీపీకి కంచుకోట లాంటి ప్రాంతాలలో టిడిపి అద్భుతమైన విజయాలను దక్కించుకుంది. ఇప్పుడు వైఎస్ మేనత్త స్వగ్రామంలో కూడా టిడిపి తిరుగులేని స్థాయిలో ఎగిరింది. మార్పు అంటే ప్రజలు కోరుకునేది. రాజకీయ పార్టీలు అంచనా వేసేది కాదని.. ఇక్కడి ఓటర్లు మరోసారి నిరూపించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper