Thiruparankundram Deepam: తిరుప్పరంకుండ్రంలో కొండపై ఉన్న దీప త్తూన్ అనే రాతి స్తంభం వద్ద కార్తీకదీపం వెలిగింది. నవంబరు 28న శనివారం సాయంత్రం ఐదు గంటలకు తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో దీపం బ్రహ్మండంగా వెలిగింది. భక్తులు కూడా దీపాలు వెలిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతివ్వడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రబలగాలు రంగంలోకి దిగాయి. సిఆర్పిఎఫ్ సిబ్బంది కొండపై భద్రతను చేపట్టారు. ఆలయం.. దర్గా పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
దీప స్థంభం వద్ద తాత్కాలిక వేదిక ఏర్పాటు చేశారు. మెట్లు కూడా నిర్మించారు. ఆలయ పూజారులు.. సుప్రీంకోర్టు నియమించిన రిసీవర్లు దీపం వెలిగించే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం ఐదు గంటలకు దీపం వెలిగించే కార్యక్రమం మొదలైంది. గతంలో కోర్టు ఆదేశాలను అమలు చేయలేకపోవడంతో తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. డిజిపి.. ఇతర అధికారులకు సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఆలయ ట్రస్ట్ బోర్డుని కూడా తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఇద్దరు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులను రిసీవర్లుగా నియమించింది.
ఇక ఇదే కొండమీద ఉన్న సికిందర్ బాద్షా దర్గా వద్దకు వచ్చే ముస్లిం భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దర్గా చుట్టూ 50 మీటర్ల పరిధిని దృష్టిలో ఉంచుకొని దీపాల ఏర్పాట్లు చేయాలని సూచించింది. దీపం వెలిగించే కార్యక్రమానికి ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరిగాయి. సిఆర్పిఎఫ్ భద్రత కొనసాగుతూనే ఉంది.
ఇక్కడ దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ తమిళనాడు ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో విజయ్ వ్యవహరిస్తున్న తీరు పట్ల తమిళనాడులో హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బిజెపి నాయకులు ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు.. ఒక వర్గాలకు అండగా నిలుస్తున్న విధానం మీద తీవ్రస్థాయిలో మండిపడింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దీపం వెలిగించడానికి కొండపైకి ప్రత్యేకంగా ఒత్తులు.. నూనె.. ఇతర పూజ సామాగ్రిని తీసుకెళ్లారు. ప్రస్తుతం అక్కడ వాతావరణం సందడిగా మారింది. భక్తులు కూడా భారీగా రావడంతో పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
కొండమీద దీప స్తంభం మీద దీపాన్ని వెలిగించడంతో విజయ్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని అక్కడి బిజెపి నాయకులు చెబుతున్నారు. ప్రభుత్వం ముందుగానే సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసి ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదని వారు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ హిందువుల మనోభావాలతో ఆడుకుంటే పరిస్థితి ఇలానే ఉంటుందని విజయ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి బిజెపి నాయకులు విమర్శిస్తున్నారు.
#BREKING | திருப்பரங்குன்றம் மலைமேல் உள்ள தீபத்தூணில் தீபம் ஏற்றப்பட்டது
#Thiruparankundram #ThiruparankundramDeepam #Tirupparankundram #Deepam
— Impaqt (@impaqtoff) November 28, 2026