spot_img
Homeఅత్యంత ప్రజాదరణజగన్ సర్కారు ప్లాన్ బీ.. ఈసారి నిమ్మగడ్డ పని అయిపోయినట్లే..?

జగన్ సర్కారు ప్లాన్ బీ.. ఈసారి నిమ్మగడ్డ పని అయిపోయినట్లే..?

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారశైలిపై వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. తన పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారని.. రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న గవర్నర్ ను కూడా శాసించేస్థాయిలో నిమ్మగడ్డ తీరు ఉందని అసహనం వ్యక్తం చేస్తున్నారు ఏపీ మంత్రులు. ఏపీ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ నిమ్మగడ్డ దూకుడు పెంచారు. ఎన్నికల సందర్భంగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు.. ఏపీ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులను టార్గెట్ చేస్తూ.. నిమ్మగడ్డ అటు ప్రభుత్వానికి.. ఇటు గవర్నరుకు ఫిర్యాదుల పరంపర కొనసాగిస్తున్నారు. హైకోర్టును సైతం ఆశ్రయించారు. ఇందుకు కౌంటర్ గా ప్లాన్ బీ అమలుకు సిద్ధమైంది జగన్ సర్కారు.. ఇందుకోసం ఇప్పటికే మంత్రులు రంగంలోకి దింపారు.

ఇటీవల మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై చేసిన ఫిర్యాదును ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ గా తీసుకున్నారు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలు శాసన సభా కార్యాలయంలో ఎన్నికల కమిషనర్ తన పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారని.. తమపై అనవసరపు వ్యాఖ్యలు చేశారని.. ఎస్ఈసీ రమేశ్ కుమార్ కు సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. ఆయన వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉందని ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇక వీరిద్దరి ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్నారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఫిర్యాదును పూర్తిస్థాయిలో పరిశీలించిన తరువాత, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ఈ మేరకు నిమ్మగడ్డపై చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేశారు తమ్మినేని. స్పీకర్ ఆదేశాల మేరకు.. ప్రివిలేజ్ కమిటీ రాష్ర్ట ఎన్నికల కమిషనర్ పై విచారణ చేపట్టనునుంది. ప్రివిలేజ్ కమిటీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై ఏవిధమైన చర్యలు తీసుకుంటుందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సైతం మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డిపై గవర్నర్ కు రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు. తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని అంటూ.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో మంత్రులు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేశారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తమపై నిందారోపణలు మోపారని, అవి తమను తీవ్ర ఆవేదనకు గురి చేశాయని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. మరి ఈ వ్యవహారంలో ముందు.. ముందు.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్న చర్చ ప్రస్తుతం ఏపీలో జోరుగా సాగుతోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Ram Gopal Varma

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...
YSRCP

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Nagarjuna

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...
Music Directors

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...
Y S Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...
Oktelugu Epaper