Chandrababu: వైసిపి( YSR Congress ) హయాంలో చాలామంది అధికారులు ప్రాధాన్యత లేకుండా పోయారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనలో కీలకంగా ఉంటారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆపై డీజీపీ. అయితే ఆ రెండు అధికార కేంద్రాలను తన ఇష్టారాజ్యంగా వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి. సీనియర్ అధికారులను ఆ స్థానాల్లో నియమించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన చెప్పు చేతల్లో ఉన్న అధికారులను నియమించుకున్నారు. రాష్ట్ర డిజిపిగా వ్యవహరించిన రాజేంద్రనాథ్ రెడ్డి ని తీసుకుందాం. సీనియారిటీలో ఎక్కడో పదో స్థానంలో ఉన్న ఆయనను తెచ్చి.. ఇంచార్జ్ పేరుతో పూర్తిస్థాయిలో డీజీపీగా వాడుకున్నారు. డిజిపి కి అర్హుడుగా ఉన్న వైవి వెంకటేశ్వరరావును అసలు పోస్టింగ్ లేకుండా చేశారు. అయితే చంద్రబాబు అలా ఆలోచించలేదు. వైసిపి హయాంలో మితిమీరి వ్యవహరించిన అధికారులను మాత్రమే పక్కన పెట్టారు. ద్వారకానాథ్, నీలం సాహిని వంటి వారి సేవలను ఇప్పటికి వినియోగించుకుంటున్నారు.
* అప్పట్లో రచ్చ..
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్( Ramesh Kumar ) ఉండేవారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో తన ఆదేశాలు పట్టించుకోలేదని జగన్మోహన్ రెడ్డి ఆయనపై కక్ష కట్టారు. ఉన్నఫలంగా ఆయనను ఆ పదవి నుంచి తొలగించారు. దొడ్డిదారిన పక్క రాష్ట్రానికి చెందిన ఓ మాజీ న్యాయమూర్తిని తెచ్చి ఆ పదవిలో కూర్చోబెట్టారు. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి తన స్థానాన్ని పొందారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించగలిగారు. తరువాత జగన్మోహన్ రెడ్డి ఆ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నీలం సాహనిని నియమించారు.
*ఆమె ప్రతిపాదనకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..
చంద్రబాబు ఇప్పుడు అదే నీలం సాహనీ( Neelam Sahani) హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. సాధారణంగా ఎన్నికల కమిషనర్ విధుల్లో ఉండేవారు తమ హయాంలో ఒక్క ఎన్నికైన జరగాలని భావిస్తారు. అలాగే నీలం సాహనీ కూడా అదే మాదిరిగా అనుకుంటున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఆమె పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఇంతలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆమె నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పించారు. అయితే జగన్ హయాంలో నియమించిన అధికారితో ఎన్నికలు ఎలా అని చంద్రబాబు ఆలోచన చేయలేదు. హుందాతనంగా ఆమె వినతికి అంగీకారం తెలిపారు. దీంతో ఆమె మార్చిలోగా పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు.
* తప్పిన అంచనా..
అయితే తమ హయాంలో నియమితురాలు కావడంతో నీలం సహని తమకు ప్రాధాన్యం ఇస్తారని జగన్మోహన్ రెడ్డి భావించారు. పులివెందుల ఉప ఎన్నికల్లో సహకరిస్తారని అంచనా వేసుకున్నారు. కానీ ఆమె పెద్దగా స్పందించలేదు. పరాజయంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది. ఇటువంటి సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాగైనా బహిష్కరించాలని కారణాలను అన్వేషిస్తుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అంతకుమించి తాను నియమించిన అధికారిపై నిందలు వేస్తే అది తనకే తగులుతుందని జగన్మోహన్ రెడ్డికి తెలుసు.