ఏపీలో మొన్నటివరకు దేవాలయాలపై దాడులు.. విగ్రహాల విధ్వంసం ఎంతలా చర్చనీయాంశం అయిందో అందరికీ తెలిసిందే. అయితే.. దాడుల్లో ఎవరెవరి ప్రమేయం ఉందో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ.. అసలు నిందితులెవరనేది వెలుగులోకి వస్తోంది. రాజకీయ కారణాలతోనే విగ్రహాల విధ్వంసకాండ సాగిందనేది తేలిపోయింది. అవన్నీ- తమ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి రాజకీయ ప్రత్యర్థులు కృత్రిమంగా సృష్టించారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదివరకు చేసిన ఆరోపణలన్నీ వాస్తవ రూపాన్ని దాల్చుతున్నట్లు కనిపిస్తోంది.
Also Read: మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే.. హోంమంత్రిని నేనే.. అప్పుడు చూసుకుంట మీ సంగతి పోలీసులపై అచ్చెన్నాయుడి ఫైర్
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సంకటహర వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వరుడి విగ్రహాన్ని సాక్షాత్తూ ఆ ఆలయ పూజారే ధ్వంసం చేశారనే వాస్తవం.. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఆలయ పూజారి వెంకట మురళీకృష్ణ తన నేరాన్ని కూడా అంగీకరించారని పోలీసులు స్పష్టం చేశారు. రాజమహేంద్రవరానికే చెందిన ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనకు 30 వేల రూపాయలు ఇచ్చి.. మరీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేయించినట్లు సిట్ వెల్లడించింది.
Also Read: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి
ఈ మేరకు టీడీపీ నేతలు మల్ల వెంకటరాజు, దంతులూరి వెంకటపతి రాజును అరెస్ట్ చేశారు. మరింత లోతుగా దర్యాప్తు సాగాల్సి ఉందంటూ సిట్ చేసిన ప్రకటన స్థానికంగా కలకలం రేపుతోంది. విగ్రహాల విధ్వంసం ఘటనలో తెలుగుదేశం పార్టీ నేతల ప్రమేయం ఉన్నట్లు తేలినప్పటికీ.. బీజేపీ-జనసేన కూటమి నేతలు మౌనం దాల్చడం వెనుక అనుమానాలు వ్యక్తమవున్నాయి. బీజేపీ–-జనసేన కూటమి నేతలు.. తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షంగా ఉంటున్నాయనే ఆరోపణలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఆయా పార్టీల మధ్య ఫెవికాల్ బంధం ఉందంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
రాష్ట్రంలో విగ్రహాల విధ్వంసం ఘటనల్లో టీడీపీ ప్రమేయం ఉందంటూ వైసీపీ నేతలు మొదటి నుంచీ మొత్తుకుంటున్నారు. తమ వాదనలు, ఆరోపణలు నిజం అయ్యాయని ఇప్పుడు వైసీపీ నేతలు చెబుతున్నారు. దొంగే పోలీసును దొంగ అన్నట్లుంది చంద్రబాబు వ్యవహారమంటూ వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.. దేవుడి విగ్రహం ధ్వంసం చేసిన నిందితులకు టీడీపీ నేతలు 30 వేలు చెల్లించినట్లు విచారణలో బయటపడిందని.. దేవాలయాల విధ్వంసం వెనుక టీడీపీ కుట్ర క్రమంగా బట్టబయలు అవుతోందని అన్నారు. కుట్ర బయటపడడంతో ఇప్పుడు పచ్చ గ్యాంగ్ అంతా సైలెంట్ అయిందంటూ సెటైర్లు విసురుతున్నారు.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Bjp jansena silent on temple attacks in ap
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com