
Prithvi Shaw : యువ క్రికెటర్ పృథ్వీ షా వివాదంలో ఇరుక్కున్నాడు. యూట్యూబర్ నటి సప్నా గిల్ తన ప్రైవేటు భాగాలపై చేతులు వేశాడని ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. అతడిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. దీంతో తన మర్యాదకు భంగం కలిగించాడని ఆమె ముంబయి పోలీసులను ఆశ్రయించడం వివాదాస్పదంగా అయింది. గత వారం తన స్నేహితులపై కొందరు దాడి చేస్తున్న సమయంలో తన స్నేహితుడిని కాపాడేందుకు ప్రయత్నించే సందర్భంలో షా తన భాగాలపై చేతులు వేశాడని ఫిర్యాదులో పేర్కొంది.
ఇద్దరు పరస్పరం దాడుల గురించి ఫిర్యాదుల వరకు వెళ్లడంతో ఇప్పుడు ఈ వివాదం ఎటు వైపు వెళ్తుందో తెలియడం లేదు. పృథ్వీ దురుసుగా ప్రవర్తించాడని ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనలో సప్నా గిల్ తోపాటు 8 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె కోర్టులో హాజరవగా మూడు రోజుల కస్టడీకి పంపారు. సోమవారం కస్టడీ ముగియడంతో ఆమెకు బెయిల్ మంజూరైంది. బయటకు వచ్చిన ఆమె అంధేరి పోలీస్ స్టేషన్ లో షా తన స్నేహితులతో కనిపించాడు.
అప్పటికే పృధ్వీ మద్యం మత్తులో ఉండగా సప్నా గిల్ స్నేహితుడు సెల్ఫీ దిగేందుకు వెళ్లాడు. మత్తులో ఉన్న అతడు తన స్నేహితుడిపై దాడికి పాల్పడటంతో తాను మధ్యలోకి వెళ్లాల్సి వచ్చింది. కానీ షా తనపై కూడా దాడికి పాల్పడటంతో తనకు సైతం గాయాలయ్యాయని తన ఫిర్యాదులో పేర్కొంది. అతడి స్నేహితులను ఎంత వేడుకున్నా వినలేదు. కర్కశంగా వ్యవహరించారు. మద్యం మత్తులో దాడికి తెగబడటంతో అవాక్కయ్యాం. ఒక సెలబ్రిటీ ఇలా ప్రవర్తిస్తాడని అనుకోలేదు. యువ క్రికెటర్ కావడంతో అందరు సెల్ఫీ తీయించుకోవడానికి ఇష్టపడటం సహజమే.
అంత మాత్రాన ఇలా దాడికి పాల్పడటం ఆశ్చర్యపరచింది. దీనిపై పోలీసులు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. పృథ్వీ షా కూడా నోరు విప్పలేదు. క్రికెటర్లపై ఆరోపణలు రావడం కామనే. కానీ ఇప్పుడు పృథ్వీ షా వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో తెలియడం లేదు. సప్నా గిల్ పృథ్వీ షా మధ్య రగులుతున్న వివాదంలో ఇంకా ఏం జరుగుతుందోననేది తెలియడం లేదు. మొత్తానికి రెండు పార్టీలు మాత్రం ఒకరిపై మరొకరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పృథ్వీ షా ప్రస్తుతం కొత్త సమస్యల్లో చిక్కుకోవడం గమనార్హం.