Prithvi Shaw : విమర్శకుల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే పృథ్వీ షా ఆటతీరు కొనసాగుతోంది. ఒకప్పుడు “తర్వాతి సచిన్” పేరుపొందిన అతడు.. ఇప్పుడు “ఒంట్లో అధికంగా కొవ్వు ఉన్న క్రికెటర్ గా” దిగజారి పోయాడు. ఒక పట్లగా ఆడటం లేదు. బ్యాటింగ్ పై గ్రిప్ కోల్పోయాడు. శరీరంపై పట్టును వదిలిపెట్టాడు. మైదానంలో ఏమాత్రం చురుకుగా లేడు. అసలు ఆడటమనేది ఇష్టం లేదన్నట్టుగా అతని వ్యవహార శైలి సాగుతోంది. గతంలో ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ తో గొడవ పడటం.. అడ్డు అదుపు లేకుండా తినడం.. ఇతర కార్యకలాపాలకు పాల్పడటంతో అతడు జాతీయ జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. చివరికి ముంబై జట్టు రంజీలోనూ అతడిని దూరం పెట్టింది. “సీనియర్ ఆటగాళ్లు అతడికి చాలా చెప్పి చూశారు. చివరికి సచిన్ కూడా ఆటకంటే క్రమశిక్షణ ముఖ్యమని అన్నాడు. రంజి క్రికెట్లో ముంబై జట్టు అనేక అవకాశాలు ఇచ్చింది. అయినప్పటికీ అతడు వాటిని ఉపయోగించుకోలేదు. ఎవరికి ఐపీఎల్లో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. ఇలాంటప్పుడు అతడు తనను పునరావిష్కరించుకోవాలి. గొప్ప ఆట తీరు ప్రదర్శించాలి. లేకపోతే కష్టమే” అని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వారికి తగ్గట్టుగానే పృథ్వీ షా ఆటతీరు కొనసాగుతోంది.
డక్ ఔట్ అయ్యాడు
ప్రస్తుతం దేశవాళీలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కొనసాగుతోంది. మంగళవారం సర్వీసెస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై తరఫున ఆడిన పృథ్వీ షా దారుణంగా అవుట్ అయ్యాడు. కుడిచేతి వాటం గల ఈ ఆటగాడు సర్వీసెస్ బౌలర్ పీఎస్ పునియా చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కేవలం 3 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అతడు 0 పరుగులకు మైదానాన్ని వీడాడు. కొంతకాలంగా శరీర సామర్థ్య సమస్యలతో అతడు బాధపడుతున్నాడు. దీంతో ముంబై జట్టు అతడిని రంజీ స్క్వాడ్ నుంచి తొలగించింది. క్రమశిక్షణ లేకపోవడం.. శరీరంపై పట్టు కోల్పోవడం.. తరచూ వివాదాలలో ఉండడం వంటివి అతడి పతనానికి కారణమయ్యాయి. ప్రతిభావంతమైన ఆటగాడు కాస్త అమ్ముడు పోని ప్లేయర్ గా మిగిలిపోయాడు. ” అతడు తర్వాతి సచిన్ అనుకున్నాం. కానీ ఎందుకనో అతడు వెనుకబడుతున్నాడు. సరిగా ఆడలేక పోతున్నాడు. ఆటపై లగ్నం చేయలేకపోతున్నాడు. జాతీయ జట్టులో మూడు ఫార్మాట్ల లో సత్తా చాటడం లేదు. చివరికి ముంబై రంజీ జట్టు లో తన స్థానాన్ని కోల్పోయాడు. కేవలం పాతిక సంవత్సరాలు మాత్రమే. అతడికి ఇంకా ఆడే వయసు ఉంది. అద్భుతమైన సామర్థ్యం ఉంది. అయినప్పటికీ అతడు వాటిని ఉపయోగించుకోలేకపోతున్నాడు. నిరాశ జనకమైన ఆట తీరు ప్రదర్శిస్తూ విమర్శల పాలవుతున్నాడని” పృథ్వీ షా చిన్ననాటి కోచ్ సంతోష్ పింగుట్కర్ వాపోయాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సున్నా పరుగులకు అవుట్ అవ్వడం ద్వారా సోషల్ మీడియాలో పృథ్వీ షా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. “ఐపీఎల్ లో అన్ సోల్డ్.. సయ్యద్ ముస్తాక్ ట్రోఫీలో సున్నా.. ఏమయ్యా పృథ్వీ షా.. నీకు కొంచెం కూడా ఏమనిపించడం లేదా?” అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Prithvi shaw is facing severe criticism on social media after being dismissed for zero runs in the syed mushtaq ali trophy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com