Prithvi Shaw : పృథ్వీ షా.. స్కూల్ దశలోనే బ్యాట్ తో రఫ్ ఆడించాడు. రంజీలో మెరుపులు మెరూపించాడు. టీమిండియాలోనూ అదరగొట్టాడు. మరో సచిన్ అవుతాడని అందరూ అనుకున్నారు. టీమిండియా కు బ్యాక్ బోన్ గా నిలబడతాడని భావించారు. కానీ అతడేమో క్రమశిక్షణ లోపించి.. శరీరంపై పట్టును కోల్పోయి లావుగా మారాడు. పరుగులు తీయడానికి కష్టపడ్డాడు. చివరికి టీమిండియాలో చోటు కోల్పోయాడు. ఐపీఎల్ లో స్థానాన్ని కోల్పోయాడు. రంజీలలో రిజర్వ్ బెంచ్ స్థానాన్ని కూడా నష్టపోయాడు. మొత్తంగా అనామక ఆటగాడనే ముద్రపడ్డాడు.
అవమానాలు.. అవహేళనలు.. రకరకాల ఆరోపణలు.. ఇన్నింటి మధ్య పృథ్వీ షా ఫిట్ గా మారాడు. శరీర సామర్థ్యాన్ని పెంచుకున్నాడు.. అతడు ఇప్పుడు డి వై పాటిల్ టి20 టోర్నీలో ఆడుతున్నాడు. రెండు మ్యాచ్లలో 128 పరుగులు చేసి, తన బ్యాట్ పదునును నిరూపించుకున్నాడు. ఇదే ఊపుతో ఐపీఎల్ 2025లో అవకాశం కోసం తపిస్తున్నాడు. పృథ్వీ షా మంచి ఆటగాడే అయినప్పటికీ.. శరీర సామర్థ్యం సరిగా లేకపోవడంతో రంజీ ట్రోఫీకి దూరంగా ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీకి కూడా దూరమయ్యాడు. కానీ అతడు ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చాడు. తన బ్యాట్ పదునును మరోసారి నిరూపించుకున్నాడు. ఇప్పుడు అతడు డివై పాటిల్ టి20 లీగ్ లో ఆడుతున్నాడు. రెండు మ్యాచ్లలో అర్థ సెంచరీలు చేశాడు. పృథ్వీ షా రూట్ మొబైల్ జట్టు తరఫున ఆడుతున్నాడు. అతడు రెండు మ్యాచ్లలో 128 రన్స్ చేశాడు. అతడి స్ట్రైక్ రేటు 200 కంటే ఎక్కువగా ఉండటం విశేషం. ఇక ఇప్పటివరకు ఈ టోర్నీలో రెండు సిక్సర్లు, 25 ఫోర్లు దంచి కొట్టాడు.
Also Read : సచిన్ అంతటివాడవుతాడన్నారు.. అతడేమో కొండలా మారిపోయాడు.. ఇప్పుడేమో దానిని కరిగించే పనిలోపడ్డాడు
వీరబాదుడు
పృథ్వీ షా డివై పాటిల్ టి20 లీగ్ లో తొలిసారిగా ఆడుతున్నాడు. టాటా జట్టుతో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. పృథ్వీ షా ఆడుతున్న జట్టు 208 పరుగుల భారీ టార్గెట్ ను చేజ్ చేసింది.పృథ్వీ షా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 36 బంతుల్లో 63 రన్స్ చేశాడు. ఇందులో ఏకంగా 12 ఫోర్లు కొట్టాడు..పృథ్వీ షా మాత్రమే కాకుండా అధర్వ కాలే 94 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. అతడు 14 ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టాడు. టెక్ స్పోర్ట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లోనూ పృథ్వీ షా అదరగొట్టాడు. 25 బంతుల్లో 65 పరుగులు చేసి అజయంగా నిలిచాడు..పృథ్వీ షా 13 ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టాడు. అతడి స్ట్రైక్ రేట్ 260 కంటే ఎక్కువగా ఉంది. 27 నిమిషాల పాటు మాత్రమే బ్యాటింగ్ చేసినప్పటికీ 64 పరుగులు అతడు కేవలం ఫోర్ల ద్వారానే సాధించాడు. మొత్తంగా చూస్తే పృథ్వీ షా తన మాస్ రూపాన్ని చూపిస్తున్నాడని అర్థమవుతూనే ఉంది. ఇటీవల కాలంలో అతడు చాలావరకు బరువు తగ్గాడు. గతంలో భారీగా బరువు ఉండేవాడు. క్రమశిక్షణ కూడా అంతగా ఉండేది కాదు. దీంతో సీనియర్ ఆటగాళ్లు అతడి పై పరీక్షంగా విమర్శలు చేశారు. సచిన్, ద్రావిడ్ లాంటి ఆటగాళ్లు అతడికి చురకలు అంటించారు. ఇక ఐపీఎల్ 2025లో షా కు స్థానం లభించలేదు. అయితే టోర్నీలో అతడికి ప్రత్యామ్నాయంగా అవకాశం అయితే లభించవచ్చు.. ఈ టోర్నీలో పృథ్వీ ఇదే స్థాయిలో నిలకడగా ఆడితే మాత్రం అవకాశాలు లభించవచ్చని స్పోర్ట్స్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.