Prithvi Shaw: టీ20 ముంబయి లీగ్ 2025 లో భాగంగా నార్త్ ముంబయి పాంథర్స్ తరుఫున బరిలోకి దిగిన వృథ్వీ షా బ్యాంటింగ్ లో రాణించాడు. కేవలం 34 బంతుల్లో 75 పరుగులు సాధించాడు. తన అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతతో సూర్యకుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ట్రయంఫ్ నైట్స్ ముంబయి నార్త్ ఈస్ట్ పై తమ జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో వీరి టీమ్ 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టుకు నిర్దేశించింది. ఛేదనలో ట్రయంఫ్ నైట్స్ ముంబాయి నార్త్ ఈస్ట్ చేతులెత్తేసింది. 19.5 ఓవర్ల లో 169 పరుగులకే ఆలౌటైంది.