Homeలైఫ్ స్టైల్Weight Loss Tips: ఈ మూడు కలిపి తాగితే బరువు మాయం..!

Weight Loss Tips: ఈ మూడు కలిపి తాగితే బరువు మాయం..!

Weight Loss Tips: ప్రస్తుత కాలంలో రకరకాల ఆహార పదార్థాలను తినాల్సి వస్తుంది. ముఖ్యంగా చాలామంది ఇంట్లో వండిన ఆహారం కంటే బయట దొరికే స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఇలాంటివారు జీర్ణ సమస్యలను ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే.. ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో కషాయం చేసుకొని తాగుతూ ఉండాలి. దీనివల్ల కడుపు క్లీన్ అయ్యి సౌకర్యవంతంగా ఉంటుంది. మరి ఇంట్లో దొరికే ఆ కషాయం ఏంటో ఇప్పుడు చూద్దాం.. సాధారణంగా […]

Weight Loss Tips: ప్రస్తుత కాలంలో రకరకాల ఆహార పదార్థాలను తినాల్సి వస్తుంది. ముఖ్యంగా చాలామంది ఇంట్లో వండిన ఆహారం కంటే బయట దొరికే స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఇలాంటివారు జీర్ణ సమస్యలను ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే.. ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో కషాయం చేసుకొని తాగుతూ ఉండాలి. దీనివల్ల కడుపు క్లీన్ అయ్యి సౌకర్యవంతంగా ఉంటుంది. మరి ఇంట్లో దొరికే ఆ కషాయం ఏంటో ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా మనం వండే కూరల్లో జీలకర్ర వేస్తుంటాం. ఇది పైకి కనిపించకపోయినా ఇది ఎక్కువగా ఉపయోగించిన ఆహారం తినడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అయితే ఈ జీలకర్రతో పాటు వాము, సోంపు కలిపి వేడి నీటిలో మరగపెట్టి తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యలు లేకుండా పోతాయి. ఉదయాన్నే రకరకాల ఆహార పదార్థాలు తిన్నవారు కడుపులో అసౌకర్యంగా ఉంటే కూడా దీనిని తీసుకోవచ్చు.

కేవలం జీర్ణ సమస్యలు మాత్రమే కాకుండా బరువు నియంత్రణ కోసం కూడా ఈ పానీయాన్ని తీసుకోవచ్చు. ప్రస్తుత కాలంలో చాలామంది బరువుతో ఇబ్బంది పడుతున్నారు. బరువు తగ్గడానికి అనేక వ్యాయామాలు చేస్తున్నారు. అయితే ఉదయాన్నే ఈ మూడు కలిపిన నీటిని ప్రతిరోజు ఉదయం కొన్ని రోజులపాటు తాగడం వల్ల కడుపులో ఉండే కొవ్వు దాదాపు కరిగిపోయే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

ఇవే కాకుండా షుగర్ అదుపులో ఉండడానికి కూడా ఈ కషాయం తాగితే సరైన ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. అయితే వీరు వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. అంతేకాకుండా ఎక్కువగా ఉష్ణోగ్రత కలిగిన వారు సైతం వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మసాలా దినుసుల్లో భాగమే జీలకర్ర ను ఉపయోగిస్తారు. అందువల్ల ఈ కషాయం తాగడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంటుంది.

అంతేకాకుండా ప్రతిరోజు ఉదయం దీనిని తీసుకోవడం వల్ల రోజంతా ఎలాంటి ఆహారం తీసుకున్న కూడా జీర్ణ క్రియ సక్రమంగా ఉండే అవకాశం ఉంటుంది. వీటితోపాటు వ్యాయామం చేయడం వల్ల తొందర్లోనే బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper