Homeహెల్త్‌Morning Healthy Habits: ఈ చిన్న పనులు చేస్తే రోజంతా ఉత్సాహంగా.. ఆరోగ్యంగా ఉంటారు.. అవేంటంటే..

Morning Healthy Habits: ఈ చిన్న పనులు చేస్తే రోజంతా ఉత్సాహంగా.. ఆరోగ్యంగా ఉంటారు.. అవేంటంటే..

Morning Healthy Habits: ప్రతిరోజూ ఉదయం మనం ఎలా ప్రారంభిస్తామన్నదే ఆ రోజు మొత్తం మన శారీరక, మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. అందుకే రోజంతా ఉత్సాహంగా, పాజిటివ్‌గా ఉండాలంటే నిద్ర లేవగానే కొన్ని మంచి అలవాట్లను పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ చిన్నచిన్న మార్పులు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా పనితీరును కూడా పెంచుతాయి. మరి ఆ అలవాట్లు ఏంటో చూద్దామా.. గోరువెచ్చటి నీరు: ఉదయం నిద్రలేవగానే ఒకటి లేదా రెండు గ్లాసుల గోరువెచ్చటి నీటిని తాగడం […]

Morning Healthy Habits: ప్రతిరోజూ ఉదయం మనం ఎలా ప్రారంభిస్తామన్నదే ఆ రోజు మొత్తం మన శారీరక, మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. అందుకే రోజంతా ఉత్సాహంగా, పాజిటివ్‌గా ఉండాలంటే నిద్ర లేవగానే కొన్ని మంచి అలవాట్లను పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ చిన్నచిన్న మార్పులు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా పనితీరును కూడా పెంచుతాయి. మరి ఆ అలవాట్లు ఏంటో చూద్దామా..

గోరువెచ్చటి నీరు:
ఉదయం నిద్రలేవగానే ఒకటి లేదా రెండు గ్లాసుల గోరువెచ్చటి నీటిని తాగడం చాలా మంచిది. రాత్రంతా విశ్రాంతి తీసుకున్న శరీరానికి ఇది హైడ్రేషన్ అందిస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరచి, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి ఈ అలవాటు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

డీప్ బ్రీతింగ్:
ఉదయం కేవలం ఐదు నిమిషాల పాటు డీప్ బ్రీతింగ్ లేదా ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించి, ఆందోళనలను దూరం చేస్తుంది. మెదడుకు తగినంత ఆక్సిజన్ అందడంతో ఏకాగ్రత పెరుగుతుంది. దీంతో రోజంతా తీసుకునే నిర్ణయాలు మరింత స్పష్టంగా ఉండటంతో పాటు పనుల్లో ఫోకస్ కూడా మెరుగవుతుంది.

రోజువారీ పనులకు ప్లాన్:
ఉదయం కొన్ని నిమిషాలు కేటాయించి ఆ రోజు చేయాల్సిన ముఖ్యమైన పనులను ఒక నోట్‌బుక్‌లో లేదా మొబైల్‌లో రాసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల ఏ పనిని ఎప్పుడు చేయాలనే స్పష్టత వస్తుంది. టైమ్ మేనేజ్మెంట్ మెరుగుపడి పనులను సమయానికి పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా అనవసర ఒత్తిడి కూడా తగ్గుతుంది.

30 నిమిషాలు వ్యాయామం:
ఉదయం వ్యాయామం చేయడం శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వాకింగ్, జాగింగ్, యోగా లేదా ఇతర వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే శక్తి స్థాయిలు పెరిగి రోజంతా చురుకుగా ఉండేందుకు సహాయపడుతుంది. వ్యాయామం సమయంలో విడుదలయ్యే హ్యాపీ హార్మోన్లు మనసును ఉల్లాసంగా ఉంచుతాయి.

మొబైల్‌కు దూరంగా..:
చాలామంది ఉదయం లేవగానే మొబైల్ ఫోన్ చెక్ చేయడం అలవాటుగా మార్చుకున్నారు. అయితే ఇది ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఉదయం మొదటి 30 నిమిషాలు ఫోన్‌కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన అలవాట్లపై దృష్టి పెట్టడం మంచిది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper