Homeలైఫ్ స్టైల్Good Heart: గుండె మేలు కోసం మీ చిన్న పనులు చేయండి చాలు..

Good Heart: గుండె మేలు కోసం మీ చిన్న పనులు చేయండి చాలు..

Good Heart: మానవ శరీరంలో అతి ముఖ్యమైన భాగం గుండె. గుండె లేకపోతే అసలు మనిషి లేడు. అయితే నేటి కాలంలో రకరకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల.. శారీరక శ్రమ లేకపోవడం వల్ల గుండె సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్, హార్డ్ స్ట్రోక్ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి సమయంలో గుండెను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకోసం ప్రత్యేకంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మనం చేసే అలవాట్లలో […]

Good Heart: మానవ శరీరంలో అతి ముఖ్యమైన భాగం గుండె. గుండె లేకపోతే అసలు మనిషి లేడు. అయితే నేటి కాలంలో రకరకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల.. శారీరక శ్రమ లేకపోవడం వల్ల గుండె సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్, హార్డ్ స్ట్రోక్ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి సమయంలో గుండెను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకోసం ప్రత్యేకంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మనం చేసే అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకొని గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఉదయం లేవగానే చేసే ఈ పనుల వల్ల గుండె ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. అసలు ఏం చేయాలంటే?

ఉదయం లేవగానే చాలామంది వెంటనే టీ లేదా కాఫీ తాగుతూ ఉంటారు. కానీ అంతకుముందు దాదాపు 6 గంటల పాటు శరీరం నీరు తీసుకోకుండా ఉంటుంది. అంటే ఈ సమయంలో డిహైడ్రేషన్కు గురయ్యే వ్యవస్థలో ఉంటుంది. ఇలాంటి సమయంలో టి, కాఫీ కాకుండా గోరువెచ్చని నీరు తాగడం వల్ల ఎంతో మేలు. బోర్ వెచ్చని నీరు తాగడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. రక్తం చిక్కగా మారకుండా ఉంటుంది. అలాగే టాక్సిన్స్ బయటకు వెళ్లి మెటపాలిజం యాక్టివ్ అవుతుంది. అయితే గోరువెచ్చని నీటిలో కాస్త తేనె కలిపి తాగడం వల్ల మరింతగా ప్రయోజనాలు ఉన్నాయి.

ఈ రోజుల్లో బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా మారిపోయింది. అయితే ఉదయాన్నే కొందరు ప్రాసెస్ లేదా ఆయిల్ ఫుడ్ తో కడుపు నింపుకునే వారు ఉన్నారు. అలాకాకుండా చక్కెర తక్కువగా ఉండే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల గుండెకు మేలు జరుగుతుంది. ముఖ్యంగా అధిక ప్రోటీన్ ఉన్న బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఉడికించిన కోడిగుడ్లు, పప్పులు, పెరుగు, ఓట్స్ లాంటివి తీసుకోవడం వల్ల గుండెకు ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇవి కొలెస్ట్రాల్ను కంట్రోల్లో ఉండేలా చేస్తాయి.

ఆహార పదార్థాలు తీసుకోవడం మాత్రమే కాకుండా కొన్ని రకాల చిన్నపాటి వ్యాయామం చేయాలి. వీటిలో ధ్యానం ఒకటి. కొందరు ధ్యానం అనగానే భయపడిపోతుంటారు. ఎందుకంటే గంటలకొద్దీ ఒకే చోట కూర్చోవడం మావల్ల కాదు అని అంటారు. కానీ కేవలం ఐదు నిమిషాలు శ్వాసపై దృష్టి పెట్టడం వల్ల కార్డిసోల్ తగ్గుతుంది. దీనివల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. అలాగే కొద్దిసేపు ఎండలు నడవడం వల్ల విటమిన్ డి వచ్చి గుండెకు మేలు జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మొబైల్ లేకుండా ఎవరు ఉండలేకపోతున్నారు. కానీ మొబైల్ ను ఎంత దూరం పెడితే అంతా గుండెకు మేలు జరుగుతుంది. మొబైల్లో ఎక్కువసేపు సోషల్ మీడియా చూడడం వల్ల మెదడు భావోద్వేగాలకు ఎక్కువగా గురై హార్ట్ రేట్ పెంచుతాయి.

ఇవే కాకుండా ప్రతిరోజు కామన్ ఎక్సర్సైజ్ చేసేందుకు ప్రయత్నించాలి. ప్రతిరోజు ఉదయం కనీసం గంట పాటు ఎక్సర్సైజ్ చేయడం వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper