Heart Disease: ఒకప్పుడు వయసు పైబడిన వారికి వచ్చే రోగాలు నేటి కాలంలో చిన్నపిల్లల్లోని వస్తున్నాయి. అందుకు కారణం వాతావరణం లోని మార్పులు.. నాణ్యతలేని ఆహారం తీసుకోవడం వల్లనే అని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లోనే గుండె జబ్బులు రావడం ఈమధ్య ఎక్కువగా చూస్తున్నాం. అయితే వారి పరిస్థితులు వేరు. కానీ భవిష్యత్తులో గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలంటే యవ్వనంలో ఉన్నప్పుడే కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని పనులు చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఆస్కారం ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే గుండెకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
ప్రస్తుత కాలంలో చాలామంది వ్యాయామం చేస్తున్నారు. కానీ సాధారణ వ్యాయామం కాకుండా ప్రణాళిక ద్వారా చేయడం వల్ల గుండెకు ఆరోగ్యం అందుతుంది. అంటే ప్రతిరోజు కనీసం 40 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. ఆ తర్వాత యోగ లేదా వ్యాయామం చేయాలి. కొందరికి ప్రతిరోజు వీలు కాకపోతే కనీసం నాలుగు నుంచి ఐదు రోజుల వరకు అయినా ఈ ప్రణాళిక ప్రకారంగా చేయాలి. ఇలా చేస్తే రక్త ప్రసరణ మెరుగ్గా ఉండి గుండెకు రక్త పంపిణీ సక్రమంగా జరుగుతుంది. దీంతో రక్తనాళాల్లో ఎటువంటి కొవ్వు లేకుండా ఉంటాయి.
విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఏదోరకంగా ఒత్తిడితో ఉంటున్నారు. అయితే ఒత్తిడితో ఉండడం వల్ల ప్రధానంగా గుండెపై ప్రభావం పడుతుంది. ఎంత ఒత్తిడితో కలిగి ఉన్నా రోజుల కనీసం కొన్ని నిమిషాల పాటు ప్రశాంతమైన వాతావరణాన్ని గడపాలి. ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం వంటివి చేయాలి. లేదా ఇష్టమైన మ్యూజిక్ వినాలి. వారికి నచ్చిన పనులను రోజులో కనీసం ఒక 30 నిమిషాల పాటు చేయడం వల్ల ఒత్తిడి నుంచి దూరం అవుతారు. ఇది క్రమంగా అలవాటుగా మారి ఒత్తిడికి తట్టుకోగలిగే శక్తిని పొందుతారు.
నేటి కాలంలో చాలామంది ఒత్తిడిని తగ్గించుకోవాలని కొన్ని వ్యసనాల బారిన పడుతున్నారు. కానీ ఇవి ఎంత మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిలో మధ్యపానం ధూమపానం ఎక్కువగా ఉంటున్నాయి. మద్యపానం వల్ల గుండెకు ఎప్పటికైనా ప్రమాదమేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అధికంగా మద్యం సేవించడం వల్ల హృదయ స్పందనలో తేడాలు ఉంటాయి. దీంతో భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడతాయి. అలాగే ధూమపానం వల్ల ఊపిరితిత్తుల్లో సమస్యలు ఏర్పడి ఆ తర్వాత గుండెపై ప్రభావం పడుతుంది.
పనుల కారణంగా చాలామంది నేటి కాలంలో బిజీ వాతావరణంలో గడుపుతున్నారు. దీంతో ఆరోగ్యం పై శ్రద్ధ వహించడం లేదు. కనీసం నెల లేదా రెండు నెలలకు ఒకసారి అయినా హెల్త్ చెకప్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల తమ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే ముందుగానే వాటిని పరిష్కరించుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా గుండెకు సంబంధించిన సమస్యను ముందుగానే గుర్తిస్తే తీవ్రతను తగ్గించుకోవచ్చు.