Today 12 August 2026 Horoscope: హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే చుక్కల అమావాస్య సందర్భంగా ఆగస్టు 12, 2026 బుధవారం సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ గ్రహణం కర్కాటక రాశిలో సంభవించనుందని చెబుతున్నారు. అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. అందువల్ల మన దేశానికి గ్రహణ సూతకకాలం వర్తించదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ఈ గ్రహణం ఆగస్టు 12 రాత్రి 9:04 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 13 ఉదయం 4:25 గంటలకు ముగుస్తుందని పేర్కొంటున్నారు. గ్రహణం మన దేశంలో కనిపించకపోయినప్పటికీ, జ్యోతిష్యపరంగా దీని ప్రభావం కొన్ని రాశులపై ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా శని సాడేసతి, శని ప్రభావం ఉన్న మేషం, కుంభం, మీనం, సింహం, ధనస్సు రాశుల వారికి ఈ సమయంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మేష రాశి
మేష రాశి వారు శని సాడేసతి ప్రభావంలో ఉండటంతో ఈ గ్రహణ సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మానసిక ఒత్తిడి పెరగవచ్చు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. గ్రహణం తర్వాత 15 రోజుల పాటు ముఖ్యమైన విషయాల్లో ఓపికగా వ్యవహరించడం మంచిది.
సింహ రాశి
సింహ రాశి వారికి శని ప్రభావం కారణంగా పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు లేదా న్యాయపరమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారులు కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. తొందరపాటు పెట్టుబడులు నష్టాలకు దారితీయవచ్చు.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరమని జ్యోతిష్య విశ్లేషణ చెబుతోంది. అనవసర రిస్క్‌లు తీసుకోవడం మంచిది కాదు. వ్యాపారులు తొందరపడి పెట్టుబడులు పెట్టకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ప్రత్యర్థుల కారణంగా కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ప్రయోజనకరం.
కుంభ రాశి
కుంభ రాశి వారికి గ్రహణం రోజు నుంచి తదుపరి 15 రోజుల వరకు ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో అప్రమత్తత అవసరం. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు లేదా పెద్ద మొత్తంలో ఖర్చు చేసే ముందు ఆలోచించాలి. ప్రత్యర్థులు చురుగ్గా వ్యవహరించే అవకాశం ఉండటంతో కార్యాలయం లేదా వ్యాపారంలో తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం.
మీన రాశి
మీన రాశి వారికి శని ప్రభావం కారణంగా కొన్ని పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. చిన్న విషయాలకే ఆందోళన చెందకుండా ప్రశాంతంగా వ్యవహరించాలి. ఉద్యోగులకు కార్యాలయ వాతావరణం కొంత ఒత్తిడిగా అనిపించవచ్చు. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం. వ్యాపారులు ఊహించని ఖర్చులు లేదా నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉండటంతో ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగడం మంచిది.
ఇక మిగతా రాశుల జాతకాలు ఇలా ఉండనున్నాయి..
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి సూర్యగ్రహణం లేని ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. అందువల్ల కొత్త పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదు. స్నేహితులతో కలిసి సరదాగా ఉంటారు. వ్యాపారులకు మెరుగైన లాభాలు ఉంటాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులకు కలిసి వస్తుంది.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారి నిరుద్యోగులకు శుభవార్తలు వందే అవకాశం ఉంది. ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులకు అదృష్టం వరించనుంది. వ్యాపారులకు ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఉద్యోగులు ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభ ఫలితాలే ఉండనున్నాయి. విద్యార్థుల పోటీ పరీక్షల పాల్గొంటే విజయం సాధిస్తారు. మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. పెద్దల ఆశీస్సులతో వ్యాపారులు లాభాలు పొందుతారు. దూర ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి.
కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు ధన పండుగ జరగనుంది. వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది. సూర్యగ్రహణం వేళ వీరికి అన్నీ కలిసి వస్తాయి. ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఎప్పటినుంచో ఉన్న కోరిక నెరవేరుతుంది. మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు చేసే ప్రతి పనిలో విజయం ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నదా అధికారుల నుంచి ప్రశంసలందుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. విద్యార్థుల పోటి పరీక్షలు పాల్గొంటే విజయం సాధిస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. గతంలో ఉన్న అప్పులన్నీ తొలగిపోతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. దీంతో వ్యాపారాలు అధిక లాభాలు పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈరోజు వారు ఈరోజు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు చేయకూడదు. ఉద్యోగులకు ఒత్తిడి ఉంటుంది. కొన్ని పనులు పూర్తి కావడానికి ఆలస్యం కావచ్చు. సమాజంలో గౌరవ ప్రవహిస్తుంది. ఇదే సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వార్తలు వింటారు.
మొత్తంగా చూస్తే, ఈ ఐదు రాశుల వారు సూర్యగ్రహణం తర్వాత 15 రోజుల పాటు ఆర్థిక నిర్ణయాలు, ఆరోగ్యం, కుటుంబ సంబంధాలు, ఉద్యోగం, వ్యాపార విషయాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలని జ్యోతిష్య సూచనలు చెబుతున్నాయి. అయితే ఇవన్నీ జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా చెప్పే అంచనాలు మాత్రమే. వ్యక్తిగత జాతకం, గ్రహస్థితులను బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు.