Homeటాప్ స్టోరీస్Heart health awareness : గుండె పదిలం.. అవగాహనతోనే ఆరోగ్యం: తానా - 'లీడ్ ద...

Heart health awareness : గుండె పదిలం.. అవగాహనతోనే ఆరోగ్యం: తానా – ‘లీడ్ ద పాత్’ వెబినార్‌ అద్భుత విజయం!

heart health awareness : “మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది” అనే నినాదంతో ఫిబ్రవరి ‘హార్ట్ హెల్త్ మంత్’ సందర్భంగా తానా (TANA) మరియు లీడ్ ద పాత్ ఫౌండేషన్ (Lead The Path Foundation) సంయుక్తంగా నిర్వహించిన గుండె ఆరోగ్య అవగాహన సదస్సు అత్యంత విజయవంతమైంది. ఆదివారం జూమ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు భారీ సంఖ్యలో పాల్గొని నిపుణులైన వైద్యుల సూచనలతో తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. నిపుణుల అమూల్యమైన […]

heart health awareness : “మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది” అనే నినాదంతో ఫిబ్రవరి ‘హార్ట్ హెల్త్ మంత్’ సందర్భంగా తానా (TANA) మరియు లీడ్ ద పాత్ ఫౌండేషన్ (Lead The Path Foundation) సంయుక్తంగా నిర్వహించిన గుండె ఆరోగ్య అవగాహన సదస్సు అత్యంత విజయవంతమైంది. ఆదివారం జూమ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు భారీ సంఖ్యలో పాల్గొని నిపుణులైన వైద్యుల సూచనలతో తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

నిపుణుల అమూల్యమైన సూచనలు

దాదాపు రెండు గంటల పైగా సాగిన ఈ సెషన్‌లో వైద్య నిపుణులు గుండె జబ్బులు, వాటి నివారణోపాయాలపై సమగ్రంగా వివరించారు. డాక్టర్ వేమూరి మూర్తి గారు కార్డియాక్ అరెస్ట్ (Cardiac Arrest) అంటే ఏమిటి? ఆ సమయంలో ప్రాణాలు కాపాడటానికి చేయాల్సిన CPR (Cardiopulmonary Resuscitation) విధానంపై ఆయన స్పష్టమైన అవగాహన కల్పించారు.

డాక్టర్ శ్రీని గంగసాని గారు మారుతున్న జీవనశైలిలో హార్ట్ ఎటాక్ ప్రమాదాలు, ఇతర గుండె సంబంధిత సమస్యలు.. వాటిని ముందస్తుగా గుర్తించే పద్ధతుల గురించి వివరించారు. అనంతరం ప్రేక్షకులు అడిగిన అనేక క్లిష్టమైన ప్రశ్నలకు ఆయన ఓపికగా సమాధానాలిచ్చారు. ఎన్నారైలకు అత్యద్భుతంగా ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.

ముఖ్య అతిథుల సందేశం

ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన ‘‘తానా ఎన్నారై స్టూడెంట్స్ కోఆర్డినేటర్ డాక్టర్ ఉమా కటికి’’ గారు సదస్సు ఉద్దేశ్యాన్ని వివరిస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించారు.

తానా అధ్యక్షులు డాక్టర్ నరేన్ కోడలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు ప్రసంగిస్తూ సమాజ శ్రేయస్సు కోసం ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

తానా ఫౌండేషన్ ట్రస్టీ సతీష్ మేకా తన వంతు సహకారాన్ని అందించి కార్యక్రమ విజయానికి తోడ్పడ్డారు.

ప్రశ్నోత్తరాల సెషన్‌ను ప్రణతి కలిగొట్ల సమర్థవంతంగా సమన్వయం చేశారు.

ప్రేక్షకుల స్పందన

ఇటీవలి కాలంలో జూమ్ వేదికగా జరిగిన అత్యంత విజయవంతమైన సెషన్లలో ఇది ఒకటిగా నిలిచింది. ఎన్ఆర్ఐలు తమ బిజీ షెడ్యూల్‌లోనూ దాదాపు 2 గంటల 15 నిమిషాల పాటు శ్రద్ధగా వైద్యుల మాటలను వినడం విశేషం.

కార్యక్రమం చివరలో డాక్టర్ ఉమా కటికి గారు.. ఇందులో పాల్గొన్న వైద్యులకు, తానా నాయకత్వానికి.. లీడ్ ద పాత్ ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper