Heart attack causes: ఒకప్పుడు వయసు పూర్తి అయిన తర్వాత అనేక రకాల ఆరోగ్య సమస్యలు వెంటాడేవి. వీటిలో గుండెపోటు ప్రధానంగా ఉండేవి. గతంలో 60 ఏళ్లు దాటిన తర్వాత గుండెపోటు రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకునేవారు. కానీ ప్రస్తుత కాలంలో 30 ఏళ్లు కూడా నిండని వారికి హార్ట్ ఎటాక్ ను ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి ఈ వయసులో గుండె ఎంతో ఆరోగ్యంగా ఉండాలి. కానీ గుండెపోటు రావడానికి ఆర్థిక సమస్యలే ప్రధాన కారణం అని కొందరు వైద్యులు చెబుతున్నారు. ఫైనాన్స్ విషయంలో యువత ఎక్కువగా ఒత్తిడికి గురి అయ్యే గుండెపై భారం పడుతుందని అంటున్నారు. అసలు 30 ఏళ్లకే గుండెపోటు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే?
25 ఏళ్లు నిండిన తర్వాత యువతి లేదా యువకులు, కొత్త ఉద్యోగంలో చేరుతున్నారు. ఈ సమయంలో వారు ఊహించిన దాని కంటే ఎక్కువగా డబ్బు కనిపిస్తూ ఉంటుంది. దీంతో వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా స్థాయికి మించిన వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. ఉదాహరణకు కొత్తగా ఉద్యోగం లోకి చేరిన తర్వాత ఇల్లు లేదా కారు కొనుగోలు చేస్తుంటారు. ఇవి సాధారణ ధరవి కాకుండా కోట్ల రూపాయలలో ఉన్నవి కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసే వాటికి ఈఎంఐ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈఎంఐ భారంతో చిన్నవయసులోనే ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ప్రతినెలా ఈఎంఐ కట్టాలన్న టెన్షన్తో ఇతర పనులను సరిగా చేయలేకపోతున్నారు. ఇదే సమయంలో కుటుంబం నుంచి ఏవైనా సమస్యలు ఉంటే అవి మరింత తీవ్రంగా మారి.. చిన్న వయసులోనే గుండెపోటుకు గురవుతున్నారు.
మరికొందరు అయితే తమకు వచ్చిన ఆదాయం కంటే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేయాలని అనుకుంటూ అప్పులు చేసి మరి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అనుకోకుండా దురదృష్టవశాత్తు ఉద్యోగం పోతే ఆ ఆర్థిక భారం అంతా మీద పడిపోతుంది. ఈ సమయంలో అప్లోడ్ తీర్చలేక ఎక్కువగా ఆలోచించి గుండెపోటుకు గురవుతున్నారు. కొందరు ఇలా జల్సాలు లేదా ఇతర ఖర్చులకోసం అప్పులు చేసి వాటిపై వడ్డీలు కట్టలేక వేదనకు గురవుతూ ప్రాణాలు కూడా తీసుకునేవారు ఉన్నారు.ఇవే కాకుండా ఈ సమయంలో వివాహం చేసుకుంటే.. కుటుంబ సమస్యలు కూడా తీవ్రమవుతున్నాయి. ఇలా అనేక రకాల సమస్యలతో యువత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అయితే కొత్తగా ఉద్యోగం లేదా వ్యాపారం చేసేవారు ఫైనాన్స్ ప్లానింగ్ తప్పనిసరిగా ఉండాలని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు. ఆదాయం ప్రకారమే ఖర్చులు చేయాలని.. స్థాయికి మించి ఖర్చులు చేస్తే ఆర్థిక భారం మీద పడి ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కొత్తగా ఉద్యోగంలోకి చేరిన యువత ఇలాంటి భారమైన వస్తువులు కొనుగోలు చేయకుండా డబ్బులు పొదుపు చేయడం కోసం పెట్టుబడులు పెట్టాలి. డబ్బులు ఓ మోస్తారుగా కూడా పెట్టిన తర్వాత అప్పుడు వస్తువులు కొనుగోళ్ల గురించి ఆలోచించాలి. లేకుంటే ఈఎంఐ భారంతో ఎలాంటి ప్రయోగాలు కూడా చేసే అవకాశం ఉండదు. అందువల్ల స్థాయికి మించి ఖర్చులు చేయకుండా యువత ఆలోచించాలి.