Better Life: జీవితం బాగుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ జీవితం బాగుండడానికి కొన్ని లక్షణాలను మాత్రం అలవర్చుకోలేరు. మన జీవిత ప్రయాణంలో సంతోషాలతో పాటు చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. అయితే సంతోషాలను స్వీకరించేవారు.. చేదు అనుభవాలను మాత్రం భారంగా భరిస్తారు. ఈ రెండింటినీ ఒకేలాగా భావించేవారు సంతోషంగా ఉంటారు. రెండింటినీ ఒకేలాగా ఇలా భావించాలి? అలా అనుకోవడం వల్ల ఏం జరుగుతుంది?
చాలామంది జీవితంలో మంచి పొజిషన్లో ఉండాలని కలలుగంటారు. అయితే కల నిజం అవ్వడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు తీరిక లేకుండా కష్టపడతారు. రోజంతా జరిగిన పనుల్లో కొన్ని మాత్రం నిజం కావాలని.. మరికొన్ని మాత్రం ఇది కల అయితే బాగుండు అని అనుకుంటారు. ఉదాహరణకు ఒక బంగారు ఆభరణం దొరికినట్లు కలలో కనిపిస్తుంది. ఇది నిజం అయితే ఎంత బాగుండు.. అని అనుకుంటారు. ఆ బంగారం ఎవరైనా దొంగిలిస్తే.. ఇది కల అయితే బాగుండు అని అనుకుంటారు. అంటే సంతోషాలు నిజం కావాలని.. దుఃఖాలు అబద్ధం కావాలని కోరుకుంటారు.. అలా కాకుండా ప్రతి విషయాన్ని నేను ఒకే రకంగా స్వీకరిస్తాను.. అనే జపం చేయడం వల్ల ఎప్పటికీ సంతోషంగా ఉండగలుగుతారు.
ఒక మనిషి జీవితంలో కూడా మంచి చెడులు ఉంటాయి. అయితే రెండిటినీ ఒకే రకంగా స్వీకరిస్తే వారి జీవితం సంతోషంగా ఉంటుంది. మంచిని ఒక విధంగా.. చెడును ఒక విధంగా స్వీకరిస్తే జీవితం అయోమయంగా మారుతుంది. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి.. సంతోషాలను పదిమందితో పంచుకోవాలి. ఇలా దేనికైనా ఒకే రకంగా స్వీకరించడమే అసలైన జీవితం.
ముఖ్యంగా నేటి కాలం యువత ఏ విషయం అయినా ఒకే రకంగా స్వీకరించకుండా.. కొన్నిటిని భారంగాను.. మరికొన్నింటిని సంతోషంగా స్వీకరిస్తున్నారు. ఇలా ఒడిదుడుకులు ఉండడం వల్ల మనసు ఒకే రకంగా ఉండకుండా ప్రశాంతతను కోల్పోతుంది. మనసు ప్రశాంతంగా లేకపోవడం వల్ల అనేక అనారోగ్యాలకు కూడా గురికావాల్సి వస్తుంది. అందువల్ల జీవితంలో ఏ విషయమైనా ఒకే రకంగా స్వీకరించే ప్రయత్నం చేయాలి.
ప్రతి ఒక్కరి జీవితంలో దుఃఖాలు, సంతోషాలు ఉంటాయి. కాని కొందరు కేవలం తమకు మాత్రమే కష్టాలు ఉన్నాయని బాధపడుతూ ఉంటారు. మరికొందరు మాత్రం కొన్ని విషయాలను అసలు పట్టించుకోరు. ఇలా కష్టాలు ఉన్నాయని బాధపడినా.. బాధ్యతలను పట్టించుకోకపోయినా.. భవిష్యత్తులో వారి జీవితం మగమే గోచరంగా మారుతుంది. లక్ష్యం నిర్దేశించకుండా పనులు చేస్తే ఎప్పటికీ పూర్తికావు. ఉన్నత స్థితికి రావాలంటే మొదట్లో ఎవరికైనా ఇబ్బందులు ఉంటాయి. కానీ వాటిని స్వీకరించి వాటి నుంచి బయటపడే ఆలోచన చేయాలి. ఎప్పుడు జీవితం సంతోషంగా ఉంటుందని అనుకోవడానికి ఆస్కారం లేదు. అలాగని ఎప్పుడూ కష్టాలతో జీవితం ఉంటుందని బాధపడాల్సిన పనిలేదు. రెండు రకాలుగా స్వీకరించినప్పుడే అసలైన జీవితం ఉంటుంది.