How To Handle Business Loss: జీవితంలో మంచి పొజిషన్లో ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు. ఇందుకోసం కొందరు ఉద్యోగం చేయాలని ఆసక్తి చూపుతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విధులు నిర్వహించి.. సాయంత్రం హాయిగా ఇంట్లో గడిపి.. నెల పూర్తి కాగానే జీతం అందుకోవాలని కొందరు అనుకుంటారు.. మరికొందరు మాత్రం ఒక గోల్ ను ఏర్పాటు చేసుకొని అందుకోసం తీవ్రంగా కష్టపడతారు. ఇలాంటి వారిలో వ్యాపారులు ఎక్కువగా ఉంటారు. అయితే కొందరు వ్యాపారం ప్రారంభిస్తారు.. కానీ దాన్ని సరైన విధంగా నిర్వహించలేక నష్టపోతు ఉంటారు. ఒకసారి ప్రారంభించిన వ్యాపారం సక్సెస్ కావాలంటే అందుకు సరైన ప్లానింగ్ ఉండాలి. కొన్ని ప్రముఖ సర్వే సంస్థల ప్రకారం 80 శాతం వ్యాపారులు ఇప్పుడు ఏదో ఒక రకంగా సమస్యలో ఇరుక్కున్నారు. ఇలాంటి వాటి నుంచి బయట పడాలంటే ఈ పద్ధతులు ఫాలో కావాలని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు. అవేంటంటే?
Also Read: పురుషుల్లో ఈ ఐదు లక్షణాలు ఉంటే భార్యతో కలిసి ఉండలేరు..
వ్యాపారం ప్రారంభించగానే సరిపోదు. దానిని కొనుగోలుదారులకు పరిచయం చేయాలి. అందుకోసం రకరకాల అడ్వర్టైజ్మెంట్లను వాడుకోవాలి. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియానే అతిపెద్ద అడ్వర్టైజ్మెంట్ సంస్థగా నిలుస్తుంది. దీంతో వ్యాపారం గురించి సోషల్ మీడియాలో ఇబ్బంది ముప్పడిగా పోస్టులు పెట్టడం వల్ల కొంతవరకైనా జనాలకు తెలిసిపోతుంది. అయితే ఈ పోస్టులో ఆదర్శనీయంగా ఉండడంతో కొనుగోలుదారులు ఈ సంస్థ గురించి ఆలోచిస్తారు. అందువల్ల ప్రతి వ్యాపార సంస్థకు అడ్వర్టైజ్మెంట్ ఈలకంగా ఉంటుంది.
మీరు ఒక వస్తువును అమ్మితే.. దాని ప్రత్యేకత ఏంటో కొనుగోలుదారులకు తెలియజేయాలి. మీరు ఏర్పాటు చేసుకున్న వ్యాపార సంస్థకు కొనుగోలుదారులు వచ్చినట్లయితే.. వారిని కూర్చోబెట్టి వస్తువుల గురించి వివరించాలి. వారు ప్రస్తుతం వస్తువులు కొనలేకపోయినా.. దాని గురించి వివరిస్తే మరోసారైనా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల కొనుగోలుదారులతో కమ్యూనికేషన్ చాలా అవసరం.
వ్యాపారస్తులకు టార్గెట్ అనేది చాలా అవసరం. కొన్ని రోజుల్లో లేదా ఏడాదిలో వ్యాపార అభివృద్ధిని ఎలా చేయాలి అనేదానిపై ప్రణాళిక వేసుకోవాలి. ఇందుకోసం కేవలం 10 టు 5 మాత్రమే కాకుండా నిరంతరం కష్టపడుతూ ఉండాలి. అవసరమైన చోటల్లా వ్యాపారం గురించి వివరిస్తూ ఉండాలి. ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని అందుకు అనుగుణంగా ముందుకు వెళ్తే.. తోటి వారి సహాయం కూడా ఉంటుంది.
వ్యాపారులు కొన్ని వస్తువులను ఉత్పత్తి చేస్తే వాటిని ఎవరు కొనుగోలు చేస్తారో ముందుగా తెలుసుకోవాలి. ఏ రకమైన వ్యక్తులు వాటిని ఆదరిస్తారో గుర్తించి.. వారికి అనుగుణంగా వస్తువులను విక్రయించాలి. ఇలాంటివారు ఒక ప్రదేశంలో సమూహంగా ఉంటే ఆ ప్రదేశంలో ఒక సంస్థను ఏర్పాటు చేసి ప్రయత్నించాలి. అలా మరికొన్ని చోట్ల కూడా అవసరమైన కొనుగోలుదారులను ఏర్పాటు చేసుకొని వారి కోసం మాత్రమే ప్రయత్నించాలి.
Also Read: అమ్మాయిలు ఎక్కువగా బాధపడడానికి కారణాలు ఏంటి?
వ్యాపార అభివృద్ధి చెందడానికి నిరంతరం కష్టపడుతూనే ఉండాలి. ఇందుకోసం కుటుంబ సభ్యుల మద్దతు తీసుకుంటూ ఉండాలి. అలాగే ఆర్థిక నిపుణులైన వారిని సంప్రదించి వ్యాపార అభివృద్ధికి కావాల్సిన సహాయం తీసుకుంటూ ఉండాలి. అవసరమైతే అనుభవం ఉన్న వ్యాపారులను తమ సంస్థలో నియమించుకునే ప్రయత్నం చేయాలి. మీరు ఉండడం వల్ల కొన్ని మెలకువలు చెప్పే అవకాశం ఉంటుంది.