Money Making Ideas: ప్రపంచంలో ప్రతి ఒక్కరికి డబ్బు తప్పనిసరిగా అవసరం ఉంటుంది. డబ్బులు లేకపోతే జీవితం లేదని భావన చాలామందిలో ఉంటుంది. అయితే డబ్బు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ.. ఎంతో శ్రమను ఖర్చు పెడుతూ ఉంటారు. అయినా కూడా సరైన ఆదాయాన్ని పొందలేక పోతారు. దీంతో పేదవారు పేదవారిగానే ఉండిపోతారు. కానీ పేదవారి నుంచి ఆదాయం పెరిగే వారిగా మారాలని చాలామందికి ఉంటుంది. అలా మారాలంటే కొన్ని అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. అలవాట్ల తో పాటు ఈ పనులు కూడా చేయడం వల్ల పేదరికం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మరి అవేవో చూద్దాం..
ప్రభుత్వ పథకాలు:
చాలావరకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రభుత్వ పథకాలు ప్రవేశపెడుతూ ఉంటాయి. అయితే కొందరు వీటిని దరఖాస్తు చేయడానికి బద్ధకంగా ఉంటారు. వీటిని దరఖాస్తు చేసే క్రమంలో కొంచెం తిరగాల్సి ఉంటుంది. ఈ తిరుగుడు మన వల్ల కాదు అంటూ నెగ్లెక్ట్ చేస్తారు. అలా కాకుండా ఆదాయం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా వీటి కోసం కూడా శ్రమను ఖర్చు పెట్టడం వల్ల అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొన్నిటితో చాలావరకు ఖర్చులు తగ్గి అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రభుత్వ పథకాలను తప్పనిసరిగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి.
అదనపు ఆదాయం:
కొందరు ఒకే పని చేస్తూ సంతృప్తి చెందుతారు. కానీ ప్రస్తుత కాలంలో ఏ పని చేసినా ఆదాయం తక్కువగానే వస్తుంది. దీంతో సమయం దొరికినప్పుడల్లా మరోపని చేసే ప్రయత్నం చేయాలి. ఉద్యోగంతో పాటు అదనంగా మరో ఆదాయం వచ్చే పని చేయడం వల్ల ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది. అంతేకాకుండా తక్కువ కాలంలోనే ఎక్కువగా డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలో ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
నిందలు వదలాలి:
కొంతమంది డబ్బు లేకపోవడం వల్ల తాము పేదరికంలో ఉన్నామని.. తమ జీవితం ఇంతేనని కుంగిపోతుంటారు. అలా కృంగిపోకుండా పేదరికం నుంచి బయటపడే మార్గాలు వెతుక్కోవాలి. అన్నిటికంటే ముందుగా విద్యను కొనసాగించాలి. చదువు ఒక్కటే జీవితాన్ని నిలబెడుతుంది. అందువల్ల పేదరికంలో ఉన్నవారు ధనవంతులుగా కావడానికి విద్యనే మార్గం.
ఇతరులకు సహాయం:
డబ్బు సంపాదించాలన్న ఆశతో చాలామంది స్వార్థపు బుద్ధితో ఉంటారు. తమ ఒక్కరు ఎదిగితే చాలు అన్నట్లు ఉంటారు. కానీ తమతో పాటు ఇంకొకరికి కూడా సాయం చేయడం వల్ల సమానత్వం ఏర్పడుతుంది. దీంతో భవిష్యత్తులో ఒకరికొకరు సహాయం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా కలిసికట్టుగా ఉండటం వల్ల కొన్ని పనులను సులభంగా పూర్తి చేసుకుని అవకాశం ఉంటుంది.
సమయం:
డబ్బు ఖర్చు అయితే తిరిగి సంపాదించుకునే దానికి అవకాశం ఉంటుంది. కానీ పోయిన సమయం మాత్రం తిరిగి రాదు. అందువల్ల ఉన్న సమయంలోనే ఎక్కువగా డబ్బు సంపాదించాలన్న ఆలోచన ఉండాలి. దీంతో సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా డబ్బు సంపాదన పైనే దృష్టి పెట్టాలి. కొన్నాళ్లు ఆర్థికంగా స్థిరపడిన తర్వాత సౌకర్యాలు, ఇతర సంతోషాల గురించి ఆలోచించాలి.