Tiffin Center Losses : ఉద్యోగం కంటే సొంత వ్యాపారం వల్ల ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అని అభిప్రాయపడుతుంటారు. ఇందులో భాగంగా సొంతంగా చిన్న వ్యాపారమైన ప్రారంభించడానికి ఉత్సాహం చూపుతుంటారు. అయితే ఉద్యోగం కంటే వ్యాపారం లోనే ఎక్కువగా రిస్క్ ఉంటుంది. కానీ సరైన విధంగా కష్టపడితే ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందవచ్చు. ఇటీవల కాలంలో ఎక్కువ శాతం మంది టిఫిన్ సెంటర్ బిజినెస్ చేయడంలో ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇందులో కొన్ని పొరపాట్లు చేయడం వల్ల తొందరలోనే నష్టపోతున్నారు. దీనిపై ఇప్పటికే వీటిని ఏర్పాటు చేసి అనుభవం సాధించిన వారు వాపోతున్నారు. టిఫిన్ సెంటర్ పెట్టేవాళ్లు చేసే తప్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం..
టిఫిన్ సెంటర్లకు వచ్చే కస్టమర్లకు ఇప్పటికీ వేడివేడిగా ఉండే ఫుడ్ కావాలని అంటూ ఉంటారు. ఇలాంటప్పుడు వేడిగా ఉండే దోష ను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. కానీ దోష కోసం ఏర్పాటు చేసే పెనం పెద్దదిగా ఉంటుంది. దీనిపై ఒకేసారి నాలుగు లేదా ఐదు దోషలు వేయవచ్చని అనుకుంటారు. కానీ ఒక దోశ వేసినా.. నాలుగు దోషలు వేసినా… గ్యాస్ ఖర్చు అంతే అవుతుంది. కస్టమర్లు ఎక్కువగా వస్తే పర్వాలేదు.. కానీ ఒక్కొక్క దోష వేస్తే మాత్రం ఖర్చు అధికంగా అవుతుంది. అలాగే ఇడ్లీ పాత్ర కూడా ఎప్పటికీ వేడిగా ఉంచాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి సమయంలో దీనిని వేడిగా ఉంచేందుకు నిత్యం గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఉంచాలి..
ప్రతి హోటల్ లో గ్రైండర్ కీలకంగా ఉంటుంది. ఇందులో దాదాపు నాలుగు నుంచి ఐదు కిలోల వరకు గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ చట్నీ కోసం కేవలం ఒక కిలో లోపే గ్రైండ్ చేసుకుంటారు. అయితే ఇది సరిపోకపోతే తిరిగి మరోసారి చేయడం వల్ల రెండుసార్లు గ్రైండ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఎక్కువగా చేస్తే.. వృధా అయ్యే అవకాశం ఉంటుంది.
ఇక ప్రతి హోటల్ నిర్వాహకులు చేసే ప్రధానమైన తప్పు ఏమిటంటే.. మాస్టర్లను, వర్కర్లను నియమించుకోవడంలో పొరపాటు. చాలామంది హోటల్ నిర్వహించేవారు కొన్ని పనులను వారే చేసుకుంటే చాలావరకు ఆదాయం మిగులుతుంది. ప్రతి పనిని వర్కర్ తోనే చేయించాలంటే అదనంగా ఖర్చు అవుతుంది.
ఈ విధంగా హోటల్ పెట్టాలనుకునే వారు ముందుగా అన్ని రకాలుగా ఖర్చులను భరించాలని అనుకుంటే ముందుకు వెళ్లాలి.. అంతేకాకుండా కస్టమర్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల్లోనే దీనిని ఏర్పాటు చేసుకుంటే మినిమం లాభాలు వస్తాయి. అలాకాకుండా తొందరపడి అవగాహన లేకుండా ఈ వ్యాపారం ప్రారంభిస్తే తొందరలోనే నష్టాలు వచ్చే అవకాశాలుంటాయి.