Homeఎంటర్టైన్మెంట్Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేదు అంటూ ఎమోషనల్ అయిపోయిన నిర్మాత..

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేదు అంటూ ఎమోషనల్ అయిపోయిన నిర్మాత..

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ హీరో గా నటించిన సినిమాల్లో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా , కనీసం ఫుల్ రన్ లో 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. ఆ కారణం చేత నిర్మాతకు భారీ రేంజ్ లో నష్టం వచ్చింది. ఈ చిత్రాన్ని నిర్మించింది మరెవరో కాదు , అభిషేక్ నామా. ఈయన […]

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ హీరో గా నటించిన సినిమాల్లో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా , కనీసం ఫుల్ రన్ లో 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. ఆ కారణం చేత నిర్మాతకు భారీ రేంజ్ లో నష్టం వచ్చింది. ఈ చిత్రాన్ని నిర్మించింది మరెవరో కాదు , అభిషేక్ నామా. ఈయన గతం లో ‘కత్తికేయ 2’ చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్ గా ఆయన ‘నాగబంధం’ అనే చిత్రాన్ని నిర్మిస్తూ దర్శకత్వం కూడా వహించారు. రేపు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ లో భాగంగా ఆయన అనేక ఇంటర్వ్యూస్ ఇచ్చారు.

ఒక ఇంటర్వ్యూ లో ఆయన విజయ్ దేవరకొండ పై చాలా తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ ‘విజయ్ దేవరకొండ తో నేను వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రాన్ని నిర్మించాను. భారీ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. నేను చాలా పెద్ద మొత్తమే నష్టపోయాను. అయినప్పటికీ నేను విజయ్ దేవరకొండ కి ఇచ్చిన రెమ్యూనరేషన్ లో ఒక్క పైసా కూడా వెనక్కి ఇవ్వమని అడగలేదు. ఆ నష్టాన్ని రీకవర్ చేసుకోవడానికి మా బ్యానర్ లో ఒక సినిమా చేస్తానని ఆయన మాట ఇచ్చారు. 3 సంవత్సరాలు దాటింది , ఇప్పటి వరకు ఆ అంశం పై కనీస స్పందన లేదు’ అంటూ చెప్పుకొచ్చారు అభిషేక్ నామా. అయితే ఒక్కోసారి కమిట్మెంట్స్ లో భాగంగా మర్చిపోయి ఉండొచ్చు , ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసే విజయ్ దేవరకొండ స్వయంగా అభిషేక్ కి ఫోన్ చేసి సినిమా చేద్దామని చెప్పొచ్చేమో చూద్దాం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఆయన దర్శకత్వం వహించిన ‘నాగబంధం’ సినిమా విషయానికి వస్తే , ఇందులో హీరో హీరోయిన్లు గా విరాట్ కర్ణ, నభా నటేష్ నటించారు. అనంత పద్మనాభస్వామి ఆలయ రహస్యాన్ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. బడ్జెట్ దాదాపుగా 100 కోట్ల రూపాయిల వరకు ఖర్చు చేసి ఉంటారని అంచనా. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా భారీ గానే జరిగింది. మరి రేపు ఆడియన్స్ నుండి ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper