Vijay birthday Trisha Krishnan : గత కొంతకాలం గా తెలుగు , తమిళ మీడియా లో తమిళనాడు సీఎం విజయ్ , హీరోయిన్ త్రిష జంటపై సోషల్ మీడియా లో ఎలాంటి ప్రచారం జరిగిందో మనమంతా చూశాము. తమిళనాడు రాష్ట్రానికి విజయ్ ముఖ్యమంత్రి అయ్యినప్పుడు ఆయన పేరు నేషనల్ లెవెల్ లో ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యిందో , హీరోయిన్ త్రిష పేరు కూడా అదే రేంజ్ లో ట్రెండ్ అయ్యింది. ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు తెలియజేయడం, ప్రమాణస్వీకారానికి హాజరవ్వడం, అంతే కాకుండా రెండు మూడు సందర్భాల్లో ఇద్దరు కలిసి ఒకే ఈవెంట్ కి వెళ్లడం వంటివి చాలానే జరిగాయి. అంటే మేమిద్దరం లివింగ్ రిలేషన్ లోనే ఉన్నామని జనాలకు చెప్పకనే చెప్తున్నారు. అయితే నేడు విజయ్ పుట్టిన రోజు అనే విషయం అందరికీ తెలిసిందే.
ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా విజయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపే త్రిష , ఈసారి మాత్రం ఎలాంటి శుభాకాంక్షలు తెలియచేయకపోవడం ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ హాట్ టాపిక్ గా మారింది. అటు ఇన్ స్టాగ్రామ్ లోనూ , ఇటు ట్విట్టర్ లోనూ అభిమానులు త్రిష శుభాకాంక్షలు కోసం చాలా ఆతృతగా ఎదురు చూశారు , కానీ ఆమె నుండి మాత్రం ఒక్క పోస్ట్ కూడా పడలేదు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ అంశం లో ఈమధ్య కాలం లో అత్యధికంగా త్రిష టార్గెట్ అవుతోంది , ఆమె పై ట్రోల్స్ విపరీతంగా పడుతున్నాయి, ఇప్పుడు విజయ్ కి శుభాకాంక్షలు చెప్తే ఇంకా ఎక్కువ టార్గెట్ చేస్తారు , అందుకే సైలెంట్ గా ఉందని విశ్లేషకులు అంటున్నారు . కానీ వాళ్ళు బహిరంగంగానే అనేక సందర్భాల్లో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు కదా, ఇప్పుడు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తే ఏమి అవుతుంది అని అంటున్నారు.
కచ్చితంగా వీళ్ళ మధ్య ఎదో అలజడి రేగిందని , విజయ్ తన భార్య సంగీత తో కలిసిపోబోతున్నాడు అనే వార్తల్లో నిజం ఉందని, అందుకే త్రిష విజయ్ కి దూరం గా జరిగిందంటూ సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతోంది. ఇందులో ఏది నిజం , ఏది అబద్దం అనేది పక్కన పెడితే, విజయ్ పుట్టినరోజు కి త్రిష నుండి శుభాకాంక్షలు రాకపోవడం మాత్రం , కచ్చితంగా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయమే. మరోపక్క విజయ్ వీరాభిమాని , ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా శుభాకాంక్షలు తెలియచెయ్యలేదు. ఈమెతో విజయ్ రిలేషన్ మైంటైన్ చేసేవాడని రూమర్స్ సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో ప్రచారం అయ్యాయో అందరికీ తెలిసిందే, మళ్లీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపితే ఎలాంటి నెగెటివిటీ వస్తుందో అని భయపడి ఆమె కూడా సైలెంట్ అయ్యినట్టు తెలుస్తోంది.
