Homeబిజినెస్Samsung Galaxy S26 FE : కొత్త Samsung ఫోన్.. దీని స్పెషల్ అదే.....

Samsung Galaxy S26 FE : కొత్త Samsung ఫోన్.. దీని స్పెషల్ అదే.. తెలిస్తే కొనకమానరు..

Samsung Galaxy S26 FE :  శామ్‌సంగ్ కంపెనీ నుంచి త్వరలోనే కొత్త ఫోన్ విడుదల కాబోతుంది. ‘ఫ్యాన్ ఎడిషన్’ వేరియంట్ లో వస్తున్న ఈ ఫోన్ విడుదల కాకముందే సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతోంది. గత ఏడాది వచ్చిన గెలాక్సీ ఎస్ 25 ఎఫ్ ఈ తరహాలోనే ఇది ఉండబోతుందని అంటున్నా.. ఇందులో ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయని చెబుతున్నారు. అలాగే హార్ట్ వేర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ కొత్త […]

Samsung Galaxy S26 FE :  శామ్‌సంగ్ కంపెనీ నుంచి త్వరలోనే కొత్త ఫోన్ విడుదల కాబోతుంది. ‘ఫ్యాన్ ఎడిషన్’ వేరియంట్ లో వస్తున్న ఈ ఫోన్ విడుదల కాకముందే సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతోంది. గత ఏడాది వచ్చిన గెలాక్సీ ఎస్ 25 ఎఫ్ ఈ తరహాలోనే ఇది ఉండబోతుందని అంటున్నా.. ఇందులో ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయని చెబుతున్నారు. అలాగే హార్ట్ వేర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ కొత్త ఫోన్ లో ఉన్న విశేషాలేంటో చూద్దాం..

శామ్ సంగ్ నుంచి Galaxy S26 FE అనే మొబైల్ త్వరలో రిలీజ్ కాబోతుంది. ఈ మొబైల్ లో ప్రధానంగా కెమెరా వేరియంట్ బెటర్ అని అంటున్నారు. ఎందుకంటే ఇందులో 50 మెగాపిక్సెల్ తో కూడిన మెయిన్ కెమెరాను ఉంచారు. టెలిఫోటో కెమెరా 8 మెగాపిక్సెల్ ఉండగా.. సెల్పీ కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. వీడియో రికార్డింగ్ కోసం 4కె రిజల్యూషన్ ను అందించారు.

ఈ కొత్త ఫోన్ లో హార్డ్ వేర్ పై ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో Exynos 2500 అనే చిప్‌సెట్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. దీంతో వేగంగా పనిచేసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా ఉండనుంది. అలాగే ఇందులో 6.7 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉండనుంది. అలాగే 120 హెచ్ జడ్ రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల స్క్రోలింగ్ స్మూత్ గా ఉండే అవకాశం ఉంది.

బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఉండనుంది. దీనికి 45 వాట్ వైర్డ్, 15 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే ఇందులో 12జీబీ వరకు ర్యామ్ మరియు 512జీబీ వరకు ఇన్-బిల్ట్ స్టోరేజ్ ఆప్షన్లతో రావచ్చు. ఈ ఫోన్ ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబర్ ఆరంభంలో గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేస్తుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper