Kalki 2898 AD sequel : ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సీక్వెల్స్ లో అభిమానులతో పాటు , ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సీక్వెల్ ‘కల్కి 2’. చాలా సినిమాలకు సీక్వెల్స్ ప్రకటిస్తున్నారు కానీ , అసలు సీక్వెల్ అవసరమయ్యేంత సబ్జెక్టు ఉన్న సినిమా మాత్రం ‘కల్కి’ నే, అందులో ఎలాంటి సందేహం లేదు. కల్కి జనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్న సుప్రీమ్ యాస్కీన్ ఆటలను భైరవ , అశ్వద్దామా ఎలా అరికట్టించారు?, కల్కి జననానికి వాళ్ళు ఎలాంటి యుద్ధం చేశారు అనే అంశం పైనే ‘కల్కి 2’ తెరకెక్కబోతుంది. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ని మొదలు పెట్టి , రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేశారు. ఈ రెండు షెడ్యూల్స్ లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి వారు పాల్గొన్నారు.
సెప్టెంబర్ నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతుందని డైరెక్టర్ నాగ్ అశ్విన్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఇది కాసేపు పక్కన పెడితే, ఇప్పుడు సోషల్ మీడియా లో ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న వార్త , అభిమానులను సంబరాలు చేసుకునేలా చేస్తోంది. ఈ చిత్రం లో జూనియర్ ఎన్టీఆర్ ఒక చిన్న గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడని , ఆయన పాత్ర నందమూరి అభిమానులకు ఒక విజువల్ ఫీస్ట్ లాగా ఉంటుందని , జీవితాంతం ఆ పాత్రని గుర్తించుకుంటారని అంటున్నారు. అయితే కల్కి లో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించాల్సి వస్తే, అది కచ్చితంగా శ్రీ కృష్ణుడి పాత్ర నే అయ్యుంటాది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంచనా వేస్తున్నారు. నేటి తరం స్టార్ హీరోల్లో శ్రీకృష్ణుడి పాత్రకు ఎన్టీఆర్ , మహేష్ బాబు వంటి వారు మాత్రమే సూట్ అవుతారని, ఎన్టీఆర్ నటించబోతున్నాడు అంటున్నారు కాబట్టి కచ్చితంగా శ్రీకృష్ణుడి పాత్రనే అయ్యుంటుందని అంటున్నారు.
కల్కి చిత్రం శ్రీ కృష్ణుడి ముఖాన్ని చూపించకుండా దాచి పెట్టారు , అది కచ్చితంగా ఎన్టీఆర్ కోసమే అలా సర్ప్రైజ్ ఎలిమెంట్ లాగ ఉంచారని , ‘కల్కి 2’ లో మహాభారతం ఎపిసోడ్స్ 30 నిమిషాలకు పైగానే ఉంటుంది కాబట్టి , ఎన్టీఆర్ ని రీసెంట్ గానే నాగ్ అశ్విన్ కలిసి రిక్వెస్ట్ చేసాడని , అందుకు ఎన్టీఆర్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది.
అయితే తాజా ట్విస్ట్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ కృష్ణుడిగా కాదని.. పరుశురాముడి పాత్రలో నటిస్తారని సమాచారం. ‘కల్కి-2’ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ పరశురాముడి పాత్రలో కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయన పాత్ర అతిథి పాత్ర (క్యామియో) మాత్రమేనని సమాచారం. కల్కి పురాణం ప్రకారం విష్ణువు చివరి అవతారమైన శ్రీ కల్కికి యుద్ధ విద్యలు నేర్పించే గురువు పరశురాముడు. ఈ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తే సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సెప్టెంబర్ నెలలోనే దీనిపై స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
