Homeలైఫ్ స్టైల్Good Knight Liquid : ఈ వానాకాలం దోమలను చంపడం అంత ఈజీ కాదు..

Good Knight Liquid : ఈ వానాకాలం దోమలను చంపడం అంత ఈజీ కాదు..

Good Knight Liquid :  శీర్షిక చదివారు కదా.. ఈసారి దోమలు ఏమైనా రాజమౌళి ఈగ సినిమా లాగా బలంగా మారిపోయాయా.. కొత్త శక్తులు ఏమైనా సంతరించుకున్నాయా.. లేకపోతే రోగ నిరోధక శక్తి కోసం ఏమైనా తింటున్నాయా.. ఇలానే వస్తున్నాయి కదా మీకు అనుమానాలు.. వానకాలం కాస్త వర్షం కురిసిన చాలు పిలవని చుట్టాల మాదిరిగా దోమలు వస్తూనే ఉంటాయి. దండయాత్ర చేస్తూనే ఉంటాయి. దోమతెరలు. కాయిల్స్.. ఇలా రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ దోమలు ఆగవు. దోమలు […]

Good Knight Liquid :  శీర్షిక చదివారు కదా.. ఈసారి దోమలు ఏమైనా రాజమౌళి ఈగ సినిమా లాగా బలంగా మారిపోయాయా.. కొత్త శక్తులు ఏమైనా సంతరించుకున్నాయా.. లేకపోతే రోగ నిరోధక శక్తి కోసం ఏమైనా తింటున్నాయా..

ఇలానే వస్తున్నాయి కదా మీకు అనుమానాలు.. వానకాలం కాస్త వర్షం కురిసిన చాలు పిలవని చుట్టాల మాదిరిగా దోమలు వస్తూనే ఉంటాయి. దండయాత్ర చేస్తూనే ఉంటాయి. దోమతెరలు. కాయిల్స్.. ఇలా రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ దోమలు ఆగవు. దోమలు కుట్టాయంటే రోగాలు సోకకుండా ఆగవు. దోమలు కేవలం కుట్టడంతోనే ఆగిపోవు.. వ్యాధులను బోనస్ గా ఇచ్చి వెళ్తూ ఉంటాయి.

డెంగ్యూ.. మలేరియా.. ఇలా ఎన్నో రోగాలను బహుమతిగా ఇచ్చి వెళ్తుంటాయి దోమలు.. మన రక్తాన్ని పీల్చి.. ఏమాత్రం కృతజ్ఞత లేకుండా.. వెళ్ళిపోతుంటాయి. అందువల్లే కదా దోమలను చంపడానికి గోద్రెజ్ వంటి కంపెనీ మస్కిటో కాయిల్స్.. లిక్విడ్లు అందుబాటులో తీసుకొచ్చింది. కేవలం దోమల మీదనే గోద్రెజ్ కంపెనీ వందల కోట్ల వ్యాపారం చేస్తోంది.

ఈసారి గోద్రెజ్ కంపెనీ గుడ్ నైట్ లిక్విడ్ ప్యాక్ పై ఐదు రూపాయల వరకు ధర పెంచింది. హిట్ స్ప్రే ధరను 15 రూపాయల నుంచి 40 రూపాయల వరకు పెంచింది. సింతాల్ సభ్యుల ధరలను 10 వరకు పెంచింది. ముడి సరుకు ఖర్చు పెరిగిపోవడంతోనే ధరలు పెంచాల్సి వచ్చిందని గోద్రెజ్ కంపెనీ చెబుతోంది.

ఓపెన్ మార్కెట్లో గోద్రెజ్ కంపెనీ గుడ్ నైట్ బ్రాండ్ లిక్విడ్ కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. గతంలో ధరలను అప్పుడప్పుడు పెంచిన గోద్రెజ్ కంపెనీ.. ఈసారి ఏకంగా ఐదు రూపాయల వరకు పెంచేసింది. బొద్దింకల నివారణ కోసం ఉపయోగించే హిట్ స్ప్రే పై కూడా 15 రూపాయల నుంచి 40 వరకు పెంచింది. యుద్ధం వల్ల ముడి సరుకుల ధరలు పెరిగాయని.. అందువల్లే ధరలు పెంచాల్సి వచ్చిందని గోద్రెజ్ కంపెనీ వివరణ ఇచ్చింది.

గోద్రెజ్ కంపెనీ తయారు చేసే గుడ్ నైట్ లిక్విడ్.. హిట్ స్ప్రే విక్రయాలు వాన కాలంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాన కాలంలో దోమల బెడద.. బొద్దింకల బెడద ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ వానకాలంలోనే గోద్రెజ్ కంపెనీ తన ఉత్పత్తుల ధరలను పెంచడం విశేషం. దీంతో ఈసారి దోమలను చంపడం.. బొద్దింకలను అంతం చేయడం చాలా ఖరీదుగా మారనుందని వినియోగదారులు వాపోతున్నారు. గుడ్ నైట్ లిక్విడ్ లేకుండా పడుకోవడం అసాధ్యం. హిట్ స్ప్రే చేయకుండా బొద్దింకలను అంతం చేయడం కష్టం. అందువల్లే కస్టమర్ల వీక్నెస్ మీద గోద్రెజ్ దెబ్బ కొట్టింది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper