Today 2 August 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై పూర్వాభాద్ర పద నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అన్ని విజయాలే చేకూరానున్నాయి. మరికొన్ని రాశుల వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారి మాట తీరు ఈ రోజు మెరుగుపడుతుంది. కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. అవసరమైన డబ్బు సకాలంలో అందుతుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ఆర్థిక వనరులు సమకూరుస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా గడుపుతారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారి ఉద్యోగులకు ఈరోజు తోటి వారి సహకారం ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. పిల్లల కెరియర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మిథున రాశి( మృగశిర 3,4 ): గతంలో మొదలుపెట్టిన పనులు ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. బాధ పెట్టుబడులపై అధిక లాభాలు పొందుతారు. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు సమయం అనుకూలంగా ఉంటుంది. ఏ పని మొదలుపెట్టిన దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉండడంతో వ్యాపారాలు అధిక లాభాలు పొందుతారు. ఒక్కోసారి కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగాలు ఏర్పడతాయి. ఇలాంటి సమయంలో మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారి నైపుణ్యం ప్రదర్శించడం ద్వారా ప్రశంసాలు పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ఇదే సమయంలో సమాజంలో గౌరవం లభిస్తుంది. సరైన ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయాలి. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి.
కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు కొత్తగా పెట్టుబడును పెట్టే విషయంపై దృష్టి పెడతారు. స్నేహితులతో సరదాగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాతులకు వెళ్తారు. పిల్లల కెరీర్ విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. అనవసరంగా ఎవరికి డబ్బు ఇవ్వకూడదు. గతంలో ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకోని అదృష్టం వరిస్తుంది. ఉద్యోగులు ఏదైనా పనిని ప్రారంభిస్తే దానిని వెంటనే పూర్తి చేస్తారు. మానసిక ఒత్తిడిని జయించేందుకు కొత్త వ్యక్తులను కలుస్తారు. మనసులోకి ప్రతికూల ఆలోచనలు రానివ్వకుండా ప్రశాంతంగా గడపాలి. వ్యాపారులకు అధిక లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు కొత్త ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. నైపుణ్యం ప్రదర్శించడం ద్వారా ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యంగా వ్యాయామం చేసేందుకు ప్రయత్నించాలి. ఉద్యోగులకు అవకాశాలు ఎదురు వస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులకు ధన లాభం ఎక్కువగా ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. వ్యాపారులకు అదృష్టం కలిసి వస్తుంది. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడితే దానిని వెంటనే పరిష్కరించుకోవాలి. కొన్ని విషయాల్లో మౌనంగా ఉండటమే మంచిది. కొత్త వస్తువుల కొనుగోలు విషయంలో కుటుంబ సభ్యుల సలహా తీసుకోవాలి. వ్యాపారులు పెట్టుబడులు పెట్టేముందు పెద్దలను సంప్రదించడం మంచిది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త వ్యక్తులను కలుస్తారు. దీంతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఓర్పుతో వ్యవహరించాలి. ఉద్యోగులు అనుకున్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు.