Srihari Son: తెలుగు చలన చిత్ర పరిశ్రమ చిరస్థాయిగా గుర్తించుకునే హీరోల్లో ఒకరు శ్రీహరి. ఒక సాధారణ జూనియర్ ఆర్టిస్టు గా ఇండస్ట్రీ కి పరిచయమై , ఆ తర్వాత చిన్న చిన్న విలన్ క్యారెక్టర్స్ చేస్తూ , మెయిన్ విలన్ క్యారెక్టర్స్ చేసే స్థాయికి ఎదిగారు. చిరంజీవి , మోహన్ బాబు , బాలకృష్ణ , వెంకటేష్ , నాగార్జున , పవన్ కళ్యాణ్ ఇలా అందరి సినిమాల్లోనూ విలన్ గా నటించి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అలా విలన్ గా వచ్చిన ఫేమ్ తో హీరో గా మారి , హిట్టు మీద హిట్టు కొడుతూ , రియల్ స్టార్ గా మాస్ ఆడియన్స్ లో హీరోగా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఆరోజుల్లో శ్రీహరి సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా , థియేటర్స్ లో అద్భుతంగా ఆడేవి.
ముఖ్యంగా నేల మాస్ ఆడియన్స్ తో థియేటర్స్ ఆరోజుల్లో శ్రీహరి సినిమాల కారణంగా కళకళలాడేవి. అలా హీరో గా రాణిస్తున్న సమయం లోనే ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రం ద్వారా పవర్ ఫుల్ క్యారెక్టర్ తో పలకరించిన శ్రీహరి కి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఆ సినిమా కమర్షియల్ గా సెన్సేషనల్ హిట్ అవ్వడం తో , అలాంటి కీలకమైన పాత్రలు శ్రీహరి కి ఇండస్ట్రీ లో ఎన్నో దక్కాయి. అలా నేటి తరం ఆడియన్స్ కి కూడా శ్రీహరి బాగా దగ్గరయ్యాడు. అలా కెరీర్ పీక్ రేంజ్ లో వెళ్తున్న సమయం లో ఆయన చనిపోవడం ఇండస్ట్రీ కి తీరని లోటు అనే చెప్పాలి. బ్రతికి ఉండుంటే శ్రీహరి కి కట్టప్ప లాంటి క్యారెక్టర్ దక్కేది. అలాంటివి పాన్ ఇండియా లెవెల్ లో ఎన్నో సొంతం అయ్యేవి, తిరుగులేని స్టార్ గా ఒకవెలుగు వెలిగేవాడు , కానీ దురదృష్టం , ఈరోజు ఆయన మన మధ్య లేరు.
అయితే శ్రీహరి కి ఇద్దరు కుమారులు ఉన్నారు, ఒకరి పేరు మేఘంష్ శ్రీహరి కాగా , మరొకరి శశాంక్ శ్రీహరి. అయితే వీరిలో మేఘంష్ శ్రీహరి ఇప్పటికే ఇండస్ట్రీ లోకి హీరో గా ‘రాజ్ దూత్’ అనే చిత్రం తో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. ఆడియన్స్ కి కనీసం రిలీజ్ అయ్యింది అనే విషయం కూడా తెలియదు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ మేఘంష్ కనిపించకుండా పోయాడు. సినిమాలు తనకు సూట్ అవ్వడాన్ని అనుకున్నాడో ఏమో, అందుకే సినిమాలు మానేసి వ్యాపారం , లేదా ఏదైనా ఉద్యోగం చేసుకుంటున్నాడని అందరూ ఊహించుకున్నారు. కానీ మేఘంష్ సినిమాలను వదలలేదు. ‘రాజ్ దూత్’ తర్వాత ఆయన ‘స్టూడెంట్’ అనే చిత్రాన్ని చేసాడు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ‘ఆస్మాన్ ‘ అనే మైథాలజీ మూవీ ని ప్రకటించాడు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ముఖ్య అతిధి గా పాల్గొన్నాడు. కనీసం ఈ రెండు సినిమాలతో అయినా మేఘంష్ భారీ బ్లాక్ బస్టర్స్ ని అందుకొని , తన తండ్రి లాగ ఇండస్ట్రీ లో గొప్ప స్థాయికి వేళ్తాడో లేదో చూడాలి.