Homeటాప్ స్టోరీస్Ramoji Rao : రామోజీ గతించిన తర్వాత.. ఈటీవీలో కత్తిరింపు

Ramoji Rao : రామోజీ గతించిన తర్వాత.. ఈటీవీలో కత్తిరింపు

Ramoji Rao : తెలుగులో మీడియా మొగల్ లాగా పేరు తెచ్చుకున్నారు స్వర్గీయ రామోజీరావు. తన మీద తానే ప్రయోగాలు చేసుకున్నారు. నష్టాలు వచ్చినప్పటికీ కృంగిపోలేదు.. లాభాలు వచ్చినప్పుడు పొంగిపోలేదు. పనిని మాత్రమే ప్రేమించి.. పనిలో మాత్రమే ఆనందం ఎత్తుకొని.. వ్యాపారం కోసం ఏదైనా చేసి.. లాభాల కోసం ప్రయాసపడి.. తన ఈనాడు సంస్థను ఎన్నో రకాలుగా విస్తరించిన వ్యాపారి రామోజీరావు. ఈనాడు పత్రిక.. అన్నదాత మ్యాగజిన్.. చతుర.. విపుల.. సితార.. డాల్ఫిన్ హోటల్స్.. రామోజీ ఫిలిం […]

Ramoji Rao : తెలుగులో మీడియా మొగల్ లాగా పేరు తెచ్చుకున్నారు స్వర్గీయ రామోజీరావు. తన మీద తానే ప్రయోగాలు చేసుకున్నారు. నష్టాలు వచ్చినప్పటికీ కృంగిపోలేదు.. లాభాలు వచ్చినప్పుడు పొంగిపోలేదు.

పనిని మాత్రమే ప్రేమించి.. పనిలో మాత్రమే ఆనందం ఎత్తుకొని.. వ్యాపారం కోసం ఏదైనా చేసి.. లాభాల కోసం ప్రయాసపడి.. తన ఈనాడు సంస్థను ఎన్నో రకాలుగా విస్తరించిన వ్యాపారి రామోజీరావు. ఈనాడు పత్రిక.. అన్నదాత మ్యాగజిన్.. చతుర.. విపుల.. సితార.. డాల్ఫిన్ హోటల్స్.. రామోజీ ఫిలిం సిటీ.. మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూషన్.. కళాంజలి.. మార్గదర్శి.. ప్రియా పచ్చళ్ళు.. ఈటీవీ.. ఈటీవీ భారత్.. ఇలా చెప్పుకుంటూ పోవాలే గాని ఎన్నో వ్యాపారాలను ప్రారంభించి.. వాటిని విజయవంతంగా నడిపించారు రామోజీరావు.

Ramoji Rao

ఈటీవీలో అనేక రకాలుగా ప్రయోగాలు చేశారు రామోజీరావు. తాను ఉండగానే ఈటీవీ కి సంబంధించి కొత్త కొత్త చానల్స్ ఏర్పాటు చేశారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా.. మారిన ప్రజల అభిరుచులకు అనుగుణంగా వాటిని తీర్చిదిద్దారు. ఇంతవరకు ఈటీవీలో అనేక రకాల చానల్స్ ఉన్నాయి. అయితే అందులో మ్యూజిక్ అనేది మిస్ అయింది. ఈటీవీ దగ్గర ఎన్నో పాత సినిమాలు ఉన్నాయి. వాటికి సంబంధించి లైఫ్ లాంగ్ రైట్స్ మొత్తం ఈటీవీ వద్ద మాత్రమే ఉన్నాయి. నేటి కాలంలో మ్యూజిక్ అనేది ఒక రోడ్డ కొట్టుడు వ్యవహారం లాగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఈటీవీ తన వద్ద ఉన్న పాత సినిమాల వీడియోలను.. క్యాసెట్లను దుమ్ము దులపడం మొదలుపెట్టింది. అందులో కూడా వ్యాపారం చేయడం ప్రారంభించింది. ఈ ఆగస్టు 27 నుంచి ఈటీవీ మ్యూజిక్ ప్రారంభం కానుంది.

పాత చిత్రాలకు సంబంధించిన వీడియోలు మొత్తం ఈటివి దగ్గర ఉన్నాయి. భవిష్యత్తు కాలాన్ని ముందుగానే ఊహించి రామోజీరావు దాదాపు అన్ని రకాల సినిమాల హక్కులను కొనుగోలు చేశారు. పాతాళభైరవి నుంచి మొదలు పెడితే మాయాబజార్ వరకు.. గుండమ్మ కథ నుంచి మొదలు పెడితే తాతా మనవడు వరకు ఇలా అన్ని సినిమాల హక్కులు ఈటివి దగ్గర ఉన్నాయి. అందువల్లే ఇప్పటి కాలానికి అనుగుణంగా ఈటీవీ మ్యూజిక్ అనే ఛానల్ ఏర్పాటు చేసి.. పాత సినిమా వీడియోల ద్వారా సొమ్ము చేసుకోవడానికి ఈటీవీ ప్రయత్నాలు చేస్తోంది. వాస్తవానికి ఇటువంటి ప్రయోగాలు రామోజీరావు ఉన్నప్పుడు జరిగేవి. ఇప్పుడు ఆయన గతించిన తర్వాత కూడా జరుగుతున్నాయంటే మామూలు విషయం కాదు.కాగా, ఈటీవీ అభిరుచి చానెల్ కు అతంగా వీక్షణలు లేకపోవడంతో దాని స్థానంలో ఈటీవీ మ్యూజిక్ చానల్ నెలకొల్పుతున్నట్టు సమాచారం. మొత్తానికి రామోజీరావు ఏర్పాటు చేసిన చానల్ ను పక్కనపెట్టి.. కొత్తది ఏర్పాటు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper