Homeఅంతర్జాతీయంDonald Trump : ట్రంప్ ఇలాగే వదిలేస్తే న్యూయార్క్ ను పాలించేది పాకీలే..

Donald Trump : ట్రంప్ ఇలాగే వదిలేస్తే న్యూయార్క్ ను పాలించేది పాకీలే..

Donald Trump : ఇలాగే వదిలేస్తే.. చూడకుండా పక్కన పెడితే కచ్చితంగా న్యూయార్క్ అమెరికా చేతి నుంచి జారిపోతుంది. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఆశ్చర్యం అంతకంటే అక్కర్లేదు. చీమ చిటుక్కుమన్నా అమెరికాకు ఇట్టే తెలిసిపోతుంది. ప్రపంచంలో ఏం జరుగుతుందో వెంటనే తెలుసుకుంటుంది.. తన ప్రయోజనాలకు ఏమాత్రం భంగం కలిగినా సరే వెంటనే ప్రపంచం మీద పడిపోతుంది. దాడులు చేస్తుంది. దోచుకుంటుంది. అవసరమైతే దాచుకుంటుంది. నచ్చని పాలకుల మీద దాడులు చేసి.. నార తీస్తుంది. అయితే తన […]

Donald Trump : ఇలాగే వదిలేస్తే.. చూడకుండా పక్కన పెడితే కచ్చితంగా న్యూయార్క్ అమెరికా చేతి నుంచి జారిపోతుంది. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఆశ్చర్యం అంతకంటే అక్కర్లేదు.

చీమ చిటుక్కుమన్నా అమెరికాకు ఇట్టే తెలిసిపోతుంది. ప్రపంచంలో ఏం జరుగుతుందో వెంటనే తెలుసుకుంటుంది.. తన ప్రయోజనాలకు ఏమాత్రం భంగం కలిగినా సరే వెంటనే ప్రపంచం మీద పడిపోతుంది. దాడులు చేస్తుంది. దోచుకుంటుంది. అవసరమైతే దాచుకుంటుంది. నచ్చని పాలకుల మీద దాడులు చేసి.. నార తీస్తుంది. అయితే తన కింది నలుపు మాత్రం అమెరికా గుర్తించడం లేదు. తన గుండెకాయ లాంటి న్యూయార్క్ నగరంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో అమెరికా గుర్తించడం లేదు.

అమెరికాకు న్యూయార్క్ గుండెకాయ లాంటి నగరం.. ఆ నగరంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో జోహారన్ మందాని గెలిచారు. న్యూయార్క్ మేయర్ గా బాధ్యతలు స్వీకరించారు. వాస్తవానికి ఈయన భారత దేశానికి వ్యతిరేకి. అమెరికాలో ఉంటూ అమెరికా దేశానికి కూడా వ్యతిరేకి. ఈయనకు ముస్లిం భావజాలం అంటే చాలా ఇష్టం. అందువల్లే ఈయన పరిపాలన కాలంలో ఇటీవల కాలంలో న్యూయార్క్ నగరంలో తీవ్రవాదుల దాడులు పెరిగిపోయాయి.

ఒక పరిశోధన నివేదిక ప్రకారం మందాని బాధ్యతలు స్వీకరించిన తర్వాత న్యూయార్క్ లో మతపరమైన తీవ్రవాద సంఘటనలు దాదాపు 243 శాతం పెరిగాయి. మాన్ హట్టన్ ప్రాంతంలో జరిగిన దాడులు.. యూదుల ప్రార్థనా మందిరాలపై (సినగాగ్స్) జరిగిన దాడుల ప్రయత్నాలు భద్రతాపరమైన లోపాలకు ప్రధానమైన నిదర్శనాలు. మరోవైపు ఈ ప్రాంతంలో యువతను తీవ్రవాదం వైపు ప్రేరేపించే కార్యకలాపాలు ఇటీవల కాలంలో ఇక్కడ పెరిగిపోయాయి. కొంతమంది ప్రార్థన మందిరాలలో బోధనలు చేయడం.. అవి హింసను ప్రేరేపించే విధంగా ఉండడంతో న్యూయార్క్ నగరంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఈ పరిణామాలు అమెరికాలోని మానవ హక్కుల సంఘాలు.. అక్కడి ప్రజాక్షేత్రాలలో విస్తృతమైన చర్చకి దారితీసాయి. ఇవన్నీ నాయకత్వ లోపానికి బలమైన నిదర్శనంగా నిలుస్తున్నాయి.

న్యూయార్క్ నగరంలో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అమెరికా పరిపాలనకు సంబంధించిన వ్యవస్థలు మొత్తం అక్కడ ఉంటాయి. అమెరికాకు మేజర్ ఆదాయం కూడా న్యూయార్క్ నగరం నుంచి వస్తూ ఉంటుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ అమెరికా ప్రభుత్వం పట్టించుకోకపోవడం.. ట్రంప్ విస్మరించడం అక్కడి ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఇప్పటికైనా న్యూయార్క్ నగరంలో చాప కింద నీరు లాగా విస్తరిస్తున్న ఉగ్రవాదాన్ని.. రాడికల్ ఉద్యమాలను ట్రంప్ ఉక్కు పాదంతో తొక్కివేయకపోతే భవిష్యత్తు కాలంలో మరిన్ని తీవ్రమైన పరిణామాలను అమెరికా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే జరిగితే న్యూయార్క్ మీద అమెరికా ఆశలు వదులుకొని.. ఓ వర్గం వారికి అప్పజెప్పాల్సి ఉంటుంది. వచ్చే రోజుల్లో ఇలాగే ఉంటే న్యూయార్క్ నగరాన్ని పాకీలు పరిపాలించిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper