Homeఆంధ్రప్రదేశ్‌Vallabhaneni Vamsi : "చంద్రబాబు గారు".. వల్లభనేని వంశీకి కాలం చెప్పిన గుణపాఠమిది..

Vallabhaneni Vamsi : “చంద్రబాబు గారు”.. వల్లభనేని వంశీకి కాలం చెప్పిన గుణపాఠమిది..

Vallabhaneni Vamsi : వయసుకు గౌరవం ఇవ్వాలి. అనుభవానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇది తెలియాలంటే గొప్ప గొప్ప చదువులు చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనిషి పుట్టుక పుడితే చాలు. కానీ కొందరికి ఇది అర్థం కాదు. గొప్ప గొప్ప చదువులు చదివినా సరే వాళ్లకు ఇది తెలియదు. పైగా మూర్ఖుల లాగా వ్యవహరిస్తుంటారు. మనిషి తనం తెలియని వ్యక్తులు లాగా ప్రవర్తిస్తుంటారు. వాపును చూసి బలుపు అనుకొని మిడిసి పడుతుంటారు. చివరికి తప్పు తెలుసుకొని మూసుకుంటారు. […]

Vallabhaneni Vamsi : వయసుకు గౌరవం ఇవ్వాలి. అనుభవానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇది తెలియాలంటే గొప్ప గొప్ప చదువులు చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనిషి పుట్టుక పుడితే చాలు. కానీ కొందరికి ఇది అర్థం కాదు. గొప్ప గొప్ప చదువులు చదివినా సరే వాళ్లకు ఇది తెలియదు. పైగా మూర్ఖుల లాగా వ్యవహరిస్తుంటారు. మనిషి తనం తెలియని వ్యక్తులు లాగా ప్రవర్తిస్తుంటారు. వాపును చూసి బలుపు అనుకొని మిడిసి పడుతుంటారు. చివరికి తప్పు తెలుసుకొని మూసుకుంటారు. కాకపోతే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ స్టోరీ ఈ రాజకీయ నాయకుడికి నూటికి నూరు పాళ్లు కాదు.. కోటి పాళ్లు సరిపోతుంది..

2019 అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ పోటీ చేశారు. ఆయన తన సమీప వైసిపి అభ్యర్థి మీద గెలిచారు. గెలిచిన తర్వాత వంశీ మోహన్ స్వరం మార్చారు. పసుపు రంగు జెండాను పక్కనపెట్టి వైసిపి జెండాను ఎత్తుకున్నారు. జగన్ అజెండాతో మాట్లాడడం మొదలుపెట్టారు. తనకు అవకాశం ఇచ్చిన టిడిపిని ఎడమ కాలితో తన్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన చంద్రబాబును వ్యక్తిగతంగా దూషించడం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడుని ఏకవాక్య సంబోధన చేశారు. శాసనసభలో బూతు పురాణం చేశారు. ఏ రాజకీయ నాయకుడు మాట్లాడని విధంగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు శోకించేందుకు కారణమయ్యారు. అక్కడితోనే ఆగిపోలేదు.. ఇంకా చాలా చేశారు.

అధికారం మదంతో.. జగన్ అండతో రెచ్చిపోయారు. కాలం వేగంగా తిరిగింది. అధికారం వైసీపీ నుంచి కూటమికి బదిలీ అయింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. నారా లోకేష్ ఐటి.. విద్యాశాఖ మంత్రి అయ్యారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. అప్పటిదాకా మిడిచిపడిన వల్లభనేని వంశీకి సినిమా ప్రారంభమైంది. తాను చేసిన తప్పు తెలిసిపోయింది. కానీ ఏపీ పోలీసులు ఊరుకోరు కదా.. ట్రీట్మెంట్ ఇచ్చారు. అప్పటిదాకా దసరా బుల్లోడు మాదిరిగా కనిపించిన వంశీ.. మారిపోయారు. జుట్టు రంగు వెలిసింది.. నోటికి మాస్క్ వచ్చింది.. అడుగు తీసి అడుగు వేయడం కష్టంగా మారింది. జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన ఆయన పరిస్థితి దారుణంగా మారిపోయింది.

ఎప్పుడైతే చంద్రబాబును ఏకవాక్యంతో సంభోదన చేశారో.. అప్పుడే వంశీ మోహన్ తన విలువను కోల్పోయారు. ఇప్పుడు చంద్రబాబుకు లేఖ రాశారు. అది కూడా గన్నవరం విమానాశ్రయంలో టెర్మినల్ నిర్మాణానికి సంబంధించి అసంపూర్తి పనులు పూర్తి చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అందులో చంద్రబాబు నాయుడు ను.. చంద్రబాబు నాయుడు గారు అంటూ పేర్కొన్నారు. దీనినే కాలం చెప్పిన గుణపాఠం అంటారేమో..

Vallabhaneni Vamsi

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper